కొన్నేల్ల క్రితం మాట.. ఒకానొక రోజు, ఇంటర్లో మా క్లాస్మేట్ ఐన ఓ అమ్మాయినుండి ఫోన్ వచ్చింది. తను ఇంటర్ తర్వాత తెనాలిలోని ఓ ప్రముఖ క్రిష్టియన్ కాలేజీలో డిగ్రీ చేసి, ప్రస్తుతం హైదరాబాద్లోనే PG చేస్తున్నట్లు చెప్పి, వీలైతే ఓ వీకెండ్ మీటవుదామని అడిగింది. ఎప్పుడూ లేంది ఇలా అడుగుతుందేమిటా అనుకుంటూ, ఆ నెక్ష్ట్ వీకెండే క్రిష్ణకాంత్ పార్క్ దగ్గర మీటవుదామని ప్లాన్ చేసుకున్నాము. ఇంటర్ తర్వాత అదే మొదటిసారి తనని చూడ్డం. అప్పటికి తను చాలా మారిపోయి ఉంది. ముఖాన బొట్టు,కమ్మలు లాంటి అలంకరనలేవీ లేకుండా, బాగా ఏడ్చి మొఖం ఉబ్బిపోయినట్లు చాలా డల్ గా ఉండటంతో ఏదో ప్రాబ్లంస్ లో ఉన్నట్లుందనుకుని విషయం ఏంటని అడిగాను. అలాంటివేమీ లేవనీ, ఒకప్పుడు చాలా బాధల్లో ఉండేదాన్ననీ, కానీ జీసస్ ని నమ్మడం మొదలు పెట్టినప్పట్నుంచి తను చాలా హ్యాపీగా ఉంటున్నట్లు చెప్పింది. తాను బాప్టిజం స్వీకరించాననీ, పెళ్ళి లాంటి ఆలోచనలేవీ తనకు లేవనీ, నన్ గా మారి జనాలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాననీ,ఈ విషయంపై ఇంట్లో గొడవపడి బయటికి వచ్చేశాననీ, ప్రస్తుతం మిషనరీ వారే ఆమెను చదివిస్తున్నారనీ చెప్పింది. పైగా జీసస్ ను నమ్మటం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో వివరిస్తూ అనేక ఉదాహరణలు ఇవ్వడం మొదలుపెట్టింది. తమ హాస్టల్లో ఎవరో అమ్మాయికి ఏదో జబ్బు నయమైనట్లు, ఇంకొకరికి ఎవరికో బాప్టిజం తీసుకున్న మర్నాడే ఉద్యోగం వచ్చినట్లు.. ఇలా అనర్గళంగా చెప్పుకుంటూ పోసాగింది.
తను ఎందుకు కలుద్దామందో అప్పటికి కాని నాకు అర్థం కాలేదు.
కాసేపటికి తను వెంట తెచ్చుకున్న బట్ట సంచిలో నుండి ఓ బైబిల్ని తీసి దానిలో ఎన్ని అద్భుత విషయాలున్నాయో చెప్పడం మొదలుపెట్టింది. అసలు బైబిల్లో లేని విషయమంటూ లేదనీ, దావీదు, ఇజ్రాయేలు, బెత్లహాము,రక్తంతో పాపాల్ని కడగడం ఇలా ఏదేదో చెప్పుకుంటూ పోసాగింది. వీకెండు చక్కగా ఏ సినిమాకో వెల్లక ఇలా బుక్కయ్యానేంటా అనుకుంటూ, మధ్యలో అడ్డుపడితే ఫీలవుతుందేమోనని ఆమె చెప్పేవన్నీ సైలెంటుగా, తలాడిస్తూ వింటూ కూర్చున్నా. నా మౌనాన్ని అంగీకారంగా భావించి, ఆమె ఓ రకమైన ట్రాన్స్ లోకి వెల్లిపోయి ఇతర మతాలనేవి ఎంత బూటకమో వివరిస్తూ, దేవుడు, క్రీస్తు రూపంలో ఎలా మానవుడిగా భూమిమీద నడిచాడో, డాక్టర్ కాకపోయినప్పటికీ రోగులకు ఎలా స్వస్థత చేకూర్చాడో చెప్పుకుంటూ పోయింది.అలా సుమారు ఓ అరగంట ప్రసంగం తర్వాత, 'చెప్పు ఇప్పటికైనా నమ్ముతావా లేదా' అని అడిగింది. పార్కుకు రమ్మనగానే, ఎగేసుకుంటూ వచ్చినందుకు నాకు తగిన శాస్తే జరిగిందనుకుంటూ ఇంకేదో ఆలోచిస్తున్న నేను, ఇప్పడుకానీ నోరు తెరవకుంటే ఈవిడ మల్లీ ఇంకో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేస్తుందనుకుని,
'ఇంత చెప్పింతర్వాత ఇంకా నమ్మకుండా ఎలా ఉంటాను. నేను కూడా మతం మారతాను, పేరు కూడా మార్చుకుంటాను. ఏ పేరైతే బాగుంటుంది.. 'జానీ'(అప్పట్లో మనం పవన్ కల్యాన్ ఫ్యాన్!! ) అనేది క్రిష్టియన్ పేరేనా..? మహ్మద్ జానీ అని ఎవరో ముస్లిం లీడర్ ఉన్నాడుకదా, ఇంకేదైనా పేరు చెప్పు' అన్నాను.
అప్పుడు ఆమె మొఖంలో వెయ్యివోల్టుల వెలుగు నాకిప్పటికీ గుర్తే.
'థ్యాంక్స్, నాకు తెలుసు నువ్వు మారతావని. 'డేవిడ్ జాన్' అని పెట్టుకో చాలా మంచి పేరు' అంది. 'రేపే నిన్ను చర్చి ఫాదర్ దగ్గరికి తీసుకెల్తా'నంది.
'సరే అలాగే వెల్దాం కానీ, నాదో చిన్న కండీషన్' అన్నాను.
'ఏంటో చెప్పు' అంది.
'ఇప్పుడు నువ్వు PG చేస్తున్నావ్ కదా, ఆ PG నువ్వు ఫస్టు క్లాసులో పాసవ్వాలి అప్పుడే నేను మతం మారతా'నన్నాను.
'ఓస్ అంతేనా, సరే నేను తప్పకుండా పాసై రిజల్ట్స్ రాగానే నిన్ను కలుస్తా, సరేనా?, అప్పటిదాకా ఈ బైబిల్ నీదగ్గరే ఉంచుకో, ఇది చదువుతుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది.'- అంది.
'సరే, కాకపోతే బైబిల్ నీ దగ్గరే ఉంచుకో, నీ మిగతా PG బుక్స్ అన్నీ తెచ్చి నాకివ్వు ', అన్నాను.
'అదేంటి, బుక్స్ చదవకుండా పాస్ కావడం ఎలా.?' అయోమయంగా అడిగింది.
'బైబిల్లో అన్ని విషయాలు ఉన్నాయ్ అన్నావ్ కదా, మరి అది చదివి PG పాస్ కాలేమా?' అన్నాను.
'హ్మ్మ్.. అన్నీ అంటే, సబ్జెక్ట్ విషయాలని కాదు'- అంది.
'మరి ఎలాంటి విషయాలుంటాయ్?' అన్నాను.
అంటే, జీసస్ ఎలా పుట్టాడు, ప్రజల్ని ఎలా సేవ్ చేశాడు, జీసస్ ని ఎలా సిలువ చేశారు లాంటివి..- అంది.
"ఓ అవా.. అవన్నీ నేను ఆల్రెడీ 'కరునామయుడు' సినిమాలోనే చూసేశా ను,ఆ మూవీ చాలా బాగుంటుంది- అన్నాను.
'అవే కాదు, ఇంకా బానిసల్ని ఎలా చూడాలి, వారి రైట్స్ ఏముంటాయి లాంటివన్నీ ఉంటాయి'- అంది.
'నేను ఎవరికీ బానిసను కాదు, నా కిందెవరూ బాసినలు లేరు, మరి నేనవి తెలుసుకోవడం అవసరమా?' -అన్నాను.
హ్హ్మ్మ్.. నువ్వు నన్ను కంఫ్యూజ్ చేస్తున్నావంది '- అమాయకంగా ఫేస్ పెట్టి.
'ఇందులో కంఫ్యూజన్ ఏం లేదు. ఓ హిందువు రామాయన/భారత శ్లోకాలు, గాయత్రీ మంత్రం, హనుమాన్ చాలిసా లాంటివి చదువుతాడు, క్లాసు పుస్తకాలూ చదువుతాడు పాసవుతాడు. ఓ ముస్లిం ఖురాన్ చదువుతాడు,క్లాసుపుస్తకాలూ చదువుతాడు పాసవుతాడు. మరి ఓ క్రిష్టియన్ కూడా బైబిల్తో పాటు, క్లాసుపుస్తకాలు చదివితేనే పాసయ్యేటట్లైతే ఇంక బైబిల్ స్పెషాలిటీ ఏంటి..? ఆ మాత్రం దానికి మతం మార్చుకోవడం ఎందుకు? ఓ హిందువూ, ఓ ముస్లిమూ చేయలేనిదీ, కేవలం ఓ క్రిష్టియన్ మాత్రమే చేయగలిగింది ఏదైనా ఉంటే చెప్పు, ఉదాహరణకి క్రిష్టియన్లందరూ ఎక్కువకాలం బతుకుతారనిగానీ, క్రిష్టియన్లందరూ ఆరోగ్యంగా,సంతోషంగా ఉంటారని గానీ, లేదా క్రిష్టియన్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వర్షాలు చక్కగా పడతాయని గానీ ఇలాంటి ఏవైనా ఉంటే చెప్పు ఈ క్షణమే నేను కూడా మతం మార్చుకుంటా' - నన్నాను.
తను ఏమీ మాట్లాడకుండా బ్లాంక్ ఫేసుతో వింటుంది.
'మతం ఏదైనా అదికేవలం ఓ నమ్మకం మాత్రమే. ఏ మతం కూడా రీజనింగ్ కి నిలవదు. అలాంటప్పుడు ఫలానా మతం మంచిదని, ఫలానా మతం చెడ్డదని చెప్పటం మీనింగ్ లెస్. ఈ మతం బాగలేదని మరో మతంలోకి జంప్ కావడం,పైగా దీనికోసం ఇన్నాల్లూ పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులతో గొడవపడటం మూర్ఖత్వం తప్ప మరేం కాదు'
ఇలా నా వీకెండ్ వేస్టైందనే బాధతో, ఆవేదనతో ఏవో నాలుగు భారీ డైలాగులని చెప్పాను.తను మాత్రం కల్లు తెరిచి కోమాలో ఉన్నట్లు సీరియస్ గా వింటుంది. తను నిజంగానే వింటుందో, లేక నాకు నెక్ష్ట్ బ్రైన్వాష్ సెషన్ కి మాటర్ ప్రిపేర్ చేసుకుంటుందేమోననే అనుమానం కూడా కలిగింది. ఇక ఇక్కడ ఎక్కువసేపు ఉండటం అనవసరం అనుకుని, మతం గురించి ఇంకో నాలుగు డైలాగులు వదిలి నాకు అర్జంటు పని ఉంది, వెల్దాం పద అని అక్కడి నుంచి వచ్చేశాము.
ఆ తర్వాత తననెప్పుడూ కలిసే ప్రయత్నం చేయలేదు. ఏ మిషనరీలోనో చేరిపోయి ఉంటుందనుకుని ఆ విషయం మరిచిపోయాను.
సీన్ కట్ చేస్తే..
సుమారు 3 సంవత్సరాల తర్వాత, మా ఊరికి వెల్లే బస్సులో చంకలో ఓ ఏడాది వయసున్న బుజ్జి బాబుతో ఆమె సడన్ గా తారసపడింది.
'హాయ్, ఎలా ఉన్నావ్, ఎవరీ బాబు?' అన్నాను.
'నా కొడుకే' అంది.
'పెల్లి చేసుకున్నావా.?, ' అప్రయతంగానే అనేశాను.
'ఏం మాట్లాడుతున్నావ్', అంది ఇబ్బందిగా ఫేస్ పెట్టి.
'ఓ..సారీ, అప్పుడేదో నన్, సేవ, పెల్లి చేసుకోను అన్నావ్ కదా అదేమైంది?' అన్నాను.
'అలా వెల్దామనే అనుకున్నాను, కానీ, ఏదో నీ పుణ్యం వల్ల ఇలా ఉన్నా' నంది.
'అదేంటి నేనేం చేశాను, కాస్త అర్థమయ్యేలా చెప్పు' అన్నాను.
'అదే, అప్పుడు నీతో మాట్లాడానుకదా, పార్కులో.. ఆ తర్వాత బాగా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. దానితో ఇక అవన్నీ వదిలేసి మరుసటి రోజే ఇంటికెల్లి పోయాను. తర్వాత, ఇంట్లోవాల్లు ఓ మంచి సంబంధం ఖాయం చేశారు. పెల్లికి నిన్ను పిలుద్దామనుకున్నాను కానీ, నువ్వు ఎక్కడో ఆన్సైట్లో ఉన్నావని తెలిసింది,దాంతో కుదర్లేదు. -అంది
ఓహ్.. నా వాగుడికి ఇంత పవర్ ఉందా అని.. ఆశ్చర్యంతో కూడిన గర్వం వల్ల వచ్చిన ఆనందం కలిగి, ఏ..షబాశ్..షబాశ్.. అని నన్ను నేనే భుజం చరుచుకున్నా.
'సరే, ఇంతకీ బాబు పేరేంటి' అన్నాను, గులాబ్ జాం లాంటి బాబు మెత్తటి బుగ్గలు నిమురుతూ..
''హిమనేష్' -శివుడి పేరు,బాగుందా?' అంది.
'డేవిడ్ జాన్' అంత పవర్ ఫుల్ గా లేదు గానీ, బాగానే ఉంది' అన్నాను.
'నువ్వు మరీ ఎక్కువ చేయకు' అంది, నవ్వుతూ.. ఇంతలో డ్రైవర్ బస్సు స్టార్ట్ చేయడంతో, బై చెప్పి వెల్లి సీట్లో కూర్చున్నా..బస్సు రివ్వున దూసుకెల్లింది కర్నూల్,కడప వైపుకు.. - The End.

chaala baaga chepparu andi.. Meeru cheppendi 100% correct.....
ReplyDeleteThanks, Hemadri gaaru.
Deletechala chala chala bagundi.
ReplyDeletechaalaa Thanks, సన్నాయి రాగాలు gaaru.
Deleteనేను క్రైస్తవుడను, మీరు చెప్పింది/చేసింది చాలా బాగుంది. మీలాంటి వారి వలన క్రైస్తవ మతము , హిందూ మతము రెండూ బాగుపడతాయి. ఇలాంటి వాళ్ళు నాకు చాలా మంది తెలుసు, మీ దగ్గరకు కౌన్సిల్లింగ్ కి పంపమంటారా?
ReplyDeleteరాజశేఖర్ గారూ, పాజిటివ్ గా తీసుకున్నందుకు, అట్లే బాగుందని చెప్పినందుకు ధన్యవాదములు. నన్ను పిలిచి మరీ 'బ్రైన్ వాష్' చేసిందనే ఆక్రోశంతో, నేను కూడా రివర్స్ బ్రైన్ వాష్ చేశానే తప్ప, మతాల్ని బాగు చేద్దామనేంత 'ఇది ' నాకు లేదు. ఐనా నాకు కౌన్సిలింగులిచ్చేంత ఉందంటారా? ఐతే చూద్దాం. ITలో రిసెషన్ ఏదో వస్తుందంటున్నారు, అదే గనక వచ్చి ఇప్పుడు చేస్తున్న జాబ్ గానీ ఊడిపోతే నెక్ష్ట్ అదే ట్రై చేస్తా. గిట్టుబాటుని బట్టి, ఇటు వారిని అటు, అటు వారిని ఇటు కౌన్సిలింగులే కౌన్సిలింగులు.. Thanks.
Deleteమీరు చెప్పింది 10000% నిజం. మతంతో వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువయిపోతున్నారు. క్రిష్టియానిటి అంటేనే మార్కెటింగ్ మతం. పైగా చైన్ లింక్ మతం. మనతో పాటు మరో పదిమందిని మారిస్తేనే లాభం. మీరు చేసిన పని మాత్రం నిజంగా గ్రేట్.
ReplyDeleteజగదీష్ గారూ,
Deleteచాలా థ్యాంక్స్. ప్రతి మతం లోనూ, తమ మతం పై సరైన అవగాహన ఉన్నవారు/లేనివారూ, మంచి వారు/చెడ్డవారు ఇలా అందరూ ఉంటారు. మనం చూసిన ఏ కొందరినో బేస్ చేసుకుని మొత్తం మతాన్ని ఒకే గాటన కట్టి విమర్శించటం కరెక్ట్ కాదనుకుంటా. అట్లే క్రిష్టియానిటీలో కూడా కొందరు మతవ్యాప్తికై తపించే వారు ఉన్నమాట వాస్తవమే, అంత మాత్రాన క్రైస్తవులందరూ అలాంటివారేనని చెప్పడం సరి కాదు. దేశంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో ఆసుపత్రులు,విధ్యాలయాలు స్థాపించి నిస్వార్థ సేవ చేస్తున్న అనేక క్రైస్తవ మిషనరీల్ని నేను ప్రత్యక్షంగా చూసి ఉన్నాను. Thanks for the comment.
aalochana uMte ee anardhaalu umdavu evadu namminadaanini vaadu aacharistaadu itarulanu gouravistaadu
ReplyDeletemamchi post
Thanks, Durgeswara gaaru
Deleteనన్ గా మారాలనుకుని ఇంట్లో గొడవ పడిన అమ్మాయి, మీ మాటలకు అంత త్వరగా మారిపోవటం మాత్రం చాలా ఆశ్చర్యంగానే ఉంది! ఆమె మత నమ్మకాలనే త్యజించగలిగివుంటే ఇంకా బాగుండేది.. అయితే అలాంటి మార్పు ‘ఇతరుల ప్రబోధాల’ వల్ల కాకుండా స్వీయానుభవాల వల్ల/ఆలోచనాశక్తిని పెంచే పుస్తకాల వల్ల సాధ్యమవుతుంది, సాధారణంగా!
ReplyDeleteఅదే ఆశ్చర్యం మొదటిసారి విన్నప్పుడు నాకూ కలిగింది. కాకపోతే, ఆమె మొదట మతం మారడానికి కూడా పెద్దగా సైద్ధాంతిక ప్రాతిపదిక లేదనుకుంటా.(మెరుపు కలలు లాంటి సినిమాలు క్రిష్టియానిటీ, నన్ లాంటి పదాల్ని గ్లామరైజ్ చేయబడి ఉండటం ఓ కారణం అయి ఉండవచ్చు). అందుకే తిరిగి వెనక్కు మారడం కూడా ఈజీగా జరిగిపొఇంది. జస్ట్ కొంత రీజనింగ్, కొన్ని ఎమోషనల్ డైలాగులతో. Thanks.
DeleteI can't stop laughing
ReplyDelete@ఓహ్.. నా వాగుడికి ఇంత పవర్ ఉందా అని.. ఆశ్చర్యంతో కూడిన గర్వం వల్ల వచ్చిన ఆనందం కలిగి, ఏ..షబాశ్..షబాశ్.. అని నన్ను నేనే భుజం చరుచుకున్నా. @
Sebbaash
@Mauli garu & రహ్మానుద్దీన్ షేక్ garu.
ReplyDeleteThanks. :)
Cheekati garu..Story bagundi..Manam nityam eelantivi custune untam.. okapudu manam vineuntam..n vintunum kuda...cut cheste..enti ante.. preti street ki/preeti city/village ki manam churches chustuuntam n loud speakers peti seinars n kirtanalu cheputu untaru...chala badaga untundi manam exam ki prepare avutunte...pakane loud speker sounds..Mana supreme court bible ni shunamga chadivi..church fathers(scholors) ni piichi .. Madi(gunde) talupulu terichi ..gudi talupulu musi prayer chesuko mandi..andi..real judgement. kani adi jargaledu....Mi article chusi evaro church father anukunta counsiling ki mi degara pamputanu ani...ee pani naku etuvanti situation yeduroste .mi article lo matalu nenu chepi... shabash sabash anukonta...:) final ga movie lo elanti di ok scene pedte...bagauntundi.. chudam...Good work..
ReplyDeleteఫిరోజ్ గారూ,
ReplyDeleteThanks for the good words. కాకపోతే, ఇది స్టోరీ కాదు. నిజంగానే జరిగిన సంఘటన.(కాస్త డైలాగులు అటూ,ఇటుగా).
ఇక క్రిష్టియన్ల లౌడ్ స్పీకర్ల బారిన నేను కూడా చాలా సార్లు పడ్డాను. అట్లే మాంచి నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుఝామున మసీదుల నుండి వచ్చే శబ్దాలు,బోనాలు,వినాయక మండపాలలోని లౌడ్ స్పీకర్లు, దీపావళి టపాసుల శబ్దాలు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ఇతర మతస్థుల్ని ఇలాగే చికాకు పెడుతుంటాయి. మతాన్ని సంకుచిత కోణం నుండి చూడ్డం వల్ల కలిగే అనర్థాలే ఇవన్నీ. Thanks.
సర్ మీ పేరు ఏమిటో తెలీదు, ఇక పొతే మీరన్నది నిజం, ఏ సిద్దాంతాలు ఇతరుల మీద రుద్దకూడదు. కానీ యా సమయంలో వారు ఓ విదమైన ట్రాన్స్లో ఉంటారు అంతే
ReplyDeleteచీకటినుంచి వెలుగుకు ప్రయాణం చేయించారు మీ స్నేహితురాలితో(అజ్ఞానంనుంచి జ్ఞానంవైపు)!
ReplyDeleteThank You,
ReplyDeletemeraj fathima & చిలమకూరు విజయమోహన్ garu.
"చీకటి నా కిష్టం! చీకటి శాశ్వతం! తల్లి గర్భం లో చీకటి- పుడమి గర్భం లో చీకటి, కన్న తల్లి గర్భం లో నుండి పుడమి తల్లి గర్భం లోకి(సమాధిలోకి) ప్రయాణమే జీవితం. మరో మాటలొ - చీకట్లోంచి చీకట్లోకి, మధ్యలొ ఈ వెలుగు కేవలం కొన్నాల్ల మజిలి. వెలుగు రెచ్చగొడుతుంది - చీకటి ప్రశాంతంగ ఉండమంటుంది. వెలుగు ఓ నటన - చీకటి ఓ నిజం. వెలుగులో ఉండి కూడా చీకట్లోని ప్రశాంతతని అనుభవించగలగడమే- నా ద్రుష్ఠిలొ పెద్ద విజయం - దాని కొసమే నా ప్రయాణం..."... Idhi mee introduction loni line... aripinchesharandi mee cheekati tho... inkomatlo cheppalante, touch ayyindandi.. :-)
ReplyDeleteChiranjeevi garu,
ReplyDeleteThanks for the good words.
super sir.
ReplyDeleteThanks Draranija.. :)
Deletecheekati garu....
ReplyDeleteidi nijamga jariginda...leka kalpitama..? kaasepu aalochistooney...motham katha chadiwesanu.....nawwukuntoo.... chala bagundi....
-- mounaveekshanam.blogspot.in
hay sunil.. its 85% factual. Thanks.
DeleteNice. చాలా బాగుంది. నేను ఇంటర్మీడియట్ లో ఉండగా....ఓ మిత్రుణ్ని ఇలాగే మత మార్పిడి మంచిది కాదని ఒప్పించే ప్రయత్నం చేశాను కానీ మీలా విజయవంతం కాలేకపోయాను.
ReplyDeleteఅన్నట్లు తిరుపతి...పద్మావతి మహిళా యూనివర్శిటీలోనూ అమ్మాయిల్ని కొందరు ఇలా మతం మారుస్తుంటారని మా ఆవిడ చెప్పగా విన్నాను.
మతమేదైతేనేం. మంచి మనసు ఉండాలి.
Nijame chandu tulasi gaaroo, మతమేదైతేనేం. మంచి మనసు ఉండాలి. Thanks.
DeleteChaala baagundandi ....
ReplyDeleteమీరు మంచిపని చేశారు. కానీ ఇలాంటివి ఉన్నదున్నట్లు రాసినందుకు శత్రువులు పోగవకుండా చూసుకోండి. ఈమధ్య (గత సంవత్సరం నుంచి) ఆన్-లైన్ శత్రుత్వాల్ని కోర్టుల్లోనూ పోలీస్ స్టేషన్లలో తేల్చుకుంటున్నారు మత/కుల/రాజకీయ/మహిళా హక్కులు ఇత్యాది సానుభూతిపరులు. తస్మాత్ జాగ్రత్త !
ReplyDelete