ఈ రోజు టైంస్ ఆఫ్ ఇండియా లోని న్యూస్ ఇక్కడ
Wednesday, August 22, 2012
Sunday, August 19, 2012
మోడీని సమర్థిస్తున్న ముంబై ముస్లింల చేష్టలు
గత వారం అస్సాం,మైన్మార్లలోని ముస్లింలపై దాడుల్ని ఖండించడం పేరుతో ముంబైలో జరిగిన ర్యాలీ సంధర్భంగా ముస్లింలు విధ్వంసానికి ఒడిగట్టారు. మంద బలానికి రెచ్చిపోయి పొలీసు,మీడియా లకు సంబంధించిన వాహనాలు తగులపెట్టడంతో పాటు, అనేక మంది పోలీసులు, మీడియా ప్రతినిధులపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం జరిగిన పోలీసు కాల్పుల్లో వీరిలో ఇద్దరు మృత్యువాతపడ్డారు.
అస్సాం, మైన్మార్లలో ఏం జరుగుతుంది, అక్కడ జరిగే హింస కేవలం మత ప్రాతిపదికమీదేనా..? అక్కడ నిజంగానే ఏక పక్ష దాడులు జరుగుతున్నాయా అనే విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం.
ఒకవేళ ముంబై ముస్లింలు భావిస్తున్నట్లు అస్సాం లో ముస్లింలపై దాడులు నిజమైనవే అనుకున్నప్పటికీ.. దానికి వీరు ప్రతిస్పందించిన తీరు మాత్రం అత్యంత గర్హనీయమైంది.ఎక్కడో అస్సాంలో జరుగుతున్న చర్యలకి వీరు ముంబైలో ప్రతిచర్య చేద్దామనుకుంటే, అది 2002 లో గొధ్రా అనంతరం మోడీ చెప్పిన చర్య-ప్రతిచర్యను సమర్థించటం తప్ప మరేం కాదు. అస్సాంలో జరుగుతన్న హింసను తలుచుకుని ముంబైలోని పోలీసుల మీద, పాత్రికేయుల మీద దాడులకి తెగబడ్డారంటే అది వీరి మూర్ఖత్వానికి,వెర్రి ఆవేశానికి నిదర్శనం. అలాంటప్పుడు ఇదే వెర్రి ఆవేశంతో గోధ్రా అనంతరం ముస్లింలపై దాడులకి పాల్పడిన నిందితుల్ని శిక్షించమని అడిగే అర్హత వీరికెక్కడుంది.
వీరి దాడుల్ని లైవ్ ప్రసారాల ద్వారా,ఫోటోల ద్వారా దేశం మొత్తం చూసింది.
మల్లీ ఇంకోసారి ఇలాంటి దాడులు జరగకుండా ఇప్పుడు నిందితులకి కనీసం శిక్షలైనా విధిస్తారా అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే మైనారిటీ వోట్లకి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగూ ఆ పని చేయలేదు. పోనీ భవిష్యత్తులో ఎప్పుడైనా అక్కడ శివసేన ఆధ్వ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడైనా వీరికి శిక్షలు విధిస్తారా అంటే.. అదీ జరగదు. ఎందుకంటే, ఈ ఒక్క దాడుల నిందితుల్ని శిక్షిస్తే, గతంలో జరిగిన అనేక దాడుల నిందితుల్ని కూడా శిక్షించాల్సి ఉంటుంది కాబట్టి. ఉదాహరణకి 1993లో ముంబై అల్లర్ల దాడులపై శివసేన అధినాయకునితో సహా అనేకమంది శివసేన కార్యకర్తల్ని నిందితులుగా నిర్థారిస్తూ జస్టిస్ శ్రీక్రిష్ణ సమర్పించిన రిపోర్టును అన్ని పార్టీలు కలిసి అటకెక్కించాయి. ఆ రిపోర్టుని కదిలిస్తే మెజారిటీల వోట్లు పోతాయని ఈ పార్టీలకి భయం. తిలా పాపం తలా పిడికెడు అన్నమాట.
అసలు అస్సాంలో ఏం జరుగుంది అనే దాని మీద భిన్న కధనాలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ నుండి ముస్లింలు తండోపతండాలుగా వచ్చి అక్కడి స్థానిక బోడో లపై పెత్తనం చలాయించాలని ప్రయత్నించడం వల్ల సమస్య మొదలైందని చెప్పే వారు కొందరైతే, అలాంటిదేమీ లేదనీ అస్సాంలో ఇతర విభిన్న జాతులపై ఆధిపత్యం కోసం బోడోలే ఈ దాడులకి పాల్పడుతున్నారని, దానికోసం బ్రిటిష్ వారి కాలంలో బెంగాల్ నుండి అస్సాంకి వలస వెల్లి అక్కడే స్థిరపడిన బెంగాలీ మాట్లాడే భారత ముస్లింలందరినీ బంగ్లాదేశీయులుగా చిత్రించి దాడులకి పూనుకుంటున్నారనీ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు వాదనల్లో నిజానిజాలేమిటో వెలికి తీయాల్సిన భాధ్యత ప్రభుత్వంపై వుంది. చొరబాటుదారుల్నందరినీ(నిజంగానే ఉంటే) తక్షణమే దేశం నుండి పంపించి వేయాల్సిన అవసరం ఉంది. అట్లే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా దేశ సరిహద్దుల చుట్టూ హైవోల్టేజ్ ఎలెక్ట్రిక్ ఫెన్సింగ్ లాంటివి ఏర్పాటు చేయాలి. కానీ, ఎన్నికల్లో గెలుపోటములు తప్ప మరేం పట్టని మన ఘనతవహించిన పార్టీలు దీనికి పూనుకుంటాయా అనేది వేచి చూడాల్సిందే.
కొసమెరుపేంటంటే.. అస్సాం ని సందర్శించిన అద్వానీ గారు, బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింల వల్లనే సమస్యలు వస్తున్నాయని ఏ మాత్రం అణుమానం లేకుండా అనౌన్స్ చేసేశారు. అద్వానీ అంతటోడు చెబితే అది నిజం కాకుండా ఉంటుందా అంటూ అతని అభిమానులందరూ ఈ వాదనకే ఫిక్స్ ఐపోయారు. కానీ ఇదే అద్వానీ, గతంలో ఓ సారి పాకిస్తాన్ సందర్శించి జిన్నా గొప్ప లౌకిక వాది అని అనౌన్స్ చేయగానే, ఇదే అభిమానులు అతనిపై అంతెత్తున లేచి, అతనికేం తెలీదని డిసైడ్ చేసేసి అతన్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేశారు.
కొన్నిసార్లంతే.. మైండ్ తనకి నచ్చిన వాటినే రిసీవ్ చేసుకుంటుంది. నిజానిజాలు, ఆధారాల్తో సంబంధం లేకుండా..
Friday, August 3, 2012
ఆ ముష్కరులు చేసింది తప్పే..కానీ..
మంగుళూరులో తమని తాము సంస్కృతీ పరిరక్షకులుగా, పుట్టు దేశభక్తులుగా చెప్పుకునే అల్లరి మూకలు మల్లీ రెచ్చిపోయారు. ఓ బర్త్ డే పార్టీ పై దాడిచేసి అక్కడి అమ్మాయిలు,అబ్బాయిలను కొట్టి నానా హంగామా సృష్టించారు. దానికి సంబంధించిన 'ది హిందూ' పత్రిక కధనాలు - ఇక్కడ
విషయం ఏంటంటే.. ఈ దాడికి నాయకత్వం వహించిన వ్యక్తి, 2009లో మంగులూర్లోనే ఓ పబ్ లోకి చొరబడి అక్కడి మహిళలపై దాడిచేసిన వీరుడు. ఇతని వీరత్వాన్ని అప్పుడు కూడా దేశవ్యాప్తంగా T.Vలు వీడియో ప్రసారం చేశాయి. కానీ కర్నాటకలో ఉన్నది BJP ప్రభుత్వం కాబట్టి, అందరూ ఊహించినట్లుగానే ఇతడిమీద చర్యలేవీ తీసుకోలేదు. దానితో మళ్ళీ ఇప్పుడిలా తెగబడ్డాడు. అసలే అలవాటైన పని, పైగా దేశవ్యాప్తంగా ఫ్రీ పబ్లిసిటీ, అపై శిక్షలేవీ ఉండవనే భరోసా.. ఇంకేం కావాలి..?
2009లో పబ్ మీద దాడి చేసినప్పుడే ఇతన్ని సరైన రీతిలో 'సత్కరించి ' ఉంటే ఇప్పుడు ఇలా చేసి ఉండే వాడు కాదు. కానీ 2009 పబ్ పై దాడిని ఖండిస్తూనే, మన సంస్కృతి, విలువలు అంటూ అనేక మంది కుహన దేశభక్తులు/సంస్కృతి భక్తులు ఇతన్ని ఇండైరెక్ట్ గా వెనకేసుకొచ్చారు. దాని ఫలితంగానే ఇతను ఇప్పుడిలా బరితెగించాడు. ఇప్పుడు కూడా ఈ సర్టిఫైడ్ దేశభక్తుల స్పందనలో మార్పులేదు. తప్పే కానీ.. సంస్కృతి,విలువలూ అంటూ నీళ్ళు నములుతున్నారు.వీరిలా స్పందించడానికి రెండు కారణాలు ఉండొచ్చు.
1. ఎప్పుడూ పబ్బులకీ,పార్టీలకీ వెల్లక, వెల్లే అవకాశం రాక, అలా వెల్లే వాల్లందరూ అక్కడ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారేమో ననే ఓ విధమైన అక్కసు(జెలసీ ) వీరి స్పందనకి కారణం కావచ్చు.(తాను చేయలేని పనిని ఇంకెవరైనా చేస్తూ.. అతను దానిలో ఆటంకాలు ఎదుర్కొంటేనో లేక విఫలమైతేనో, పక్కనుండి చూసే వారికి ఓ విధమైన తుత్తి ఉంటుంది. ఇది సగటు మానవ నైజం) .
2. నేను కానీ, మా ఇంట్లో వారు కానీ పబ్బులకి,పార్టీలకీ వెల్లం కాబట్టి, అలా వెల్లేవారిని ఎవరేం చేసినా నాకు పోయేదేం లేదనే ఓ విధమైన నిర్లిప్తతతో, ఈ దాడుల వల్ల మన సంస్కృతి కాస్తైనా బాగుపడుతుందేమోననే ఆశ కావచ్చు.
దాడులు,సంస్కృతి అవేని రెండు వేర్వేరు విషయాలు. వీటిని ఎప్పటికీ కలిపి చూడకూడదు. ఆ పార్టీల్లో చట్టవ్యతిరేక కార్యక్రమాలేవైనా జరుగుతున్నాయనుకున్నప్పుడు దానిని చట్టప్రకారమే ఎదుర్కోడానికి ప్రయత్నించాలే తప్ప ఇలా మృగాల్లా దాడులు చేయకూడదు. దీనిని ఖండించడంలో, ఆ ముష్కరుల్ని తీవ్రంగా శిక్షించమని అడగడంలో మీనమేశాలు లెక్కించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు.
ఇక సంస్కృతి అనేది మరో అంశం. సంస్కృతిని పరిరక్షించమనీ, పబ్బులకీ,పార్టీలకీ వెల్లకండనీ శంకరాచార్యలాంటి మఠాధిపతులో, TTD లాంటి ధార్మిక సంస్థలో ప్రచారం చేస్తే బాగుంటుంది తప్ప, ఓ నలుగురు ఆకతాయిల్ని వెంటేసుకు తిరిగే ప్రతివాడు సంస్కృతి పరిరక్షకున్నని చెప్పుకోవడం, ప్రస్తుతం మన సంస్కృతి యొక్క దౌర్భాగ్యం.
సంస్కృతి-పబ్బులు-పార్టీలు
మా నాన్న యువకుడిగా ఉన్నప్పుడు వాల్ల పల్లెలో వీధినాటకాలు, కోలాటాలూ లాంటివి తెగ ఆడేవాడంట. 'ఒరే ఇది మన సంస్కృతి కాదురా' అని వాల్ల నాన్న మా నాన్నని రోజూ తిట్టేవాడంట.
కాలేజీ రోజుల్లో నేను సినిమాలు తెగ చూసేవాన్ని. 'ఒరే ఇది మన సంస్కృతి కాదురా' అని మా నాన్న నన్ను రోజూ తిట్టేవాడు.
రేపు నా కొడుకు పెద్దయ్యాక పబ్బులకు,డిస్కోలకు వెల్తాడు. 'ఒరే ఇది మన సంస్కృతి కాదురా' అని నేను కూడా వాన్ని తిడతాను. అదే సంస్కృతి అంటే..
"ఏ సంస్కృతీ ఏనాడూ కాదొక స్థిర బిందువు. అనైక నదీనదాలు కలిసిన అంతస్సింధువు"- అన్నాడో కవి.
మార్పు చెందని జాతులు,సంస్కృతులు త్వరగా అంతరిస్తాయి. ఆ కొత్తగా వచ్చే సంస్కృతికి అప్పటికే ఉన్న సంస్కృతికీ మధ్య కొంత ఘర్షణ అనేది సహజమే. తల్లిదండ్రులు పిల్లల్ని మందలించడం అనేది అలాంటిదే..
కానీ ఇలా మందలుగా వెల్లి దాడులు చేయడమనేది సంస్కృతి కాదు. దీనికి సరైన పేరు-కుల్లు రాజకీయం.
Subscribe to:
Posts (Atom)