బీఫ్ తినడం- కొంతకాలం క్రితం వరకూ అతివాద హిందూ గ్రూపులకి ఇది చాలా ఇష్టమైన పదం. ఎందుకంటే, వీరిదృష్టిలో హిందువులెవ్వరూ బీఫ్ తినరు. కేవలం ముస్లింలు మాత్రమే తింటారు. అది కూడా హిందూ సంస్కృతిని పరిహాసం చేయడానికే తింటారు. బీఫ్ తినని 80% శాతం మంది హిందువుల(క్రిష్టియన్లు,ముస్లింలూ కానివారందరూ హిందువులేననే వీరి లెక్క ప్రకారం) మనోభావాలు గాయపరచడం కోసమే తింటారు... ఇలాంటి పలు ఆవేశపూరిత విషయాల్ని హిందూ ఓటర్లకి వివరించి వారిని ముస్లింల పైకి ఉసిగొల్పడంలో, తద్వార వారి ఓట్లను కొల్లగొట్టడంలో ఇన్నాల్లూ ఈ విషయం వారికి బాగా ఉపయోగపడింది. కానీ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో దలిత విద్యార్థి సంఘాల నాయకత్వంలో జరుగుతున్న బీఫ్ ఫెస్టివల్ వీరి ఆశలకి భారీగా గండికొడుతుంది. ఈ ఫెస్టివల్ లో భాగంగా జరిగిన అనేక అవగాహన సదస్సుల్లో పాల్గొన్న వక్తలు, పెద్ద కూరతినడం దలిత సంస్కృతిలో అనాదిగా ఎలా భాగమైందో వివరించడంతో పాటు, ప్రస్తుత పరిస్థితుల్లో హాస్టల్ మెనూల్లో బీఫ్ ని చేర్చాల్సిన అవసరాన్ని కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. వీరు చెప్పేదేమిటంటే, బీఫ్ లో పోషక విలువలు అత్యధికంగా ఉంటాయి. ఇతర మాంసాహారాలైన చికెన్,మటన్ లాంటివి ప్రస్తుతం చాలా ఖరీదైపోయాయి. 100 రూపాయలకి వచ్చే చికెన్,మటన్లతో పోల్చితే, అదే రేటుకు వచ్చే బీఫ్ పరిణామం చాలా ఎక్కువగా ఉంటుంది. కావున పేదరికం,పౌష్టికాహార లోపంతో బాధపడే దలిత విధ్యార్థులకి బీఫ్ తినడం అనేది అత్యావశ్యకం. ఈ విధంగా, ఇన్నాల్లూ అదేదో ముస్లింలు మాత్రమే చేసే (బీఫ్ ముట్టని ముస్లింలు కూడా అనేక మంది ఉన్నారు. వీరిలో కూడా పేద ముస్లింలే ఎక్కువగా బీఫ్ తింటారు. ) ఘోర అపరాధంగా,దేశద్రోహ సమానమైన నేరంగా చాటింపు వేసుకుంటూ బతికేసిన BJP,RSS,ABVPలాంటి సంఘాలకు, తీరా ఇప్పుడు దానికి ప్రతికూలమైన వాదనలు దేశజనాభాలో అత్యధికంగా ఉన్న దలిత,వెనుకబడిన వర్గాల నుండి రావడంతో, గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్టుగా ఐంది. ఇప్పుడు సంస్కృతి,మనోభావాలు లాంటి భారీ డైలాగులతో, భౌతిక దాడులతో ఈ దలిత సంఘాలతో పెట్టుకుంటే, 'అంటే మేము బీఫ్ తిన్నంత మాత్రాన హిందువులం కాకుండా పోతామా?' అని వీరు అనేయగలరు. దానికి అవునంటే, ఆ నిర్వచనం ప్రకారం దేశ హిందూ జనాభా ఎంతో మరో సారి లెక్కించ వలసి ఉంటుంది. అంటే BJP ఓటుబ్యాంకుకు పెద్ద గండి అన్నమాట. (హిందూయేతరులు BJPకి ఎట్టిపరిస్తితుల్లో ఓటు వేయరు. అసలు వారి ఓట్లను పొందాలనే ప్రయత్నం కూడా ఆ పార్టీ ఎప్పుడూ చేయదు.). 'సరే తినండి' అంటే, ఇన్నాల్లూ ముస్లింల మీద ఇదే సాకు చూపి విద్వేషం చిమ్ముతూ, తమ పాలన ఉన్నరాష్ట్రాల్లో గోవధకి, మనుషుల వధకన్నా కృరమైన చట్టాలు చేసిపెట్టుకుని,(ఉదాహరణకి, మధ్యప్రదేశ్లో పోలీసులు ఎవరైనా ఓ వ్యక్తిపై ఓ మనిషిని చంపినట్లు నేరం మోపితే అతడు ఆ నేరం చేశాడని నిరూపించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. అదే ఓ వ్యక్తిపై గోవధ చేసినట్లు నేరం మోపితే, అతడు నేరం చేయలేదని నిరూపించుకోవలసిన బాధ్యత ఆ నిందితునిపై మాత్రమే ఉంటుంది. ఒకవేల అతను నిరూపించుకోలేకపోతే అత్యధికంగా యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించవచ్చు. ) వీటి ద్వారా అక్కడి మైనారిటీల్ని హింస్తిస్తున్న తమ కపటత్వం బయటపడుతుంది.
కావున ఎలా చూసుకున్నా, ఉస్మానియా లో మొదలైన ఈ బీఫ్ ఫెస్టివల్, భవిష్యత్తులో BJP కి పెనుసవాలుగా మారనున్నటం సుష్పష్టం.
కావున ఎలా చూసుకున్నా, ఉస్మానియా లో మొదలైన ఈ బీఫ్ ఫెస్టివల్, భవిష్యత్తులో BJP కి పెనుసవాలుగా మారనున్నటం సుష్పష్టం.
mee lakshyam neraverutunnadi kadaa samtoshimchamdi
ReplyDeleteసరే.. మీరు మాత్రం బాధపడకండి..
Deleteబీఫ్ ని తినలనుకొవడం వేరు, ఇలా పబ్లిక్ మీటింగ్ పెట్టి, దాన్ని ఒక కులం తొ ముడిపెట్టి, ఎదొ వాల్లని ఎవరు బీఫ్ తినొద్దన్నారు అన్నట్టు పెద్ద హంగామా చెయడం ఎందుకు.
ReplyDeleteపొర్క్ తినేవాల్లని కూడ, చులకన గ చుస్తున్నారని, పొర్క్ ఫెస్టివల్ చెయగలరా. అసలు ఆ మాట అనుకుంటెనె ఉచ్చ కారిపొతుంది. ఎందుకంటే ఎవరు నరుకుతారొ తెలుసు , నరికిన తరువాత అడిగె దిక్కు కూడ ఉండదు కాబట్టి. కోడిని మేకని తినేవాల్లు ఇలా కాలేజుల్లొ పబ్లిక్ గా కొసుకుని తినరు. ఇంకా చెప్పాలంటే ఆ పెంతెకొస్తు వెధవలు ఎక్కడో వేరె దేశం లొ నుండి ఆడిస్తూ ఉంటే, ఇక్కడ వీళ్ళు తాన తందాన అని ఎగురుతున్నారు.
మీరు అనవసరంగా భయపడుతున్నారు.. మీకు పోర్క్ తినాలని ఉంటే నిరభ్యంతరంగా తినండి, పోర్క్ ఫెస్టివల్ చేయాలని ఉంటే చేసేయండి.. ఎవరడ్డువస్తారో చూద్దాం...నా పూర్తి మద్దతు మీకే..
Deleteఈ పోస్ట్ చదివిన కొందరు అత్యుత్సాహవంతులు, నిరుత్సాహంతో- పోర్క్ ఫెస్టివల్ గురించి ఇలా రాయగలరా అని అమాయకంగా అడుగుతున్నారు.. అంటే ప్రతిదీ ఇస్లాంతోనో, క్రిష్టియానిటీతోనో పోల్చుకుంటే తప్ప పాపం వారికి తమ మతాచారాలకు లాజిక్కులు దొరకవు కాబోలు. సరే ఎలాగూ అడుగుతున్నారు కాబట్టి..పోర్క్ గురించి..
ReplyDeleteపంది మాంసాన్ని తినే వారు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నారు. మన దేశంలో మాత్రం పందిని మానవ విసర్జకాలను తినే జంతువుగా చూడటం వలన అతి కొద్దిమంది మాత్రమే తింటారు. అడవి పందిని తినే వారి జనాభా కాస్త ఎక్కువగానే ఉండొచ్చు. వీరిలో కూడా ఆదివాసీలు, దలితులే ఎక్కువగా ఉంటారు. ఇక మన అత్యుత్సాహవంతులకు బీఫ్ గురించి మాట్లాడినప్పుడల్లా పాపం పోర్క్ గుర్తుకు వస్తుంది. కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే వారి పోలిక ఎంత మతిలేనిదో ఇట్టే అర్థం అవుతుంది. ఇస్లాం పందిమాంసాన్ని తినటాన్ని పూర్తిగా నిషేధించింది. అంటే దానర్థం.. పందిని చంపగానే మా ముస్లింల మనోభావాలు గాయపడ్డాయని ముస్లింలందరూ గుండెలు బాదుకుంటారని కాదు. కేవలం ముస్లింలు మాత్రమే పందిని తినకూడదు.. ఇతరులు దానిని చంపినా, తిన్నా.. అది ముస్లింలకు చెందిన విషయం కాదు.వాటి జనాభా అంతరించి పోతుందేమోననే దూరాలోచన,దిగులు వారికి ఉండదు.. అనేక నగరాల్లో 'ఇక్కడ పంది మాంసం అమ్మబడును' అని ఇంతింత పెద్ద బోర్డులు పెట్టుకుని మరీ షాపులు నడుపుతున్నారు. వాటిమీద ఎవరూ దాడులు చేయలేదే.. కాబట్టి..రేపొద్దున ఉస్మానియాలో ఓ పదిమంది పంది మాంసం తినేవారు పోర్క్ ఫెస్టివల్ చేసుకుంటే, ముస్లింలు వారి మీద దాడులు చేస్తారని నేననుకోను. కాకపోతే.. వారు వాడే పాత్రలు, ఇతర వంట సామాగ్రి మిగతా వాటితో కలపకుండా ప్రత్యేకంగా ఉంచుకోమని ఎవరైనా అడగవచ్చు. దానిలో తప్పుపట్టాల్సింది కూడా ఏం లేదు. కానీ ఇప్పుడు OUలో దలిత సంఘాలపై జరుగుతున్న దాడుల్ని మాత్రం ఖండించవలసిందే..
నిజమే కదా, వోటు బ్యాంకులకు గండి పడితే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని ఎంతచక్కగా విశ్లేషణ చేశారో! పంది పండగ, కప్ప, ఎలుకలు, పాము, దీపపుపురుగులు, పండగలు, గడ్డి, గాదం పండగలు కూడా ఉస్మానియాలో రోజు ఏదో పండ జరగాలని ఆశిద్దాం...
ReplyDeleteథ్యాంక్స్..ఇంకా భూమ్మీద అనేక జీవజాతులున్నాయి..వాటిని మెన్షన్ చేయలేదేం... అవి మీకు నచ్చలేదా..
Delete"పొర్క్ ఫెస్టివల్ చెయగలరా"
ReplyDeleteThe meat served in the beef festival is not halal. Why are you dragging in Muslims into this then?
cool.. just go through the post and the comments, U'll find out who is dragging whom in to this. good luck..
DeleteMy reaction is to kasiApr 16, 2012 09:55 AM, not your post.
Delete"అగ్రవర్ణ" హిందువులకు దళితులకు మధ్య ఉన్న తగాదాలోకి ముస్లిములను లాగడం అనవసరం.
Nice post..
ReplyDeleteSee this news, which shows the hypocracy of the so called custodians of hindu culture - http://www.indianexpress.com/news/bajrang-vigilantes-cry-cowslaughter-beat-humiliate-muslim-trader/896817/1
Shame on these goons..
Thanks Sai. your link shows one of the many ugly faces of cow related politics.
DeleteI agree with you...honestly,till now i dont know what happend in Osmania Univ..initially i thougt beef festival relates to muslim so muslim youth celebrating it.n not followed the issue.After watchng telinews scroll,my heart broken down bcoz..i thought there was clash between The Hindu n The Muslim youth..In this case,media never highlighted between whom the clash n y it got started..But am happy with this blog,now i got clear idea wht the root cause....In feature Allah defenitely shows to BJP..any way..thany you sir..Nice article....Have a great day..
ReplyDeleteU wrote a valid point about the telugu media. Not just about beef festival, even in the latest communal clashes also, telugu media is telecasting selective news. Andhrajyothy is somewhat better, but the other news papers are observing conspicuous silence in the matters showing saffron misdeeds.
Deleteఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో కొఠియా అనే గిరిజన జాతికి చెందినవాళ్ళూ, దోంబా అనే దళిత కులానికి చెందినవాళ్ళూ ఉత్సవాల సమయంలో దేవాలయాల దగ్గర బహిరంగంగానే ఆవుల్నీ, దున్న పోతుల్నీ బలి ఇస్తారు. జంతు బలులు చట్ట వ్యతిరేకం అని తెలిసినా గిరిజనుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చెయ్యరు. ఆ ప్రాంతంలోని వోటర్లలో ఎక్కువ మంది గిరిజనులే కనుక BJP కార్యకర్తలు కూడా గోవధ మహా పాపం అని గిరిజనులకి చెప్పే ధైర్యం చెయ్యరు.
ReplyDeleteచీకటి గారూ,
ReplyDeleteమీ అసలు పేరు తెలీదు కాబట్టే ఇలా సంబోధిస్తున్నాను.
నా వ్యాఖ్యతో పనిలేకుండా మీ పరిశీలనకోసం రెండు లింకులు పంపిస్తున్నాను. ఇంకా చూడనట్లయితే తప్పక చదవండి.
పెద్దకూర పండుగ రాజకీయాలు
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=95734
ఇది ఒక సాంస్కృతిక విప్లవం
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=95078
రాజు గారూ, మీరు ఇచ్చిన రెండు వ్యాసాలు ఈ అంశాన్ని అద్భుతంగా విశ్లేషించాయి. లింక్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
Delete"మన దేశంలో మాత్రం పందిని మానవ విసర్జకాలను తినే జంతువుగా చూడటం వలన అతి కొద్దిమంది మాత్రమే తింటారు. అడవి పందిని తినే వారి జనాభా కాస్త ఎక్కువగానే ఉండొచ్చు. వీరిలో కూడా ఆదివాసీలు, దలితులే ఎక్కువగా ఉంటారు."
ReplyDeletehttp://andamainacheekati.blogspot.in/2012/04/bjp.html#comment-form
చీకటి గారూ,
మీ అంచనాలో ఎక్కడో తేడా ఉన్నట్లుంది. "పందిని మానవ విసర్జకాలను తినే జంతువుగా చూడటం వల్ల" అనే మీ వాక్యం నవ్వు తెప్పిస్తోంది నాకయితే.
మరి కోడి ఏ విసర్జకాలను తిని పెరుగుతోందో మీకు తెలియదా? కొన్ని కోట్లమంది భారతీయులు దాన్నీ దీన్నీ కలిపే తింటున్నారు అగ్రవర్ణాలతో సహా. పందిని తినే హక్కును మీరు దళితులు, ఆదివాసులకే హక్కు భుక్తం చేస్తున్నారు. నాకు తెలిసి రాయలసీమలో దాదాపు మాంసాహారం ఆరగించే ప్రతి అగ్రవర్ణమూ నాటుపందిని, అడవిపందినీ కలిపే తింటోంది. ఊరిపందిని తినడానికి, ఊరి దున్నపోతును తినడానికి మొహమాటపడే అగ్రవర్ణాలు కూడా ఈ రీజియన్‌లో అడవి పందిని, అడివిదున్నను చంపి ఎండబెట్టి వట్టి తునకలుగా మూట గట్టి మరీ నెలలపాటు తింటున్నారు. మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటో నాకు తెలీదు. లెక్కలు తేలిస్తే తెలుస్తుంది.
మానవ విసర్జకంతో సహా కోడి తింటున్న ఆహారం, లేదా దాణాలో ఎన్ని భయంకర రోగకారకాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఇవన్నీ పక్కన బెట్టి చూస్తే మనుషులు తినే తిండి పట్ల కూడా దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్న, రాజకీయాలు నడుస్తున్న దేశం, సంస్కృతి ప్రపంచంలో ఇంకెక్కడయినా ఉందా.. ఇస్లామిక్ దేశాల్లో పందులు ఉన్నాయో లేదో.. ఉంటే వాటిని తినే వారు ఉన్నారో లేదో నాకయితే స్పష్టంగా తెలీదు. అక్కడి మెజారిటీ ప్రజలు పందులు తినకపోవచ్చు కాని అంత భారీ భారీ ఒంటెలనే పీక్కు తినేస్తున్నారు కదా. ఇందులో ఎవరి జాతి గొప్ప, ఎవరిది తక్కువ..? అదీ ఎవరో కోన్‌కిస్కా ప్రవక్తలు, పరివ్రాజకులు, ప్రచారకులు ఏదో గీకితే, విధినిషేధాలు పెడితే... దాన్ని పట్టుకుని, ప్రపంచంలో ఏదో ఒక మాంసం తినకుండా వదలని మనుషులు కొట్టుకు చావడం. బూతులాడుకోవడం పైగా పనికిమాలిన రాజకీయాలు కూడా దీంట్లో..
మధ్యలో ఈ శాఖాహారం గొప్ప ఒకటి.. నిద్రలేచింది మొదలుకుని మేనకాగాంధీతో సహా ఊదరగొడుతున్నారు. మానవ విసర్జకాలను తినే ఆహారం తినకూడదు సరే మరి ఆవు పెంటలు, దున్నపోతు పెంటలు, పశువుల పెంటలు, చివరకు పందుల పెంటలు కూడా వేసి కోట్లమంది రైతులు పండిస్తున్న శాఖాహార పంటల మాటేమిటి? కుళ్లిన ఎరువులతో పండే ఈ పంటలను తినేవారు మాత్రమే గొప్పవారు అయిపోవడం ఏమిటి?
తినే తిండి విషయంలో ఈ పవిత్రతలేమిటి? అపవిత్రతలేమిటి? తినే ఆహారంతో మనిషి గొప్పతనాలను, పవిత్రతలను, అల్పత్వాలను లెక్కించే ఈ నికృష్ట సంప్రదాయాలు ఏమిటి? వీటి ఆధారంగా నడిచే నీచ రాజకీయాలేమిటి?
ఇవన్నీ మనుషుల కోసమేనా? ఈ దగుల్బాజీ వ్యవహారాలను గౌరవించడం కూడానా?
మనుషులు తమ చుట్టూ పరిసరాలలో లభ్యమయే తిండి తినే విషయంలో కూడా రాజకీయాలే అయితే జనం ఏమైపోవాలి?
ఏంటో...
రాజశేఖర రాజు
పోర్క్ గురించి రాయడంలో నా ప్రధాన ఉద్యేశ్యం- ముస్లింలు పోర్క్ తినరుగానీ, అది తినే వారిని అడ్డుకోవడమో, వారి మీద దాడులు చేయడమో చేయబోరని చెప్పడమే.. ఇక మిగతా విషయాలు అంత ప్రాధాన్యం కావనిపించడం వల్ల పెద్దగా R&D చేయలేదు. అహార అలవాట్ల మీద జరుగుతున్న రాజకీయాల్ని ఖండించడంలో మీ ఆవేదన అర్థమవుతూనే ఉంది. Thanks.
DeleteI would like to share 1 tng with this blog.After writing article if you provide Rating../vote in percent.Its helpful.If anytng wrong..plz exuse me sir..
ReplyDeleteThanks.. lets see..
Deleteపోర్క్, బీఫ్ రెండూ కంపేర్ చెయ్యడం అంత సమంజసం కాదు. పొర్క్ ముస్లింలు అసహ్యించుకునే జంతువు. ఆవు హిందువులకి పూజించే జంతువు. వాటిని చంపి తినడం విషయం లొ ఇద్దరి మనొభావాలు ఒకేలా గాయపడతాయంటే అంత కరెక్ట్ అనిపించడం లేదు. ఉదాహరణకి అదే పొర్క్ ఫెస్టివల్ అలిఘడ్ ముస్లిం యూనివర్సిటిలొనొ, పాతబస్తిలొ ఎదొ ఒక కాలేజీలొనో చేస్తే రెస్పాన్స్ ఇలానే ఉంటుంది అని నా అభిప్రాయం. అసలు ఒక తినే ఐటం మీద అందులొనూ ప్రత్యేకం గా బీఫ్ మీద ఒక ఫెస్టివల్ లాంటిది చెయ్యాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటారు :-))
ReplyDeleteఒపిక ఉంటే ఇవి చదవండి.
http://manchupallakee.blogspot.com/2012/03/part-1-of-4.html
http://manchupallakee.blogspot.com/2012/03/part-2-of-4.html
http://manchupallakee.blogspot.com/2012/03/part-3-of-4.html
http://manchupallakee.blogspot.com/2012/04/part-4-of-4.html
అసలు ఉస్మానియా- AMUల మధ్య పోలికే సమంజసం కాదు. అంతగా కావాలంటే AMUని, BHUతో పోల్చవచ్చు. రెండూ మతం ప్రతిపదికగా ఏర్పడ్డవే కాబట్టి,.. కానీ ఉస్మానియా అలాకాదు. అది అందరికోసం ఏర్పడ్డ విశ్వవిధ్యాలయం. ఇక్కడ అందరి అభిప్రాయాలకీ,సంస్కృతులకీ సమాన విలువ ఉంటుంది తప్ప కొందరి సంస్కృతిని ఇతరుల మీద రుద్దాలనుకోవడమే సమస్య. హిందువులు బీఫ్ తినరని కొందరంటున్నారు. మేము తరతరాలుగా తింటున్నాం, అది మా సంస్కృతిలో భాగమే అని దలితులంటున్నారు. వారు అడిగేది మెనూలో భాగంగా బీఫ్ ని చేర్చమనే.. యూనివర్సిటీలో అందరిచేతా బీఫ్ తినిపించాలని కాదు.. బీఫ్ వండిన రోజుల్లో, మెస్ లో ఇప్పుడున్న ఇతర నాన్ వెజ్ లు, వెజ్ లు, ఎలాగూ వండుతారు. ఎవరికేది కావాలో అదే తినొచ్చు. దీనిలో ఎవరికేం సమస్య ఉంది, రాజకీయం తప్ప..?
ReplyDeleteఇక ఫెస్టివల్ ఎందుకు అంటారా.. ఒక విప్లవాత్మక మార్పును తేవాలంటే కాస్త హడావుడి అవసరమే కదా.. వారు అలా చేయబట్టే, ఇప్పుడు దీనిమీద ఇంత చర్చ జరుగుతుంది. ఇక పాతబస్తీలో పోర్క్ ఫెస్టివల్ అన్నారు.. ఆ ముక్కల్ని తీసుకెల్లి, వారి ఇండ్లమీద, అక్కడి మసీదుల్లో వేయనంతవరకూ వారు మాత్రం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇతరుల హక్కుల్ని,అభిప్రాయాల్ని గౌరవించాలనే ఇంగిత ఙానం, ఆవేశం తప్ప ఆలోచన లేని వెధవలు అక్కడకూడా ఉన్నారు కాబట్టి వారిలో కొందరు ఇలాగే రియాక్ట్ అవ్వొచ్చు. అక్కడ కూడా వెధవలు ఉన్నారు కదాని, ఉస్మానియాలోని వెధవల్ని వెనకేసుకు రావటమో, వారిని ఏమీ అనకూడదనటమో కరెక్ట్ కాదనుకుంటా.. Thanks.
By studying n observing..If we refer articles in our constitution,we have right to freedom of speech and expr..
ReplyDeleteఅభిప్రాయాల్ని గౌరవించాలనే ఇంగిత ఙానం, ఆవేశం తప్ప ఆలోచన లేని వెధవలు అక్కడకూడా ఉన్నారు కాబట్టి వారిలో కొందరు ఇలాగే రియాక్ట్ అవ్వొచ్చు. This is what people /society needs to think.In the US,vallu non-veg anirakalu tintaru...andukani manadesam valatho sambandalu vadulukovu ga,for eg,BJP adikaram lo unaapudu..Obama vaste -->BJP ani sukaryalu istadi ,if he ask advani plz arrange beef in lunch ante ..apudu advani reaction enti telusa..Guess..They will arrange. They need bilateral relations.. Final ga na udesam emitante..Manavudu swardaparudu
tana avasaralanu bati ,and alochanalotho mundadu sagistadu..Manamu ani matalanu gouravistu..n pakkana valaki telisindi teliyajestu munduku sagalani assidam..Chikati gari alochana dhorani adbhutam...Nenu na bhavalanu sariga vektam cheyakapovachu..ibandi kalugite shaminchandi..
http://kotiratanalu.blogspot.com/2012/04/blog-post_3364.html
ReplyDelete