కేవలం అసత్యాల్ని ప్రచారం చేసుకోవడం ద్వారా జనాల్ని కూడగట్టుకుని తమ పబ్బం గడుపుకునే అతివాద దళాల పనితీరు ఎలా ఉంటుందంటే.. వీరు ఎవరినైనా బ్రైన్ వాష్ చేసి ఓ 10 పాయింట్లు చెబితే, వాటిలో పదవ పాయింట్ తప్పనిసరిగా ఇలా ఉంటుంది.- "పై తొమ్మిది పాయింట్లలో ఎవరైనా ఏ ఒక్క పాయింట్ నైనా తప్పని చెబితే వారు మన గ్రూపుకి వ్యతిరేకి కింద లెక్క. కాబట్టి అలాంటి వారి మాటల్ని నువ్వు నమ్మకు. వారు ఎన్ని ఆధారాల్ని చూపినా పట్టించుకోకు"
ఇది కూడా నాజీల నుండి నేర్చుకున్న విద్యే. దీనికి మంచి ఉదాహరణ రోమీలా థాపర్. భారత దేశ ఉపఖండ చరిత్ర గురించి ఈవిడ రాసిన రీసర్చ్ పుస్తకాలు, అనేక దేశ,విదేశ ప్రముఖ యూనివర్సిటీల్లో రెఫరల్ బుక్స్ గా ఉన్నాయి. విద్యా రంగంలో ఈవిడ సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మ భూశన్ అవార్డు ప్రకటించినా, విద్యాసంస్థలుఇచ్చే అవార్డులు తప్ప ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులేవీ తాను స్వీకరించనని ఈవిడ ఆ అవార్డును తీసుకోలేదు. అది ఆవిడ నిబద్ధతకు నిదర్శనం. కానీ మన అతివాద హిందూ గ్రూపులు మాత్రం ఆమెను హిందూ వ్యతిరేకిగా తీర్మానించేసి, హిందువులెవరూ ఆమె పుస్తకాల్ని చదవరాదని నిర్దేశిస్తుంటాయి. ఎందుకంటే, జనాల్ని కూడగట్టడానికి ఈ అతివాద గ్రూపులు చెప్పుకుంటూ తిరిగే చారిత్రక కథనాలు ఎంత అవాస్తవమో,అసంబద్ధమో ఈమె సోదాహరణంగా ఆవిడ పుస్తకాల్లో వివరిస్తారు కాబట్టి.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్న హిందూ పత్రికలో ప్రచురితమైన చార్మినార్ పాత చిత్రం పై కొందరు వివిధ రకాల అణుమానాలు వ్యక్తం చేశారు. హిందూ పత్రిక కావాలనే హిందువులకు వ్యతిరేకంగా రాస్తుందనీ, ఆ ఫోటో పైంటింగ్ లా ఉందనీ ఇలా.. దేశంలో వివిధ పత్రికల గురించి కనీస నాలెడ్జ్ ఉన్నవారెవరికీ, ఒక సారి హిందూ లో ఓ వార్త వచ్చాక దానిపై ఇక అణుమానం ఉండదు. 'హిందూ' నిబద్ధత, ఆ పత్రిక పాటించే విలువలూ అలాంటివి. ఐనా సరే, హిందూ పత్రిక అలా అణుమానించే వారి వ్యాఖ్యల్ని కూడా ప్రచురించి , వారి అణుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగా ఈ సారి పక్కా డేట్స్ తొ కూడిన 4 ఫోటోలను ప్రచురించింది. దాని లింక్ ఇక్కడ
ఈ ఫోటోల్ని కూడా అణుమానించే వారు, నకిలీవని వాదించే వారు ఉంటారనే దాంట్లో సందేహం లేదు. కొందరికి కొన్ని నమ్మడంలో, కొన్ని నమ్మక పోవడంలో ఓ రకమైన కంఫర్ట్నెస్ ఉంటుంది.
నిన్న నేను రాసిన పోస్టుకి స్పందనగా నాకు కూడా వివిధ రకాల కామెంట్లు వచ్చాయి. కొందరు ముస్లింలు పడగొట్టిన గుడుల లిస్టు అంటూ ఏవో కొన్ని లింకులు కూడా పంపారు. చార్మినార్ పక్కన ఇంతకు ముందు లేని గుడి ఇప్పుడు రావడానికి, చరిత్రలో ముస్లిం రాజులు కూలగొట్టిన గుడులకు మధ్య సంబంధం ఏమిటో అర్థం కాదు. "వారు అన్ని కూలగొట్టారు కదా, మనం కనీసం ఇదన్నా కూలగొడదాం" అని వారి ఉద్ధేశ్యం కావచ్చు. చరిత్రలో అసత్యాల్ని అర్థ సత్యాల్ని తలకెక్కించుకున్నాక, ఇలాంటి ఆలోచనలు రావడం సహజమే. చరిత్రలో ఎక్కడ చూసినా ఆధిపత్యం కోసం, ఒక జాతి/వర్గం పై దాడులు/ప్రతిదాడులకి దిగడం, గెలిచిన వర్గం ఇతర వర్గం వారి సంస్కృతిని నాశనం చేయాలని చూడడం అనేది ఏ ఒక్క మతానికో, సమూహానికో పరిమితం కాదు. మంగోలులు,క్రైస్తవులు,ముస్లింలు,బుద్ధులు ఇలా అందరూ ఈ దారుణాలకు పాల్పడినవారే. చివరికి హిందూ మతం వ్యవస్థీకృతం కాకముందు వేరువేరుగా ఉన్న వైష్ణవులు,శైవులు, బుద్ధుల మధ్య కూడా ఇలాంటి దాడులు అనేకం జరిగాయి. హైదరాబాద్, అశోక్ నగర్లో, పుస్తకాల షాపుల్లోని సివిల్స్ ,గ్రూప్-1,2 లకి సంబంధించిన ఏ చరిత్ర పుస్తకం చూసినా వీటికి సంబంధించిన, వివరాలు కావలసినన్ని దొరుకుతాయి. (ఏ దేవాలయం శైవం నుండి వైష్ణవానికి మార్చబడింది, ఆ రాజు పేరు ఏమిటి లాంటివి గ్రూప్స్ లో ఇంపార్టెంట్ ఏరియాస్ ) . ఇలా చరిత్రను పూర్తిగా తెలుసుకోకుండా, మనకు అన్యాయం జరిగిందహో అని నినదించే కపట రాజకీయ నాయకుల ఉపన్యాసాలో, వారి తలా తోకా లేని లింకులో పట్టుకుని, ఆవేశంతో ఊగిపోవడం వారితో పాటు సమాజానికి కూడా మంచిది కాదు.-జై హింద్