తమ పార్టీకి తప్ప వేరే ఏ ఇతర పార్టీలకూ సిద్ధాంతాలు లేవనీ, ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించటానికే తమ పార్టీ పుట్టిందనీ, గంగాజలం లాంటి తమ పార్టీ ఏ ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోదనీ ఇన్నాల్లూ నీతి వచనాలు ప్రవచిస్తూ వచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, ఇటీవల తనకు అకస్మాత్తుగా ఙ్నానోదయమైనట్లు భాజపా తో పొత్తుకు సిద్ధమని ప్రకటించేశారు. ఇక కమ్యూనిస్టు విప్లవ యోధుడు చేగువేరా బొమ్మతో జనసేనను ప్రకటించిన పవన్ కళ్యాన్, కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేక భావజాలాలైన కమ్యూనలిజం, క్యాపిటలిజంలకు నిలువెత్తు రూపమైన మోడీ భజన చేయడం మొదలుపెట్టాడు. గుజరాత్లో వేల మంది అమాయకుల మృతికి కారకుడుగా మైనారిటీలు, సెక్యులరిస్టులూ విమర్శిస్తున్న నరేంద్ర మోడీకి దేశాన్నేలే అన్ని అర్హతలు ఉన్నాయని వీరిద్దరూ క్లీన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. భారత దేశ రాజ్యాంగం తనకు గీత, బైబిల్, ఖురాన్ లాంటివనే భారీ డైలాగుల్ని అలవోకగా వల్లెవేసే జె.పి,పవన్ లు , మోడీని వెనకేసుకొస్తున్నందుకు లౌకిక వాదుల క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
1. మీరు రాజకీయాలు కలుషితమైపోతున్నాయని, రాజకీయాల్లోకి నేరస్తులు ప్రవేశిస్తున్నారనీ తెగ ఇదై పోతుంటారు. గుజరాత్ లో 97 మంది అమాయక స్త్రీలను, పిల్లల్ని నిర్దాక్షిన్యంగా చంపిన కేసులో మాయా కొందానికి కోర్టు 28 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఈ నేరం 2002 లో జరగ్గా, తీర్పు 2013లో వెలువడింది. 2007 లో ఈమెను మోడీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా నియమించాడు. అల్లర్లలో ఆమె పాత్ర ఉందనే విషయం తెలీని అఙ్నానం, అసమర్థత వల్ల మోడీ ఆమెను మంత్రిని చేశాడా లేక, ముస్లింలను చంపినందుకు ప్రతిఫలంగా ఆమెకు మంత్రి పదవి ఇచ్చాడా? అవినీతి కంటే, అమాయకుల్ని చంపడం అనేది పెద్ద నేరమేమీ కాదని మీరు భావిస్తున్నారా?
2. మీరు బలమైన లోక్పాల్ వ్యవస్థ గురించి, అవినీతి గురించి TV స్టూడియోల్లో గంటలకొద్దీ మాట్లాడు తుంటారు. కానీ, మోడీ గుజరాత్ లో లోకాయుక్తను నియమించకుండా పదేళ్ళపాటు ఖాళీగా ఉంచాడు. చివరికి గుజరాత్ గవర్నర్ చొరవ తీసుకుని ఓ లోకాయుక్త ని నియమిస్తే, మోడీ ఆ నియామకానికి వ్యతిరేకంగా గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించాడు. అక్కడ చుక్కెదురవడంతో, కోట్ల కొద్దీ ప్రజాధనాన్ని ఫీజుగా చెల్లించి రాం జెఠ్మలానీ ని లాయర్ గా పెట్టుకుని సుప్రీం కోర్టుకి వెల్లాడు. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో, విధిలేని పరిస్తితుల్లో హడావుడిగా గుజరాత్ లోకాయుక్త చట్టాన్ని సవరించి, తూ తూ మంత్రంగా లోకాయుక్త నియామకాన్ని కొన్ని నెలల క్రితం పూర్తి చేశాడు. ఇప్పుడు మీరు మోడీని సమర్థిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మోడీ విధానమే సరైనదని మీరు భావిస్తున్నారా?
3. భారత రాజ్యాంగ ఔన్నత్యం గురించి మీరు అనర్గళంగా ప్రసంగిస్తుంటారు. ఏవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిని శిక్షించే అధికారం రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానాలకు ఇవ్వబదింది. కానీ మోడీ పాలనలోని గుజరాత్లో అనేకమంది మైనారిటీ యువకుల్ని కేవలం టెర్రరిస్టులనే అనుమానం మీద పోలీసులు కాల్చిచంపడం జరిగింది. మృతుల్లో కొందరికి టెర్రరిజం తో ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే నిరూపించబడింది. మిగతా కేసులు కూడా వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. నకిలీ ఎంకౌంటర్ల అభియోగంపై సుమారు 20 మంది గుజరాత్ ఉన్నత స్థాయి పోలీసు అధికారులు సస్పెండ్ కావడమో జైలు శిక్ష అనుభవించడమో జరిగింది. గుజరాత్లో శాంతి భద్రతలు ఈ స్థాయిలో విఫలమవడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో బాటు హోం శాఖను కూడా వెలగబెడుతున్న మోడీ పాత్ర లేదంటారా?
4. మీరు టి.వి. చర్చల్లో ఏ విషయాన్ని ఐనా హేతుబద్ధంగా విశ్లేషిస్తుంటారు. అదే హేతుబద్ధత ఆధారంగా దీనికి సమాధానం చెప్పండి. ఓ విద్యార్థి 9వ తరగతివరకు ప్రతి ఏడూ మంచి మార్కులు సాధిస్తే, 10 వ తరగతిలో కూడా మంచి మార్కులే సాధిస్తాడు. ఆ మాత్రం దానికి కేవలం తనవల్లే అతనికి మంచి మార్కులు వచ్చాయని 10వ తరగతి టీచరు చాటింపు వేస్తే ఎలావుంటుంది? ఆ విద్యార్థి అన్ని తరగతుల్లోనూ మంచి మార్కులు సాధించిన విషయం తెలీని అమాయకులు ఎవరైనా ఆ టీచర్ని నమ్మితే ఆది వేరే విషయం. కానీ, బ్రిటీష్ వారి కాలం నుండే గుజరాత్ పారిశ్రామికంగా ఇతర రాష్ట్రాల కన్నా ఏంతో అభివృద్ధి చెందిందనే విషయాన్ని సివిల్ సర్వీసెస్ పుస్తకాలలో చదువుకున్న మీరు కూడా మోడీ కారణంగానే గుజరాత్ అభివృద్ధి చెందిందనే నిర్ణయానికి ఎలా వచ్చారనేదే ఆశ్చర్యకరం. బాల బాలికల్లో పౌష్టికాహార లోపం, గ్రామీణ విద్య, వైద్యం లాంటి అనేక సంక్షేమ రంగాల్లో గుజరాత్ స్థాయి నానాటికీ దిగజారిపోతున్న విషయం మీ దృష్ఠికి రాలేదా? లేక అధిక పారిశ్రామికాభివృద్ధి ముందు, ఇవన్నీ పెద్దగా పట్టించుకోవలసిన అంశాలు కాదని మీ అభిప్రాయమా?
5.కొన్నేళ్ళక్రితం వచ్చిన 'ఒకే ఒక్కడు ' సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అందులో టి.వి. వ్యాఖ్యాతగా పనిచేసే కధానాయకుడు, విలన్ పాత్రధారి అయిన రాజకీయనాయకుడ్ని కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు అడుగుతాడు. వాటికి సమాధానాలు చెప్పలేని ఆ రాజకీయ నాయకుడు ఆ ఇంటర్వూ మధ్యలోనే ఆపేసి స్టూడియో నుండి వెల్లిపోతాడు. 'గుజరాత్ అల్లర్లలో అన్ని వేల మంది అమాయకులు మరణించినందుకు మీరు చింతిస్తున్నారా?' అని విలేఖరి కరన్ ధాపర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడని మోడీ, విలన్ రఘువరన్ లాగానే స్టూడియో నుండి హడావుడిగా వెల్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ యూటూబ్ లో ఉన్నాయి. గోధ్రా రైలు దహనంలో, అనంతరం జరిగిన అల్లర్లలో మరణించిన కొద్దిపాటి హిందువుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించటంలో ఏ మాత్రం ఆలస్యం చేయని మోడీ, అల్లర్లలో మరణించిన అమాయక ముస్లింల కుటుంబాలను మాత్రం ఇప్పటికీ కలవలేదు, వారికి కనీస సానుభూతిని కూడా ప్రకటించలేదు. మోడీ మతోన్మాదం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా మీలాంటి వారి కళ్ళకి అతను సెక్యులరిస్టుగా కనిపించడం విచారకరం. అమాయకుల చావుల విషయంలో, చనిపోయిన వారి మతాన్ని బట్టి, ఒక్కో మతానికి ఒక్కో రకంగా స్పందిస్తున్న మోడీ లాంటి మతోన్మాది భారత్ లాంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్మే దేశానికి ఎలా ప్రధానిగా అర్హుడని మీరు భావిస్తున్నారు?
నిజానిజాలతో సంబంధం లేకుండా గోబెల్స్ ప్రాపగాండా సఫలీకృతం అవడం, వ్యక్తి పూజ, అధికారం అంతా ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కావడం లాంటివి అంతిమంగా దేశాన్ని నియంత పాలనలోకి నెట్టేస్తాయనే విషయం ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ తో నిరూపితమైంది. అప్పుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ లాంటి ఎందరో నాయకుల పోరాటాల ఫలితంగా మళ్ళీ దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడింది. కానీ, అదే పేరు పెట్టుకున్న లోక్ సత్తా జె.పి మరో కాబోయే నియంత పాలనకి మంగళహారతులివ్వడం శోచనీయం. నిజానికి పైన అడిగిన ప్రశ్నలు, మోడీని డైరెక్టుగా అడగాలని, అతని నుండి సమాధానాలు రాబట్టాలని చాలా మంది జర్నలిస్టులు ప్రయత్నిస్తున్నారు. కానీ, మోడీ ఇలాంటి వారికి ఇంటర్వ్యూలు ఇవ్వడు. కేవలం తనకు అనుకూల వార్తలు రాసే మీడియాల్లోనే, అది కూడా తాను ముందుగా ఎంచుకున్న ప్రశ్నలకు మాత్రమే అందమైన సమాధానాలు ఇస్తారు. ఇక ఆ తర్వాత వందల కోట్లు చెల్లించి ఏర్పాటు చేసుకున్న ప్రాపగాండా ఏజెన్సీలు ఆ అందమైన సమాధానాల్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాయి.
ఈ వ్యూహం ఇప్పటిదాకా విజయవంతం కాబట్టే, మోడీ వస్తే ఏదో ఉద్ధరిస్తాడనే భ్రమలు అనేక మందిలో కనిపిస్తున్నాయి. కానీ, తాము అందరికంటే చాలా విభిన్నమైన వారమనీ, తమకు గొప్ప, గొప్ప విలువలు, సిద్ధాంతాలు ఉన్నాయనీ ప్రగల్బాలు పలికే జె.పి, పవన్ కళ్యాన్ లాంటి వారైనా, మోడీ తప్పించుకు తిరుగుతున్న ప్రశ్నలకు సమాధాన మివ్వాల్సిన అవసరం ఉంది.
good analysis..But stupid telugu media never questions,,,Becoz caste biased media..
ReplyDeleteThanks, KushalNaidu.
DeleteNenu Meeku Proofs and references ichanu.. avi chadivi ardham chesukune vopika and badyata meeku vunda ?
ReplyDelete1వ. ప్రశ్నకి సమాధానంగా 4 లింకులు ఇచ్చారు.
Delete1వ.లింకులో మోడీ వెంటనే ఆర్మీ ని పిలిపించాడని చూపే పేపర్ కటింగ్స్ ఉన్నాయి.
పిలిచాడు కరెక్టే, పిలిచి ఏం చేశాడు? వారిని సరిగ్గా వినియోగించుకునేలా రాష్ట్ర పోలీసుల్ని పురమాయించాలి. అలా చాశాడా? మాజీ కాంగ్రెస్ MPని, మరో 70 మందిని సజీవ దహణం చేసిన కేసులో ఏం జరిగిందో తెలీదా? అతని ఇంటికి 1కి.మీ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ ఆ సమయానికి 140 మంది పోలీసులు కూడా ఉన్నారు. కానీ, ఒక్కరు కూడా వారిని కాపాడ్డానికి వెల్లలేదు. ఎందుకని, అలోచించారా? మరో విషయం, మోడీకి సుప్రీం కోర్టు క్లీన్ ఇచ్చిందని ఆ లింకులో రాసి ఉంది. ఏ కేసులో, ఎప్పుడు అలాంటి తీర్పు సుప్రీం కోర్టు నుండి వచ్చింది చెప్పగలరా? ఇలాంటి అబద్ధాల్నే గోబెల్స్ ప్రాపగాండా అంటారు. దయచేసి అలాంటి ప్రయత్నాల్ని మానుకోండి. అలాంటి వాటికి నాబ్లాగ్ లో స్థానం లేదు.
2వ.లింకు - http://www.tehelka.com/gujarat-govt-to-seek-death-penalty-for-maya-in-riot-case/
3వ.లింకు- http://www.tehelka.com/guj-govt-withholds-decision-on-death-penalty-for-ex-minister/
ముందుది మాయాకొందానికి ఉరిశిక్ష విధించమని అడగబోతున్నట్లు, తర్వాతది అలా అడగటాన్ని విరమించుకున్నట్లు చెప్పే లింకులు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? అసలు నేను అడిగింది ఏమిటి? ఇలాంటి మనిషికి ఏ ప్రాతిపదికన మంత్రిపదవి ఇచ్చాడు అని. దానికి సమాధానం మీదగ్గర ఉందా? అది సరే, కసబ్, అఫ్జల్ గురులకి, ఉరి వేయాల్సిందేనని BJPవారు తెగ హడావుడి చేశారు కదా, మరి మాయా కొందానికి ఉరి వేయాలని ఎందుకడగటం లేదు.? మీకేమర్థమైంది?
ఇక , 4వది, ఎవరు రాశారో కూడా తెలీని అర్థం పర్థం లేని అనానిమస్ లింకు.
2వ.ప్రశ్న:
about LokYuka..
I cannot answer about LokYoukta now,, Please give me some time ,definetly i would answer that too ."
పోన్లెండి, ఏదో ఓ లింకు ఇచ్చేయకుండా, దీనికి సమాధానం ఇప్పటికి లేదని ఒప్పుకున్నారు. మంచిది.
3.వ ప్రశ్న:
సో, వేరే రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ఎంకౌంటర్లు జరిగాయి , అనేది ఈ ప్రశ్నకి సమాధానమా? కేవలం ఓ వర్గం వారిని, వారికి టెర్రరిజం తో సంబంధంలేదని తెలిసికూడా పట్టుకుని, కాల్చి చంపడం, అనేది కేవలం గుజరాత్లోనే జరిగింది. పైగా,రాజ్యాంగ, చట్ట వ్యతిరేక మైన నకిలీ ఎంకౌంటర్లను కేవలం ఓట్ల కోసం, బాహాటంగా సమర్థించడం అనేది, ఇప్పటి దాకా దేశంలోని ఏ రాజకీయ నాయకుడూ చేసి ఉండడు. ఒక్క మోడీ తప్ప. ఇది చూడండి - http://www.rediff.com/news/2007/dec/05gujpoll5.htm?zcc=rl
4వ ప్రశ్న. అక్కడ అభివృద్ధి జరింగిందని చూపించే లింకులు, ఫోటోలు.
అక్కడ అభివృద్ధి జరగలేదని నేను చెప్పానా? అక్కడ అభివృద్ధి, మోడీ లేకముందు కూడా జరిగింది, మోడీ ఉన్నప్పుడు జరిగింది, రేపు మోడీ లేకున్నా జరుగుతుంది. కానీ ఆ అభివృద్ధికి చెల్లించే మూల్యం ఏంటనేది అసలు ప్రశ్న.
5.వ. ప్రశ్న:
http://www.narendramodi.in/satyameva-jayate-truth-alone-triumphs/
ఈ లింకులో మోడీ సొంత డబ్బా తప్ప, కరన్ థాపర్ ఇంటర్వ్యూ గురించి ఏముంది? "అక్కడ అమాయకులు చనిపోయినందుకు నాకు బాధ కలిగింది" ఈ ఒక్క మాట చెప్పడంలో ఆయనకున్న నష్టం ఏంటి. ఈ లింకులో మీకు ఏం అర్థమైంది?
మీ సమాధానాలు కనీసం మీకైనా అర్థమైతే, అదే పదివేలు. సెలవు.
@Hari Babu:
ReplyDeleteఎవరైనా ఓ వ్యక్తి మనుషుల్ని మనుషుల్లా కాకుండా, 'వాళ్ళు ', ' మనం' అని సంబోధిస్తున్నాడంటే, అతనికి బాగా ముదిరిందని అర్థం. అది ఆ వ్యక్తికి, దేశానికి ఏమాత్రం మంచిది కాదు. ముందు దాన్నుండి బయట పడండి.
"59 మంది అమాయకుల్ని బలిగొన్న గోధ్రా రైలు దహణం ముమ్మాటికీ ఓ హేయమైన చర్యే. సమర్థుడైన, బలమైన నాయకుడనే వారు ఎవరైనా దీనిపై నిష్పాక్షిక,శీఘ్రతర విచారణ జరిగే ఏర్పాట్లు చేసి, బాధ్యులను గుర్తించి వారికి అత్యంత కఠిన శిక్షలు విధించేలా చేయగలగాలి. "( Mar 21, 2014)
ఇది నేను నా గత పోస్టులో రాసింది. దీనిని బట్టి ఈ విషయంలో నా స్టాండ్ ఏంటో మీకు తెలిసుండాలి. ఇంకా తెలియలేదంటే లైట్ తీస్కోండి, కొందరికి కొన్ని ఎప్పటికీ అర్థం కావు.
తప్పు చేసిన వారు ఎవరైనా, అందరికీ నేరానికి తగ్గ శిక్షలు పడాలనే కాస్త బుద్ధివున్నోల్లు ఎవరైనా కోరుకుంటారు. కసబ్, అఫ్జల్ గురూ లను కాంగ్రెస్ వాల్ల్లు పట్టుకుని ఉరి తీశారు. దీన్ని దేశంలో అందరూ స్వాగతించారు. ఏ వర్గమైనా దీనిని వ్యతిరేకించినట్లుగానీ, నిరసనలు తెలిపడం గానీ జరగలేదు. ఇక ఏంటి మీబాధ? 'మనకన్యాయం జరిగిపోతుందహో' అని జనాలని బ్రైన్వాష్ చేసి పబ్బం గడుపుకునే రాజకీయ రాబందుల బ్యాచ్ దేశంలో చాలా ఎక్కువగా ఉంది. మీరు వీరిబారిన పడినట్లు మీ మెసేజ్ చూస్తే తెలుస్తుంది. అంతలేదు కానీ, కాస్త రిలాక్స్ అవ్వండి. సెలవు.
మరొక్క ప్రశ్న. మీరు ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటానని తెగ ప్రచారం చేసుకున్నారు. ఆతరువాత అదేమీ జరగలేదు. కొద్దిరోజులకు భాజపాతో (తెదేపాతో కూడా?) పొత్తు పెట్టుకుంటానని పొలోమని రంకెలెసారు. దరిమిలా మీ పార్టీ కార్యకర్తలు నిరుత్సాహపడ్డారని వాళ్ళని బుజ్జగిస్తున్నట్టు బిల్డప్పులు కూడా ఇచ్చారు. అయితే భాజపా/తెదేపా వాళ్ళు మిమ్మల్ని కనీసం చర్చలకు పిలిచిన దాఖలాలు కూడా లేవు. పిలవని పేరంటానికి వెళ్ళడం సిగ్గుగా లేదా?
ReplyDelete@Jai Gottimukkala garu,
Deleteసరిగ్గా అడిగారు. సిద్ధాంతాలు, విలువలు అంటూ JP చేసినంత హడావుడి, వేరే ఏ ఇతర నాయకుడూ/పార్టీ చేసిఉండరు. 2,3 సీట్ల కోసం కక్కుర్తి పడి, ఈయన తనకు తెలియని, అలవాటులేని పొత్తు రాజకీయం చేద్దామని ట్రై చేసి దారుణంగా అభాసుపాలయ్యాడు. , రొటీన్ రాజకీయాల్లో మిగతా పార్టీలన్నీ పిహెచ్ డి. లు చేసిఉన్నై. ఈయన ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నాడు. వాల్ల ఆటలోకి దిగితే ఈయన్ను నల్లిలా నలిపేస్తారు. గీతలోని 'స్వధర్మే నిధనం శ్రేయహ ' తత్వం ఇప్పుడు ఈయనకు బోధపడి ఉంటుంది.
నిజమే సుమండీ. ఆయనకు బాగా చేతనయిన అంతఃపుర రాజకీయాలు (backroom politics) వదిలేసి అనవసరంగా ఎన్నికల చదరంగంలో దూరాడు. నిజానికి 1995 తెదేపా సంక్షోభంలో పావులు కలిపినట్టయితే కాంగ్రేసులో కేవీపీకి ఉన్న స్థానం చంద్రబాబు పంచన దొరికేది.
Delete