Tuesday, April 22, 2014

షాహిద్ - ఓ వెంటాడే జీవిత గాధ!!!

షాహిద్ - ఓ వెంటాడే జీవిత గాధ
గత వారం ప్రకటించిన 61వ జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకత్వం కేటగిరీల్లో  షాహిద్ సినిమా విజేతగా నిలవడం   ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.  మానవ హక్కుల కార్యకర్తగా, న్యాయవాదిగా పనిచేసిన  షాహిద్ ఆజ్మి  నిజ జీవిత సంఘటనల  ఆధారంగా  తెరకెక్కించబడిన ఈ సినిమా, విడుదలైనప్పుడే చాలా గొప్ప సినిమాగా విమర్శకుల ప్రశంసలందుకుంది.  
షాహిద్ ఆజ్మీ 1977లో ముంబై లో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. టీనేజ్ లో ఉన్నప్పుడు, 1992 లో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం ముంబై లో  జరిగిన ముస్లిం వ్యతిరేక అల్లర్లను దగ్గరినుండి చూసిన షాహిద్ తీవ్రంగా చలించి పోయాడు.  దీనితో ఇంటి నుండి పారిపోయి పాక్ ఆక్రమిత  కాశ్మీర్లోని తీవ్రవాద సంస్థలో చేరి, కొన్నాళ్ళు ఆయుధాల్ని ఉపయోగించడంలో శిక్షణ పొందాడు.  కానీ, అమాయకుల్ని అమానుషంగా పొట్టనపెట్టుకునే  టెర్రరిజం కూడా సరైన విధానం కాదని తెలుసుకున్న  షాహిద్,   అక్కడి నుండి తప్పించుకుని ఇంటికి తిరిగి  వచ్చేశాడు.  అనంతరం , ఓ పట్టు బడిన తీవ్రవాది  వద్ద దొరికిన సమాచారం ఆధారంగా పోలీసులు షాహిద్ ని టాడా చట్టం కింద  అరెస్టు చేసి  తీహార్ జైలుకి తరలించారు.  ఏడేళ్ళు  తీహార్ జైల్లో   గడిపిన  షాహిద్ అక్కడే  ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.   జైలు నుండి విడుదలయ్యాక,   చేయని నేరానికి జైల్లలో మగ్గుతున్న అనేక మంది  నిర్భాగ్యుల్ని రక్షించాలనే లక్ష్యంతో  షాహిద్  న్యాయవాద విద్యను అభ్యసించాడు.   ముంబై లో ప్రముఖ క్రిమినల్ లాయర్ మాజిద్ మీనన్ దగ్గర కొన్నాళ్ళు సహాయకుడిగా పని చేసిన అనంతరం 2003 లో తానే సొంతంగా ప్రాక్టీసు మొదలు పెట్టాడు.   ఎక్కడ బాంబు దాడులు జరిగినా పోలీసులు కొందరు మైనారిటీ యువకుల్ని హడావుడిగా అరెస్టు చేసి తాము కేసును   ఛేదించామని  ప్రకటించేయడం,  అది పూర్తిగా యదార్థమన్నట్లుగా మీడియా మొత్తం  వారిని తీవ్రవాదులుగా  భావిస్తూ వార్తలు రాయడం, గత దశాబ్ధంలో అనేక కేసుల్లో జరిగింది.   షాహిద్ ఈ కేసుల్ని క్షుణ్ణంగా పరిశీలించేవాడు.  నిందితులు అమాయకులని తనకు నమ్మకం కుదిరాక వారి పక్షాన పోరాడటానికి ముందుకు వచ్చేవాడు.  2002 ఘట్కోపర్ బస్ బాంబు కేసు, 2006  ఔరంగాబాద్ కేసు, మాలేగావ్ కేసు, 2007 ముంబై లోకల్ ట్రైన్ కేసు వంటి అనేక కేసుల్లో  అమాయక నిందితుల పక్షాన వాదించి, వారు నిర్దోషులుగా విడుదల అవ్వడంలో కీలక పాత్ర పోషించాడు.  వీరిలో చాలామంది  కనీసం బెయిలు  అప్లికేషన్ రుసుము కూడా చెల్లించుకోలేని పేదలే.  వీరి నుండి ఏమాత్రం  ఫీజు ఆశించకుండా షాహిద్ వీరి పక్షాన పోరాడాడు.  షాహిద్ సాగిస్తున్న ఈ నిస్వార్థ పోరాటం  కొందరు మతోన్మాదులకి కంటగింపుగా మారింది.   తీవ్రవాద కేసుల్లో నిందితుల తరుపున వాదించడం మానుకోవాలని అతనికి రోజూ బెదిరింపు  ఫోన్లు వస్తుండేవి. అయినా  ఏ మాత్రం చలించకుండా షాహిద్ తన పని తాను చేసుకు పోతుండేవాడు.  చివరికి  2008 ముంబై పై  దాడి  కేసులో, కసబ్ బృందానికి సహకరించాడనే  ఆరోపణ మీద   అరెస్టు కాబడిన ఫాహీం అన్సారీ తరపున వాదిస్తున్నప్పుడు,  షాహిద్  ఆజ్మీని   అతని ఆఫీస్ లోనే కొందరు దుండగులు కాల్చి చంపారు.  ఇది జరిగిన 2 సంవత్సరాల తర్వాత , 2012 లో భారత సుప్రీంకోర్టు ఫాహిం అన్సారి ని నిర్దోషిగా విడుదలచేసింది. ఈ విధంగా ఏడేళ్ళ తన న్యాయవాద జీవితంలో మొత్తం 17 కేసుల్లో నిందితుల్ని  నిర్దోషులుగా విడుదల చేయించడం ఓ అద్భుతం. ఇన్ని ఆటుపోట్లని ఎదుర్కొని, ఇంతటి విజయాలను సాధించిన షాహిద్ వయసు మరణించేనాటికి కేవలం 33 సంవత్సరాలే.  షాహిద్ మరణం న్యాయదేవతకి తీరని లోటని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. కళియుగాంతం నాడు,  భగవంతుడు సమస్త ప్రాణుల్ని తిరిగి పుట్టిస్తాడనీ, అప్పుడు భూమిపై వారు చేసిన తప్పొప్పుల పట్టిక ప్రకారం వారికి స్వర్గమో, నరకమో నిర్దేశింపబడుతుందనీ చెప్తుంటారు.  అదే నిజమైతే,  అప్పుడు కొందరు తాము చేసిన తప్పుల్ని తలుచుకుని నరక భయంతో వణికి పోతుంటారు. మరికొందరు తాము చేసిన మంచి పనులకు కలగబోయే స్వర్గ సుఖాలకోసం ఆతృతతో ఎదురు చూస్తుంటారు. కానీ కొందరు మాత్రం,  తమకివేమీ పట్టనట్టు  భూమిపై తమ కళ్ళముందు జరిగిన అనేక అన్యాయాలు, అక్రమాల గురించి దేవున్ని నిలదీయాలని  కళ్ళల్లో ఎర్రని జీరతో, దేవుని వైపు వడివడిగా అడుగులు వేస్తుంటారు.  అలాంటి వారినే షహీద్  (అమరుడు) లంటారు. ఇంతటి గొప్ప జీవితాన్ని  యధాతదంగా తెరకెక్కించిన దర్శకుడు   హన్సల్ మెహత, షాహిద్ పాత్రలో జీవించిన రాజ్ కుమార్ యాదవ్ లు  మిక్కిలి ప్రశంసార్హులు.

Tuesday, April 8, 2014

మోడీకి సుప్రీం కోర్టు చ్లీన్ చిట్ , ఇచ్చిందా? లేదా?

గుజరాత్ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదనలు  ఈ నెల 11 న మొదలవబోతున్నాయి.

"మోడీకి అల్లర్లతో  సంబంధం లేదని సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది"- ఇది  మోడీ మద్దతు దారులు తరచుగా చెప్పే మాట.  సుప్రీం కోర్టు ఏ కేసు విషయంలో, ఎప్పుడు ఈ క్లీన్ చిట్ ఇచ్చిందో ఎవ్వరూ చెప్పకున్నా,  అందరూ పదే, పదే అంటుండటంతో ఇది జనంలోకి బాగానే వెళ్ళింది. మోడీ ఇప్పుడు ప్రధాని రేసులో ఉన్నాడు కాబట్టి, ఈ అంశం గురించిన  నిజానిజాలను  అందరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. గోద్రా రైలు దహణం అనంతరం గుజరాత్ మొత్తం మీద అనేక చోట్ల సామూహిక జనహననం జరిగింది. వీటికి సంబంధించిన కొన్ని కేసుల్లో ఇప్పటికే విచారణ పూర్తై, దోషులకు శిక్షలు పడగా, ఇంకా అనేక కేసుల్లో విచారణలు జరుగుతున్నాయి. ఈ కేసులు వేటిలోనూ  మోడీ ముద్దాయి కాదు, మోడీ మీద ప్రత్యక్షంగా ఎలాంటి  ఆరోపణలూ లేవు. కాకపోతే గుల్బర్గ్ సొసైటీ కేసు మాత్రం వీటన్నిటికంటే ప్రత్యేకమైంది. గోధ్రా రైలు దహణం జరిగిన మరుసటిరోజు, అక్కడి అధికార BJP, VHP లాంటి సంస్థలు బంద్ కి పులుపునిచ్చాయి. ఆ రోజు ఉదయం నుండే, ముస్లింల నివాసాల చుట్టూ అల్లరి మూకలు  గుమికూడి  తీవ్రంగా నినాదాలిస్తూ, దాడులకు ఏర్పాట్లు చేసుకోవడం మొదలైంది. దాదాపు అందరూ ముస్లింలే నివాసం ఉండే అహ్మదాబాద్లోని గుల్బర్గ్ సొసైటీని కూడా అన్ని వైపులనుండి అల్లరిమూకలు చుట్టు ముట్టాయి. దీనితో భయభ్రాంతులకు గురైన ముస్లింలు, అదే కాలనీలో ఉంటున్న ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ MP కూడా అయిన 70 సం, ల ఎహ్సాన్ జాఫ్రీ ఇంటికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను అర్థం చేసుకున్న జాఫ్రీ, అహ్మదాబాద్ పోలీస్ కమీషనర్ పి.సి.పాండే ని సహాయం అర్థించాడు. పాండే జాఫ్రీ ఇంటికి వచ్చి భయపడాల్సిందేమీ లేదని భరోసా ఇచ్చి వెల్లారు. కానీ,ఆశ్చర్యకరంగా ఇంటి ముందు  అప్పటికే  గుమికూడిన అల్లరి మూకను చెదరగొట్టే ప్రయత్నం ఏదీ చేయలేదు. ఇక పాండే వెల్లగానే అక్కడి అల్లరి మూక చెలరేగిపోయారు. ఇంటికి బయటి నుండి నిప్పుపెట్టి, తలుపులు బద్దలుకొట్టి జాఫ్రీని అతని ఇంట్లో తలదాచుకోవడానికి వచ్చిన 69 మందిని సజీవ దహనం చేశారు. మృతుల్లో  స్త్రీలు, పిల్లలే అధికంగా ఉన్నారు. ఈ మొత్తం విధ్వంసం నిరాటంకంగా 4 గంటలు జరిగింది. తమను  రక్షించాల్సిందిగా  జాఫ్రీ ఉదయం నుండి గుజరాత్ ప్రభుత్వం లోని పెద్దలందరికీ ఫోన్లు చేస్తూనే ఉన్నారని,ముఖ్యమంత్రి ఆఫీసుకి కూడా  చాలా సార్లు ఫోన్ చేసి మాట్లాడారని   అక్కడ బతికి బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.  దాడి జరిగిన సమయంలో ఇంట్లో లేకపోవడంతో, జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ ప్రాణాలతో బతికిపోయింది. అనంతరం ఆమె, తన భర్త మృతికి కుట్రదారులుగా పేర్కొంటూ మోడీతో పాటు సుమారు 60 మంది గుజరాత్ ఉన్నతాధికారులపై కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే , ఆ ఆరోపణలు కేవలం ఊహాజనితమైనవనీ , ప్రాధమిక సాక్ష్యాలు లేవనీ పేర్కొంటూ, పోలీసులు  ఆ పిర్యాదును స్వీకరించలేదు. పోలీసుల్ని కేసు నమోదు చేయడానికి ఆదేశించాల్సిందిగా  గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడా  జాకియా జాఫ్రీకి నిరాశే ఎదురైంది. చివరి ప్రయత్నంగా జాఫ్రీ, సుప్రీంకోర్టు తలుపు తట్టగా, అసలు ఆమె ఆరోపిస్తున్నట్లుగా  మోడీ మరియు ఇతర ఉన్నతాధికారులపై కేసు నమోదు చేయడానికి కావలసిన కనీస సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయో లేదో చూడాల్సిందిగా సుప్రీం కోర్టు, సిబి ఐ  మాజీ డైరెక్టర్ కె.రాఘవన్ ఆధ్వర్యంలోని  సిట్(స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీం) ని   ఆదేశించింది. రెండేళ్ళపాటు అనేక   సాక్షుల్ని విచారించి, అనేక  ఇంటెలిజెన్స్ రిపోర్టుల్ని పరిశీలించిన సిట్, వీటన్నిటినీ క్రోఢీకరించి   ఓ సుదీర్ఘ రిపోర్టును  తయారు చేసింది. కానీ అంతిమంగా, మోడీ పాత్రను నిరూపించే సాక్షాలేవీ లేవని నిర్ధారించింది. సిట్ తయారు చేసిన రిపోర్టును,   దాని సిఫార్సులను విష్లేశించడానికి సుప్రీం కోర్టు మరో సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ ని అమికస్ క్యూరి(కోర్టుకు సహాయకుడు)గా నియమించింది. సిట్ రిపోర్టును క్షున్నంగా  పరిశీలించిన రాజు రాంచంద్రన్,  ఆరోజు ముఖ్యమంత్రి అఫీసుకు వచ్చిన ఫోన్ కాల్స్  లాంటి   చాలా  ముఖ్యమైన అంశాల్ని సిట్  పరిగణలోకి తీస్కోలేదనీ, సిట్ రిపోర్టులోనే  మోడీ పాత్రపై అణుమానాలు కలిగించే   అంశాలు  అనేకం  ఉన్నాయనీ, కాబట్టి జాకియా జాఫ్రీ అడుగుతున్నట్లుగా కేసు నమోదు చేసి మరింత  లోతుగా  దర్యాప్తు చేస్తే అన్ని నిజాలూ బయటపడ్తాయనీ అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు, సిట్ రిపోర్టునూ, అమికస్ క్యూరీ రిపోర్టునీ తీసుకెల్లి అహ్మదాబాద్ మెజిస్ట్రేట్ కోర్టులో తదుపరి వాదనలు చేసుకోవాలని పంపించింది. ఇరువాదనలనూ విన్న మెజిస్ట్రేట్ కోర్టు, సిట్ వాదనను సమర్థించి మోడీపై కేసు నమోదుకు తగినంత ప్రాధమిక సాక్ష్యాలు లేవని తీర్పు చెప్పింది. జాఫ్రీ ఈ తీర్పుకి వ్యతిరేకంగా గుజరాత్ హైకోర్టులో అప్పీలు చేసింది. ఈ కేసు ఈ నెల 11న అక్కడ విచారణకు రానుంది. అక్కడ తీర్పు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో  జాకియా జాఫ్రీకి తిరిగి సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉంది. అక్కడ కూడా జాకియా జాఫ్రీ విన్నపం తిరస్కారానికి గురైతే, అప్పుడు మోడీకి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పవచ్చు. కానీ దానికి ఇంకా చాలా గడువుంది.   మరి ఇప్పుడు సుప్రీం కోర్టు మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిందని చాటింపు వేసే వారు,  సుప్రీం కోర్టు నియమించుకున్న అమికస్ క్యూరీ మోడీకి వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయని చెప్పిన విషయం తెలియని వారో, లేక ఉద్దేశ్య పూర్వకంగానే ఆ విషయాన్ని దాయాలని చూస్తున్నవారో అయ్యుంటారు.  కాస్త ఆలస్యం కావచ్చునేమో కానీ, అంతిమంగా సత్యమే గెలుస్తుందని  భారత సుప్రీం కోర్టు అనేక సార్లు నిరూపించింది. సత్యమేవ జయతే.

Saturday, April 5, 2014

జె.పి.,పవన్ కళ్యాన్ లు ఈ ప్రశ్నలకు బదులివ్వగలరా?


తమ పార్టీకి తప్ప  వేరే ఏ ఇతర పార్టీలకూ సిద్ధాంతాలు లేవనీ,  ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించటానికే తమ పార్టీ పుట్టిందనీ, గంగాజలం లాంటి తమ పార్టీ ఏ ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకోదనీ  ఇన్నాల్లూ నీతి వచనాలు  ప్రవచిస్తూ వచ్చిన లోకసత్తా  అధినేత జయప్రకాశ్ నారాయణ,  ఇటీవల తనకు అకస్మాత్తుగా ఙ్నానోదయమైనట్లు    భాజపా తో పొత్తుకు సిద్ధమని ప్రకటించేశారు. ఇక కమ్యూనిస్టు విప్లవ యోధుడు  చేగువేరా బొమ్మతో జనసేనను ప్రకటించిన  పవన్ కళ్యాన్,  కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేక భావజాలాలైన   కమ్యూనలిజం, క్యాపిటలిజంలకు నిలువెత్తు రూపమైన  మోడీ  భజన చేయడం మొదలుపెట్టాడు.  గుజరాత్లో వేల మంది అమాయకుల మృతికి కారకుడుగా మైనారిటీలు, సెక్యులరిస్టులూ విమర్శిస్తున్న నరేంద్ర మోడీకి  దేశాన్నేలే అన్ని అర్హతలు ఉన్నాయని  వీరిద్దరూ క్లీన్  సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు.  భారత దేశ రాజ్యాంగం తనకు గీత, బైబిల్, ఖురాన్ లాంటివనే  భారీ డైలాగుల్ని అలవోకగా  వల్లెవేసే   జె.పి,పవన్ లు , మోడీని వెనకేసుకొస్తున్నందుకు   లౌకిక వాదుల క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 

1. మీరు రాజకీయాలు కలుషితమైపోతున్నాయని,  రాజకీయాల్లోకి నేరస్తులు ప్రవేశిస్తున్నారనీ  తెగ ఇదై పోతుంటారు. గుజరాత్ లో  97 మంది అమాయక స్త్రీలను, పిల్లల్ని నిర్దాక్షిన్యంగా చంపిన కేసులో  మాయా కొందానికి కోర్టు 28 సంవత్సరాలు  జైలు శిక్ష విధించింది.  ఈ నేరం 2002 లో జరగ్గా,    తీర్పు  2013లో వెలువడింది.  2007 లో ఈమెను  మోడీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా నియమించాడు. అల్లర్లలో ఆమె పాత్ర  ఉందనే విషయం తెలీని అఙ్నానం, అసమర్థత వల్ల  మోడీ ఆమెను మంత్రిని చేశాడా లేక,   ముస్లింలను చంపినందుకు ప్రతిఫలంగా ఆమెకు మంత్రి పదవి ఇచ్చాడా?    అవినీతి కంటే, అమాయకుల్ని చంపడం అనేది పెద్ద నేరమేమీ కాదని మీరు భావిస్తున్నారా? 
2
.   మీరు బలమైన లోక్పాల్ వ్యవస్థ గురించి, అవినీతి గురించి TV స్టూడియోల్లో గంటలకొద్దీ మాట్లాడు తుంటారు. కానీ, మోడీ  గుజరాత్ లో లోకాయుక్తను నియమించకుండా పదేళ్ళపాటు  ఖాళీగా ఉంచాడు. చివరికి గుజరాత్ గవర్నర్ చొరవ తీసుకుని ఓ లోకాయుక్త ని నియమిస్తే, మోడీ  ఆ నియామకానికి వ్యతిరేకంగా గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించాడు.  అక్కడ చుక్కెదురవడంతో, కోట్ల కొద్దీ ప్రజాధనాన్ని ఫీజుగా చెల్లించి  రాం జెఠ్మలానీ ని లాయర్ గా పెట్టుకుని సుప్రీం కోర్టుకి వెల్లాడు. అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో,  విధిలేని పరిస్తితుల్లో హడావుడిగా గుజరాత్ లోకాయుక్త   చట్టాన్ని సవరించి, తూ తూ మంత్రంగా లోకాయుక్త నియామకాన్ని కొన్ని నెలల క్రితం పూర్తి చేశాడు.   ఇప్పుడు మీరు మోడీని సమర్థిస్తున్నారు కాబట్టి  ఈ విషయంలో మోడీ  విధానమే సరైనదని మీరు భావిస్తున్నారా?
3. భారత రాజ్యాంగ ఔన్నత్యం గురించి మీరు అనర్గళంగా  ప్రసంగిస్తుంటారు. ఏవరైనా  చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిని శిక్షించే అధికారం  రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానాలకు ఇవ్వబదింది.   కానీ మోడీ  పాలనలోని గుజరాత్లో అనేకమంది మైనారిటీ యువకుల్ని కేవలం టెర్రరిస్టులనే  అనుమానం మీద పోలీసులు కాల్చిచంపడం జరిగింది. మృతుల్లో కొందరికి టెర్రరిజం తో ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే నిరూపించబడింది. మిగతా కేసులు కూడా వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. నకిలీ ఎంకౌంటర్ల  అభియోగంపై సుమారు  20 మంది గుజరాత్ ఉన్నత స్థాయి  పోలీసు అధికారులు సస్పెండ్ కావడమో జైలు  శిక్ష అనుభవించడమో జరిగింది.  గుజరాత్లో శాంతి భద్రతలు ఈ  స్థాయిలో విఫలమవడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో  బాటు హోం శాఖను కూడా వెలగబెడుతున్న మోడీ పాత్ర లేదంటారా?
4. మీరు టి.వి. చర్చల్లో ఏ విషయాన్ని ఐనా హేతుబద్ధంగా విశ్లేషిస్తుంటారు. అదే హేతుబద్ధత ఆధారంగా దీనికి సమాధానం చెప్పండి. ఓ  విద్యార్థి 9వ తరగతివరకు  ప్రతి ఏడూ మంచి మార్కులు సాధిస్తే,  10 వ తరగతిలో కూడా మంచి మార్కులే సాధిస్తాడు.  ఆ మాత్రం దానికి కేవలం తనవల్లే అతనికి మంచి మార్కులు వచ్చాయని   10వ  తరగతి టీచరు చాటింపు వేస్తే ఎలావుంటుంది? ఆ  విద్యార్థి అన్ని తరగతుల్లోనూ మంచి మార్కులు సాధించిన విషయం  తెలీని అమాయకులు ఎవరైనా ఆ  టీచర్ని నమ్మితే ఆది వేరే  విషయం. కానీ,  బ్రిటీష్ వారి కాలం నుండే  గుజరాత్ పారిశ్రామికంగా ఇతర రాష్ట్రాల కన్నా ఏంతో అభివృద్ధి చెందిందనే విషయాన్ని సివిల్ సర్వీసెస్ పుస్తకాలలో చదువుకున్న మీరు కూడా మోడీ కారణంగానే గుజరాత్ అభివృద్ధి చెందిందనే  నిర్ణయానికి ఎలా వచ్చారనేదే ఆశ్చర్యకరం. బాల  బాలికల్లో పౌష్టికాహార లోపం,  గ్రామీణ విద్య, వైద్యం లాంటి అనేక సంక్షేమ రంగాల్లో  గుజరాత్ స్థాయి  నానాటికీ  దిగజారిపోతున్న   విషయం మీ దృష్ఠికి రాలేదా? లేక అధిక పారిశ్రామికాభివృద్ధి ముందు,  ఇవన్నీ పెద్దగా పట్టించుకోవలసిన అంశాలు కాదని మీ అభిప్రాయమా?
5.కొన్నేళ్ళక్రితం వచ్చిన 'ఒకే ఒక్కడు '  సినిమాలో ఒక సీన్ ఉంటుంది.  అందులో టి.వి. వ్యాఖ్యాతగా పనిచేసే  కధానాయకుడు,  విలన్ పాత్రధారి అయిన రాజకీయనాయకుడ్ని కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు   అడుగుతాడు. వాటికి సమాధానాలు చెప్పలేని  ఆ రాజకీయ నాయకుడు ఆ ఇంటర్వూ మధ్యలోనే  ఆపేసి   స్టూడియో నుండి వెల్లిపోతాడు.  'గుజరాత్ అల్లర్లలో  అన్ని వేల మంది అమాయకులు మరణించినందుకు మీరు చింతిస్తున్నారా?' అని విలేఖరి కరన్ ధాపర్ అడిగిన  ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడని మోడీ,  విలన్ రఘువరన్ లాగానే  స్టూడియో నుండి హడావుడిగా వెల్లిపోయాడు.  దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ యూటూబ్ లో ఉన్నాయి.  గోధ్రా రైలు దహనంలో,  అనంతరం జరిగిన అల్లర్లలో మరణించిన కొద్దిపాటి హిందువుల  కుటుంబ సభ్యుల్ని పరామర్శించటంలో ఏ మాత్రం ఆలస్యం చేయని మోడీ,  అల్లర్లలో మరణించిన అమాయక ముస్లింల కుటుంబాలను మాత్రం ఇప్పటికీ కలవలేదు, వారికి కనీస సానుభూతిని కూడా ప్రకటించలేదు.  మోడీ మతోన్మాదం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా మీలాంటి వారి కళ్ళకి అతను సెక్యులరిస్టుగా కనిపించడం విచారకరం. అమాయకుల చావుల విషయంలో, చనిపోయిన వారి మతాన్ని బట్టి, ఒక్కో మతానికి ఒక్కో రకంగా స్పందిస్తున్న మోడీ లాంటి మతోన్మాది  భారత్ లాంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్మే దేశానికి ఎలా ప్రధానిగా అర్హుడని మీరు భావిస్తున్నారు?
నిజానిజాలతో సంబంధం లేకుండా గోబెల్స్ ప్రాపగాండా సఫలీకృతం అవడం, వ్యక్తి పూజ, అధికారం  అంతా  ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కావడం లాంటివి అంతిమంగా  దేశాన్ని నియంత పాలనలోకి నెట్టేస్తాయనే విషయం  ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ తో నిరూపితమైంది.  అప్పుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ లాంటి  ఎందరో నాయకుల పోరాటాల ఫలితంగా మళ్ళీ దేశంలో ప్రజాస్వామ్యం  పునరుద్ధరింపబడింది. కానీ, అదే పేరు పెట్టుకున్న   లోక్ సత్తా జె.పి  మరో కాబోయే నియంత పాలనకి మంగళహారతులివ్వడం శోచనీయం.   నిజానికి పైన అడిగిన ప్రశ్నలు, మోడీని  డైరెక్టుగా అడగాలని, అతని నుండి సమాధానాలు రాబట్టాలని చాలా మంది జర్నలిస్టులు ప్రయత్నిస్తున్నారు.  కానీ, మోడీ ఇలాంటి వారికి ఇంటర్వ్యూలు ఇవ్వడు. కేవలం తనకు అనుకూల వార్తలు రాసే మీడియాల్లోనే, అది కూడా తాను  ముందుగా  ఎంచుకున్న ప్రశ్నలకు మాత్రమే  అందమైన సమాధానాలు ఇస్తారు. ఇక ఆ తర్వాత వందల  కోట్లు చెల్లించి ఏర్పాటు చేసుకున్న ప్రాపగాండా ఏజెన్సీలు  ఆ అందమైన సమాధానాల్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాయి. 
 ఈ వ్యూహం ఇప్పటిదాకా విజయవంతం కాబట్టే, మోడీ  వస్తే ఏదో ఉద్ధరిస్తాడనే భ్రమలు అనేక మందిలో కనిపిస్తున్నాయి.  కానీ,  తాము అందరికంటే చాలా విభిన్నమైన వారమనీ, తమకు గొప్ప, గొప్ప  విలువలు, సిద్ధాంతాలు ఉన్నాయనీ ప్రగల్బాలు పలికే  జె.పి, పవన్ కళ్యాన్ లాంటి వారైనా, మోడీ తప్పించుకు తిరుగుతున్న ప్రశ్నలకు సమాధాన మివ్వాల్సిన అవసరం ఉంది.

Thursday, April 3, 2014

'కొనిదెల' కాదు, 'కరివేపాకు' కరెక్టు.

'కొనిదెల' కాదు,  'కరివేపాకు'  కరెక్టు.
వీడికి  తిక్కుందని అందరికీ తెలుసు కానీ, అది ఈ రేంజ్ లో ఉందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది.  ఇక వీడి తిక్క వెనకాల ఉన్న లెక్కలేమిటో  చంద్రబాబుకు, రామోజీరావుకే తెలియాలి.  ఎందుకంటే వీడి తిక్క వాగుడు అంతిమంగా వీరికి మాత్రమే ఉపయోగకరంగా ఉంది కాబట్టి.  ఏప్రెల్ ఫూల్స్ డే రోజున  ఈనాడు పత్రికలో వీడి తిక్క ఇంటర్యూ  అర పేజీ నిండా వచ్చింది.  మొత్తానికి దాని సారాంశం ఏంటంటే,  కాంగ్రెస్సు, జగన్,కె.సి.ఆర్.కమ్యూనిస్టులు  వీల్లంతా వేస్ట్,    ఇక్కడ చంద్రబాబు, అక్కడ మోడీ  వీల్లిద్దరే నిఖార్సైన నాయకులు.   వీడి తిక్క లాజిక్కులు ఏ రేంజ్ లో ఉన్నాయో వీడిచ్చిన ఒక ఆన్సర్ ని బట్టి చెప్పేయొచ్చు.
ప్రశ్న:  మోడీ పై మతవాద ముద్ర ఉంది కదా. ఆయనకు ఎలా మద్దతిచ్చారు?
తిక్కోడి సమాధానం:  నా దృష్టిలో కాంగ్రెస్ కంటే మోడీ యే నిజమైన లౌకికవాది. నేనొక దిక్కుమాలిన సినిమా షూటింగ్ కోసం  గుజరాత్ వెల్లినప్పుడు, అక్కడ ఒక హోటల్ లో బస చేశాను. దాని యజమాని ఓ ముస్లిం.  ఆయనతో మాట్లాడిన సంధర్భంలో  ఆయన మోడీ మహాత్ముడని చెప్పారు.   ఇక మోడీ  సెక్యులరిస్టని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి.
అదీ విషయం.  గుజరాత్లో  బిజినెస్ చేసేవాల్లు ఎవరైనా అక్కడ పదేళ్ళనుండీ  ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతారా? మాట్లాడి సుఖంగా బతక గలుగుతారా? మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా, పైకి మాత్రం అంతా బాగుందనే అంటారు.  మన తిక్కోడికి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటే కదా.  ఇంకా నయం.  గాంధీ కంటే గాడ్సే గొప్ప వాడనీ, గాంధీని  చంపి అతను చాలా మంచి పని చేశాడనీ చెప్పే  ఖాకీ  నిక్కర్ బ్యాచ్ వాల్లు  కూడా దేశంలో చాలా మంది ఉన్నారు.    మన తిక్కోడు అలాంటి వారితో మాట్లాడి  మన జాతిపిత గాంధీ కాదు, గాడ్సే  అనే స్టేట్మెంటు ఇచ్చేయలేదు.
ఇట్టాంటి దేడ్ దిమాఖ్ గాడి సినిమా టిక్కెట్లకోసం ఎగబడిన నా గత చరిత్ర మీద నాకే కంపరం పుడుతుంది.
అప్పట్లో వీల్ల అన్న పార్టీ పెట్టాడు, అది ఓట్ల  చీలికకు దారితీసి యై.యస్.ఆర్ కి ఉపయోగపడింది.
ఆ పార్టీని తీసుకెల్లి కాంగ్రెస్ లో కలిపాడు, అది  జగన్ దెబ్బకు పడిపోతున్న ప్రభుత్వాన్ని కాపాడు కోవడానికి సోనియాకు ఉపయోగపడింది.
ఇప్పుడు  ఈ మేధావి పెట్టిన పార్టీ ఎవరి ఉపయోగం కోసమో  తెలుస్తూనే ఉంది.  అందుకే వీల్ల ఇంటి పేరు 'కొనిదెల ' కాకుండా 'కరివేపాకు ' అని ఉంటే బాగా సూటవుద్దేమో అనిపిస్తుంది.