'దేశభక్తి ' బాగా పరిచయం ఉన్నపేరులాగే అనిపిస్తుంది. మీకు దేశభక్తి ఉందా..? అని ఎవరైనా అడగ్గానే, 'ఉంది ' అని ఏమాత్రం ఆలస్యం లేకుండా చేప్పేస్తాం. ఉంటే చూపించండి అనిగానీ, ఎంత ఉందో చెప్పండి అనిగానీ అడిగారంటే మాత్రం, ఏం చెప్పాలో తెలీక, అడిగిన వాన్ని ఓ వింత చూపు చూస్తాం.బ్రిటిష్ వాల్లు ఇండియాలో ఉండే టైంలో, వారి మీద దాడి చేసి అల్లూరి సీతారామరాజు,భగత్ సింగ్ లాంటివారు.. వారిని ఎదిరించి, వారికి సహాయనిరాకరణ చేసి గాంధి,నెహ్రూ లాంటి వారు తమ దేశభక్తిని చాటుకున్నారట.
వారి హీరోచిత కథల్ని,గాధల్ని చిన్నప్పుడు స్కూల్లో, ఆగస్ట్15, జనవరి26 నాడు టీచర్ల ఉపన్యాసాల సందర్భంగా వినటం వల్లా, దేశభక్తిపూరిత సినిమాల్ని,పాటల్ని బాగా చూసివుండటం వల్లా, దేశభక్తి అంటే,అదేదో తప్పక ఉండాల్సిన విషయమనీ, మన చుట్టూ ఉన్నోల్లందరూ అది తమకు బోలెండంత ఉంది అన్నట్లుగా ధీమాగా ఉండటం వల్ల, అది మనకు కూడా ఉండే ఉంటుందిలే అనీ డిసైడ్ అయిపోతాం. దేశభక్తి ఉందా లేదా అనే విషయంలో ఎవరికీ అణుమానాలు లేవు కానీ, దేశభక్తిని వ్యక్తపరచటం ఎలాగా..? దేశాన్ని ప్రేమించటం అంటే ఏంటి..? అనే దాంట్లో మాత్రం మనలో చాలా మందికి స్పష్టత ఉన్నట్లు లేదు.స్పష్టత లేనంత మాత్రాన, లోపలున్న ఎమోషన్ సైలెంట్ గా ఉండనీదు కాబట్టి, మనకు ఈజీగా అనిపించిన కొన్ని యాక్టివిటీస్ తో మన దేశభక్తిని బయటపెట్టుకుంటుంటాం.
ఇండియా ఆడే అన్ని క్రికెట్ మ్యాచులూ చూస్తూ, ఇండియా గెలుస్తుందా లేదా అని తెగ టెన్షన్ పడిపోతూ, గెలిస్తే సంతోషించి, ఒకవేళ ఓడిపోతే బాధ పడిపోయి, దేశం పట్ల తమ ప్రేమను చూపిస్తున్నామనుకుంటారు కొందరు. దేశభక్తి ఉందని నిరూపించుకోవాలంటే వందేమాతరం పాడాల్సిందేనని వాదించటం, ఒక వైపు మనభారతీయుడు USలో ఒక స్టేట్ కి గరర్నర్ గా నియమితులయ్యారని చంకలు గుద్దుకుంటూనే, మరోవైపు విదేశీయురాలైన సోనియాగాంధీ మన దేశంలో పెత్తనం చెలాయించటం ఏమిటని ఆక్రోశించటం,అవకాశం దొరికినప్పుడల్లా, అవినీతి,స్వార్థం,కుల,మత రాజకీయాల గురించి ఆవేశంగా లెక్చర్ దంచేసి,దేశం నాశనమై పోయిందని డిక్లేర్ చేసేయడం.. ఇలాంటివి తమకు దేశభక్తి మెండుగా ఉందనుకునేవారు చేస్తున్న కొన్ని యాక్టివిటీస్.
నిజానికి, ఇవన్నీ దేశభక్తి అవునో కాదో చెప్పలేం కానీ,ఇవి చేయడం వలన దేశానికి ఉపయోగం కానీ, చేయక పోవడం వలన దేశానికి వచ్చే నష్టం కానీ ఏమాత్రం లేదనేది నిస్సందేహంగా నిజం.మరో ముఖ్య విషయమేమిటంటే,ఇలాంటి 'ఈజీ దేశభక్తి' ని ప్రదర్శిస్తున్న వారిలో బాగా చదువుకున్నవారే ఎక్కువగా ఉండటం. 'ఆంగ్లేయులు' అనే ఉమ్మడి శత్రువు దేశం నుండి వెల్లిపోయిన తర్వాత, దేశభక్తిని,దేశంపై ప్రేమను నిర్మాణాత్మకంగా ఎలా ప్రకటించవచ్చో దేశ యువతకు అర్థమయ్యేలా చెప్పకపోవడం మన విద్యా వ్యవస్థ వైఫల్యంగా చెప్పుకోవచ్చు.
స్వతంత్ర్యమంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉండటం కాదు!!!
1947 ఆగస్ట్15న మనకు స్వతంత్ర్యం వచ్చిందని,1950 జనవరి 26 నుండి మన రాజ్యాంగం అమలులోకి వచ్చిందనీ మనందరికి తెలుసు.స్వతంత్ర్యమంటే ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉండటం కాదు. ఓ సామాజిక ఒప్పందానికి లోబడి అందరూ ఉండటం. ఆ ఒప్పందాన్నే 'రాజ్యాంగం' అంటున్నాం.కుల,మత,ప్రాంత వివక్షలు లేకుండా దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు అనే సమున్నత ఆశయాలతో అంబేద్కర్ గారి అధ్యక్షతన రూపుదిద్దుకున్నదే మన రాజ్యాంగం.(అందరూ సమానమే అయినప్పుడు, వెనుకబడిన వర్గాలకు,మహిళలకు రిజర్వేషన్లు,ప్రత్యేక చట్టాలు ఎందుకని అమాయకంగా అడిగేవారూ, వేరే దేశాల్లో మైనారిటీలకు లేని రక్షణ మన దేశంలోనే ఎందుకుండాలని అడ్డగోలుగా వాదించే 'సర్టిఫైడ్' దేశభక్తులూ, ఈమధ్య ఎక్కువవుతున్నారు. ఈ టాపిక్ గురించి మరో సారి వివరంగా రాస్తా.) రాజ్యాంగానికి లోబడి జీవించడం, దేశభక్తి కలిగిన పౌరుల కనీస కర్తవ్యం.అలా అని బైబిల్,ఖురాన్,భగవద్గీతల లాగా రాజ్యాంగంలో ఉన్నదాన్ని గుడ్డిగా ఆచరించాలని లేదు.రాజ్యాంగ సవరణ అనేది మన రాజ్యాంగానికున్న గొప్ప లక్షణాల్లో ఒకటి. మెజారిటీ(2/3) సభ్యుల అంగీకారంతో రాజ్యాంగంలోని ఏ విషయాన్నైనా మార్చటానికి అవకాశం ఉంది.దీని ప్రకారం, రాజ్యాంగంలో మనకు ఏదైనా నచ్చకపోతే దానిని మెజారిటీ ప్రజలకు అర్థమయ్యేలా వివరించి, MPలపై ఒత్తిడి తీసుకువచ్చి పార్లమెంట్ ద్వారా దానిని సవరించుకోవచ్చు. ఈ మొత్తం వ్యవహారం ఓపిక, సహనం, సమ్యమనంతో రాజ్యాంగ బద్ధంగానే సాధించుకునే అవకాశం ఉంది.ఉదాహరణకి, పబ్స్, నైట్ క్లబ్స్ లాంటివి మన సంస్కృతికి వ్యతిరేకమని కొంతమందికి అనిపించవచ్చు. ఎందుకు వ్యతిరేకమో,వాటివల్ల కలిగే నష్టాలేమిటో ప్రజలందరికి వివరించి మెజారిటీ ప్రజలు కూడా దానికి సమ్మతిస్తే పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవ దీసి,చర్చించి దేశవ్యాప్తంగా వీటిని నిషేదించే వీలుంది. కానీ ఇది ఒక్కరోజులో జరిగేది కాదు.దానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఎందుకంటే మంచి మార్పు తేవడానికి, నిజాయితీ,సహనం చాలా అవసరం. ఇవేవీ లేని ప్రభుద్ధులు, పబ్బుల మీద దాడి చేసి హంగామా సృష్ఠిస్తారు. అదే మంటే, ఈ దేశం మీద మీకంటే మాకు ప్రేమ ఎక్కువ కాబట్టి ఇలా చేశామంటారు. వీరికి, 'దేశాన్ని ప్రేమించడం అంటే, కొన్ని మతాల్ని,సంస్కృతుల్ని ద్వేషించడమే' అనుకునే కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలూ,చదువుకున్న కొందరు నిరక్షరాస్యులూ, మద్దతు కూడా తెలుపుతారు.దేశానికి గుండెకాయలాంటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, మా అంత దేశభక్తులు లేరని బీరాలు పలుకుతుంటారు.ఇక ప్రస్తుతం, రాష్ట్రంలో జరుగుతున్న, విభజన,సమైక్య ఉద్యమాలలో కూడా, యదేచ్చగా రాజ్యాంగనోల్లంఘన ప్రతినిత్యం జరుగుతూనే ఉంది.తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని రాజ్యాంగ బద్ధంగా ఉద్యమించే హక్కు, అది సాధించుకునే అవకాశం రాజ్యాంగం ఇచ్చింది.దానిని అపహాస్యం చేసే హక్కు ఎవరికీ లేదు.కానీ విభజన ఉద్యమమైనా,సమైక్య ఉద్యమమైనా, మరేదైనా ఉద్యమమైనా.. రాజ్యాంగానికి లోబడే ఉండాలి. అస్తమానం బందులు, రాస్తారోకోలు, బస్సుదహనాలూ,షాపుల అద్దాలు పగలగొట్టడం పైగా వీటన్నిటికీ జవాబుదారీతనం లేకుండా కేసులు ఎత్తివేయాలని మల్లీ డిమాండ్ చేయడం.. ఇవన్నీ రాజ్యాంగాన్ని పరిహసించటం కాదా అంటే, అవతలి వాల్లు కూడా చేస్తున్నారు కదా అంటూ సమర్థించుకోవటం.ఈ రకంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడంలో ఒకరితో ఒకరు నిత్యం పోటీ పడుతున్నారు.స్వాతంత్ర్యం వచ్చిన ఈ 60సంవత్సరాల్లో, కులాల,మతాల,ప్రాంతాల వారీగా ఆలోచించడంలో బాగానే అభివృద్ధి చెందాం. అవసరమైనప్పుడు రాజ్యాంగ హక్కుల గురించి ఉద్యమిచడంపై ఉన్న శ్రద్ధ, రాజ్యాంగ విధుల గురించి మాట్లాడటంపై మాత్రం లేకపోవడం శోచనీయం.రాజ్యాంగ హక్కుల గురించి ఉద్యమించినట్లుగానే, రాజ్యాంగ బాధ్యతలపై ఉద్యమించిననాడు,మన కులం వారికి,మన మతంవారికి,మన ప్రాంతంవారికి ఉన్నట్లుగానే, ఎదుటి కులంవారికీ,ఎదుటి మతం వారికీ,ఎదుటి ప్రాంతం వారికీ కూడా రాజ్యాంగ పరమైన హక్కులు ఉంటాయని గుర్తించి వాటిని గౌరవించడం నేర్చుకున్న నాడు, భారత దేశానికి ప్రపంచంలో ఎదురు ఉండదు. అలాంటి రోజులు త్వరలో రావాలని కోరుకుందాం.
రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో.. జై హింద్!!

Very thought provoking..
ReplyDeleteThanks
Nicely written !
ReplyDelete'దేశాన్ని ప్రేమించడం అంటే, కొన్ని మతాల్ని,సంస్కృతుల్ని ద్వేషించడమే' అనుకునే కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలూ,చదువుకున్న కొందరు నిరక్షరాస్యులూ, .. :)
ReplyDeleteExcellent analysis and Nicely written.
Happy Republic Day.
Sai Said:
ReplyDeletemy sincere advice, do journalism.
Very well written.
Happy Republic day.
well said
ReplyDeleteచీకటిగారు, వీలైతే బ్లాగ్ ఫాంట్ కలర్‌ను మార్చగలరా...bright కలర్స్‌తో చదవడానికి ఇబ్బందిగా ఉంది
ReplyDeleteNagarjuna gaaru,
ReplyDeleteThanks for the comment. తప్పకుండా, సెట్టింగ్స్ మార్చడానికి ప్రయత్నిస్తా.. Thanks
"తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని రాజ్యాంగ బద్ధంగా ఉద్యమించే హక్కు, అది సాధించుకునే అవకాశం రాజ్యాంగం ఇచ్చింది.దానిని అపహాస్యం చేసే హక్కు ఎవరికీ లేదు." ..
ReplyDeleteతెలంగాణా గురించి ఇన్నాల్లూ తమరు రాసింది ఏమిటో? నీతి సూత్రాలు వేరే వారికి చెప్పడమేనా..? మీరు పాటించరా..?
అయ్యా అనానిమస్సూ.. నేను ఇన్నాల్లూ రాసింది తెలంగాణా నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాల గురించే కానీ, తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎక్కడా రాయలేదు. కావాలంటే నా పాత పోస్ట్ లన్నీ ఓ సారి తిరగేసుకోండి.
ReplyDelete“అభివృద్ధి,దోపిడీ వంటి విషయాల్లో తెలంగాణా వాదుల ఆరోపణలు నిజమని శ్రీక్రిష్ణ కమిటీ నిర్ధారిస్తే,, తెలంగాణాని,హైదరాబాద్ ని తెలంగాణా వారికి వదిలేసి, ఇంతకాలం తెలంగాణా వారికి జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరి, సీమాంధ్రా వాల్లు తెలంగాణా నుండి తప్పుకోవడం ఉత్తమం. ఆ రకంగా 'జై తెలంగాణా ' అంటూ నేను మొదటి పోస్ట్ నా బ్లాగ్ లో పబ్లిష్ చేస్తా.”
-అంటూ, శ్రీక్రిష్ణ కమిటీ నివేదిక బయటికి రాకముందు నేను రాసిఉన్నాను. కావాలంటే , ఇక్కడ ఓ లుక్కేయండి.
http://andamainacheekati.blogspot.com/2011/01/blog-post.html
Sravya,Sooraj,Nagarjuna and other Anonymous readers: Thanks for the comments.
ReplyDelete'దేశాన్ని ప్రేమించడం అంటే, కొన్ని మతాల్ని,సంస్కృతుల్ని ద్వేషించడమే' ..అవునండి RSS శాఖలలో ఇలాంటివే ఇంచుమించు చెప్తుంటారు....కాని మీ పోస్ట్ లో కొన్ని విషయాలతో నేను ఏకీభవించలేను...
ReplyDelete1. సోనియా గాంధీ మీద...ఆవిడ రాజకీయాలలోకి వచ్చి రాగానే ప్రధాన మంత్రి అవుతాను అంటే ప్రజలకి నచ్చలేదు...10 జనపథ్ లో కూర్చొంటే భారతదేశం అంటే ఏంటో అర్థం కాదు...ఆవిడ ఒక 6 leka 7 పర్యాయాలు MP గా ఉంది...అప్పుడు తను ప్రధాన మంత్రి అవుతా అన్నా మనకి ఇంత చిరాగ్గా ఉండదు....పుట్టుక ప్రధానం కాదండి...భారతదేశం మీద ఎంత అవగాహన ఉందొ తెలియాలి...మదర్ తెరెసా పుట్టుకతో భారతీయురాలు కాదు...కానీ ఆవిడని మనం భారతీయులుగానే గౌరవిస్తాం...భారత రత్న కూడా ఇచ్చాం...
2. 2/3 of total MP'S ఒప్పుకున్నా మన రాజ్యాంగం లో "basic features" మార్చడానికి ఉండదు...అంటే మన ఖర్మ కాలి రేపు కాంగ్రెస్ 500 సీట్లు పార్లమెంట్ లో సంపాదించి...భారతదేశం లో ప్రజాస్వామ్యం కాదు, రాచరికం రావాలి...అది కూడా నెహ్రు-గాంధీ కుటుంబీకులే రాజ్యం చెయ్యాలి అని సవరణ తీసుకురావడానికి కుదరదు..అలాగే BJP 500 తో గెలిచి...భారతదేశం ఇకనుంచి హిందూ దేశం అని సవరణ తీసుకురావడానికి కూడా కుదరదు.
3. ప్రజాస్వామ్యం లో ఉండే హక్కుల్లో ఒకటి "right to protest" ..రాజ్యాంగం పేరుతొ ప్రభుత్వం నాతాకాలు ఆడకుండా ఉండటానికి ఉన్నదే ఈ హక్కు...అసలు రాజ్యాంగం ప్రకారం భారతదేశాన్ని భాషా ప్రాధాన్యం మీద రాష్ట్రాలుగా విభాజించాకూడదు...కానీ ప్రజలకి అది నచ్చలేదు...ముందు మాములుగానే ఉద్యమం సాగింది...తర్వాతే తీవ్రరూపం దాల్చింది...ప్రత్యేక రాష్ట్రము కోరడం రాజ్యాంగ విరుద్దం కూడా కాదు..జార్ఖండ్ కి రాష్ట్రము ఇచ్చినపుడు తెలంగాణా కి ఎమోచ్చోంది ఇవ్వడానికి...తెలంగాణా ఉద్యమం కూడా ఇప్పుడు మొదలయింది కాదు...గత పది సంవత్సరాలుగా సాగుతూనే ఉంది..ఉద్యమం తీవ్రరూపం దాలిస్తే తప్ప ప్రభుత్వం స్పందించాడు అంటే...తీవ్రరూప్రం దాల్చాల్సిందే...
కేసులు ఎత్తివేయడం మీద నేను మీతో కొంత అంగీకరిస్తాను...ర్యాలీలలో పాల్గొన్న వారి మీద కేసులు అనవసరం...రక్తపాతం సృష్టించిన వారి మీద అవసరం...ఆ కేసులు కూడా ప్రత్యేక తెలంగాణా వచ్చిన తర్వాత ఎత్తేస్తే ఇంకా బాగుండేది...
జై తెలంగాణా .
@Sanju:
ReplyDeleteThanks for the comment.
మీ వ్యాఖ్యలో పెద్దగా విభేధించల్సిన అంశాలు లేవనుకుంటున్నాను.
1. సోనియాగాంధీ గురించి:
'ఈజీ దేశభక్తి 'కి ఎగ్జాంపుల్స్ ఇచ్చేక్రమంలోనే ఆమె పేరును వాడాను తప్ప, నేను ఆమె అభిమానిని కాను,కాంగ్రెస్ వాదినీ కాను.
“పుట్టుక ప్రధానం కాదండి...భారతదేశం మీద ఎంత అవగాహన ఉందొ తెలియాలి”
ఆమెకి బారతదేశం మీద అవగాహన లేదు(???) కాబట్టి, ఆమెని వ్యతిరేకిస్తున్నాం అనేవారిని ఎవరూ తప్పుపట్టలేరు. మరి మిగతా PM అబ్యర్థులకి అవగాహన ఉందా..? ఉందని ఎవరు నిర్థారించారు? ఆమెకి అవగాహన లేదు కాబట్టి, ఆమె పార్టీకి ఓట్లు వేయొద్దని ఎన్నికలప్పుడు ప్రచారం చేసుకోవచ్చు. ప్రజలు కూడా దానికి సరే నంటే ఆమె పార్టీ తరపున మెజారిటీ MPలు గెలవరు, అప్పుడు ఈ చర్చే ఉండదు.
2.“2/3 of total MP'S ఒప్పుకున్నా మన రాజ్యాంగం లో "basic features" మార్చడానికి ఉండదు...”
నిజమే, ఇది కూడా మన రాజ్యాంగ గొప్పలక్షణాల్లో ఒకటి. ఎందుకనేదానికి మీరిచ్చిన రెండు ఎగ్జాంపుల్సే గొప్ప ఉదాహరణ.
3.బస్సు దహనాలు, షాపులపై దాడులు, నాయకుల ఇల్లు ముట్టడి.. ఇలాంటివి Right to protest కిందికి రావనుకుంటాను. మన వాదన నెగ్గడం లేదంటే దానికి ప్రతిగా అవతలి వారు వినిపిస్తున్న వాదనలో కూడా విషయం ఉంది, అని ఆలోచించకుండా, నా వాదన ఒప్పుకోవడంలేదు కాబట్టి, నేను తీవ్రరూపం దాల్చడం కరెక్టే అనటం ఎంత సబబో మీరే ఆలోచించండి.
కేసుల మీద మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా.
Thanks.
జై తెలంగాణా!
జై ఆంధ్రా!
జై రాయలసీమ!
జై భారత్!
తెలంగాణ రామాయణంలో ఆంధ్రోళ్ళు రాక్షస సంతతి అని తెలుసా? ఎవలు చెప్పిన్రు అంటర? ముక్కోడి తాత, ముత్తాతలు శ్రీకాకుళంలో రాక్షసులుగా వుండేవాళ్ళట, ఈయన కరీం నగర్ కొచ్చాక దేవుడు అయ్యిండు.
ReplyDeleteamazing writing n analysis skills...nuvvu nivuru gappina nippu...keep it up.
ReplyDeleteగల్ఫ్ దేశాల్లో భారతీయుల అగచాట్లు,ఆస్ట్రేలియాలో భారతీయులకు అవమానం,అమెరికా గురుద్వారాలో కాల్పులు లాంటి బాధాకరమైన వార్తల నేపధ్యంలో ఒకసారి ఆలోచిద్దాం;
ReplyDelete“కొంతమంది ఎక్కువ జీతం వస్తుందని విదేశాలకు వెళుతున్నారు.అక్కడ నెలకు ఐదు వేల డాలర్లు సంపాదించవచ్చు.ఇండియన్ కరెన్సీ తో పోల్చుకుంటే అది ఎన్నో లక్షలౌతుంది .కానీ అక్కడ ఆ దేశానికి ఎంత ఆదాయమో ఇక్కడ ఈ దేశానికి అంత నష్టం.అక్కడ అయిదు వేల డాలర్లు సంపాదించే బదులు ఇక్కడ ఐదు నూర్లు సంపాదించినా చాలు మనకు.ఈ సత్యాన్ని గుర్తుంచుకొనలేక అనేకమంది అనేక రకములైన ఆశలు పెంచుకొని విదేశాలకు పోతున్నారు.కానీ ఎబ్రాడ్ లో ఏముంది?బ్రాడ్ నెస్ (విశాల భావం) మీలోనే ఉంది.దానిని వదిలి పెట్టి మీరు అబ్రాడ్ పోవటం చాలా పొరపాటు.మీరు విదేశాలకు పోనక్కరలేదు.ఇక్కడే ఉండి మీ తల్లి దండ్రులను సేవించండి. భారతీయ సంస్కృతిని మీ బిడ్డలకు నేర్పండి “అని సత్య సాయి చెప్పాడు.15.1.2008.(సనాతన సారధి మార్చి 2008)
ఇప్పుడు 32 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఊడిగం చేస్తున్నారు.మిగతా దేశాల్లో ఇంకెంతమంది ఉన్నారో! అవకాశం వస్తే విదేశాలకు ఉరకాలని లక్షల మంది కాచుకొని ఉన్నారు.వీళ్ళంతా మన దేశంలోనే ఉండి మన ప్రజలకే సేవ చేసే పరిస్థితి మన ప్రభుత్వం,మన పారిశ్రామిక వేత్తలూ కల్పిస్తే విదేశాల తలదన్నేలా మన దేశం అభివృద్ధి చెందదా?మన మాతృభాషలు ఇలా మరణ శయ్యమీదకు చేరుతాయా? అన్ని భాషలూ ఇంగ్లీషు దెబ్బకు చచ్చి పోతున్నాయి. భారతీయ సోదరులారా, ఎన్నో శతాబ్ధాల పాటు నిర్మించుకున్న మన సాహిత్యం ,దేశీయ జన విజ్నానం మట్టిపాలు కానీయవద్దు.మీ దేశ భక్తి ,భాషాభిమాన కబుర్లు ఆపి ఈ ఒక్క సాయి సలహా పాటించండి చాలు. పదేళ్ళలో మళ్ళీ మన భాషలు ప్రాణం పోసుకొని తిరిగి జనశక్తితో తప్పక లేస్తాయి. మన భాషలు బ్రతకాలంటే ఇలా చెయ్యక తప్పదు.
‘మాతృభాషను మాతృభూమినీ దేశ పౌరుల్నీ ప్రేమించటమే నిజమైన దేశభక్తి ‘ విదేశాలలో మన దేశ ఘన కీర్తులు చాటుతున్న భారతీయ వీరులారా లేవండి.పల్లవి మార్చండి.మాతృదేశమే మాకు అమర దైవతము అనండి.భారతీయత లేని బ్రతుకును ఆశించకండి.భరత గడ్డమీదకు తరలి రండి.మనదేశ ప్రజలకే సేవ చెయ్యండి.