Saturday, January 21, 2012

లోకాయుక్త పై సుప్రీం కి మోడీ: అసలు లక్ష్యం వేరే!!!


లోకాయుక్త – రాష్ట్ర పరిథిలో ప్రభుత్వ నిర్ణయాలు, వివిధ శాఖల కార్యకలాపాలపై డేగ కన్నేసి ఉంచి అవినీతిని అరికట్టడానికి ప్రయత్నించే ఓ రాజ్యాంగ బద్ధ పదవి. సహజంగా లోకాయుక్తలుగా రిటైర్డ్ న్యాయమూర్తుల్నే నియమిస్తారు. వారు అప్పటికే రిటైరైపోయి ఉంటారు కాబట్టి, పెద్దగా రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి పోకుండా ఏదో తూతూ మంత్రంగా అవినీతిపై సాంవత్సరిక రిపోర్టులు సమర్పించేసి మమ అనిపిస్తుంటారు.  కానీ నిజాయితీ నిబద్ధత, అవినీతి భరతం పట్టాలనే కసి ఉన్న వ్యక్తి లోకాయుక్త గా నియమించబడితే దాని ప్రభావం ఎంతగా ఉంటుంది అనేదానికి, ఇటీవలే కర్ణాటక లోకాయుక్తగా పని చేసిన జస్టిస్ సంతోష్ హెగ్డే ఓ చక్కని ఉదాహరణ. అవినీతి వ్యవహారంలో ఇతను సమర్పించిన పరిశోధనాత్మక రిపోర్టులే యెడ్యూరప్పను పదవీచ్యుతున్ని చేశాయి.

ఇక గుజరాత్ విషయానికి వస్తే,  మన మోడీ ఎంతైనా మహా తెలివి పరుడుకదా,  యెడ్యూరప్పకి వచ్చిన సమస్య లాంటిదాన్ని ముందే ఊహించి, ఎందుకొచ్చిన గొడవ అనుకున్నడేమో కానీ..  గుజరాత్లో 2002లో ఖాలీ అయిన లోకాయుక్త స్థానాన్ని తిరిగి భర్తీ చేయకుండా ఇప్పటి వరకూ అలాగే ఉంచేశాడు. ఇటీవల గుజరాత్ గవర్నర్ గా నియమితులైన కమలా బెనివాల్  లోకాయుక్త పదవిని భర్తీ  చేయడానికి తగిన వ్యక్తిని సూచించవలసిందిగా గుజరాత్ హైకోర్టుని పురమాయించింది. అందుబాటులో ఉన్న రిటైర్డ్ న్యాయమూర్తులనుండి ఒకరిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపిక చేసి, రాష్ట్రప్రభుత్వ సలహా కోసం పంపారు. మన మోడీ గారు, ఆ న్యాయమూర్తిని కాదని తనకి అనుకూలంగా ఉన్న మరో న్యాయమూర్తి పేరును సూచిస్తూ  ప్రధాన  న్యాయమూర్తి ప్రతిపాదనని పునహ్ పరిశీలించ వలసిందిగా కోరారు.  HCJ  మల్లీ అదే పేరును పంపడం, మోడీ మల్లీ తిరస్కరించడం జరిగిపోయాయి. విషయం ఇలా నానుతుండగానే, రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో సంబంధం లేకుండా HCJ చెప్పిన వ్యక్తిని  లోకాయుక్తాగా నియమించాలని గవర్నర్ ఆలోచిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. వెంటనే అలెర్ట్ ఐన మన మోడీ,  లోకాయుక్తని నియమించే అధికారం గవర్నర్ కి లేకుండా చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేయాలనే ప్రతిపాదనను తెరమీదికి తెచ్చాడు. ఆదే రోజు  HCJ  ప్రతిపాదించిన వ్యక్తిని లోకాయుక్తాగా నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.   రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం లేకుండా గవర్నర్ చేసిన ఈ నియామకం చెల్లదని మోడీ ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసింది. మొదట ఇద్దరు జడ్జిలు గల కమిటీ దీనిని విచారించి, ఒక జడ్జి గవర్నర్ నిర్నయాన్ని సమర్థించగా, మరో జడ్జి గవర్నర్ కి ఆ అధికారం లేదని పరస్పర విరుద్ధ తీర్పు లిచ్చారు. ఇలాంటి పరిస్తితుల్లో మూడో జడ్జి నిర్ణయం అవసరం కాబట్టి,  HCJ దీనిని పరిశీలించి గవర్నర్ కి అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. ఫైగా  HCJ  సూచించిన వ్యక్తిని  లోకాయుక్తగా నియమించకుండా ఇలా ‘మినీ రాజ్యాంగ సంక్షోభం’ సృష్టించడానికి ప్రయత్నించాడని మొడీని తీవ్రంగా దుయ్యబట్టారు.  


మరో రాష్ట్ర CM ఐతే , ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి,లోకాయుక్తగా కోర్టు చెప్పిన వారిని నియమించి సైలెంటైపోయేవారు. కానీ మన మోడీ తేడా కదా.. పైగా కోర్టులతో తిట్టించుకోవడమంటే మహా  సరదా.. కాబట్టి  హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి వెల్లాడు.  ఇక్కడ సుప్రీం  కోర్టు  తీర్పు , దాని పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం.


కేస్ 1:  హైకోర్టు వాదనతో వ్యతిరేకిస్తే..

ఇది మోడీ కి గొప్ప శుభవార్తే అవుతుంది. సుప్రీం కోర్టు ఆరు కోట్ల గుజరాతీయుల్ని బలపరచింది అని,"ఆరు కోట్ల గుజరాతీల తరుపున సుప్రీం కోర్టుకి ధన్యవాదాలు" అనీ   మోడీ అలవాటైన స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడు.  ఆపైన తనకు కావలసిన  వారిని లోకాయుక్తగా నియమించుకుని, తనకు కావలసిన విధంగా అతని నుండి రిపోర్టులు రాయించుకుంటూ.. గుజరాత్ వెలిగి పోతుందని చాటింపు వేయించుకోవచ్చు.కానీ తీర్పు ఇలా రావడానికి అవకాశం చాలా తక్కువ.


కేస్2: హైకోర్టు వాదనతో ఏకీభవిస్తే.. 

‘మోడీకి మరో ఎదురు దెబ్బ’అని పత్రికలు వార్తలు రాసుకుంటాయి. మోడీకి ఇదీ అలవాటే కాబట్టి దులిపేసుకుని లైట్  తీసుకుంటాడు. లోకాయుక్తగా HCJ చెప్పిన వ్యక్తిని  అంగీకరించడం మినహా మరో గత్యంతరం ఉండదు.కాకపోతే.. లోకాయుక్త మాకు వ్యతిరేకంగా రిపోర్టులు ఇస్తాడేమోననే సందేహాన్ని సుప్రీం కోర్టు సాక్షిగా వ్యక్తపరచే అవకాశం లభిస్తుంది. ఒకవేళ ఆ కొత్త లోకాయుక్త గత  10ఏళ్ళ కాలంలోని స్కాములు ఏవైనా వెలికి తీస్తే.. మన మోడీ గారు మరియూ వారి భజనపరులైన అరున్ జైట్లీ లాంటి వారు.. ఏమాత్రం  కంగారు పడకుండా.. T.V గొట్టాలముందుకు వచ్చి, లోకాయుక్త కాంగ్రెసు మనిషని,  సోనియా గాంధీ దగ్గరుండి ఆ రిపోర్టు రాయించారనీ..అందుకే తాము ముందు నుండీ   లోకాయుక్త నియామకాన్నివ్యతిరేకిస్తున్నామనీ.. తాము భయపడిందే జరిగిందనీ..పైపెచ్చు.. కేంద్రంలోని సోనియా గాంధీ ఈ విధంగా 6 కోట్ల గుజరాత్ ప్రజల్ని అవమానిస్తున్నారని, దానినుండి కూడా ఓట్లు రాబట్టడానికి ప్రయత్నించవచ్చు.


ఈ రకంగా సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. దానిని అనుకూలంగా మార్చుకునే చావు తెలివితేటలు మోడీకి చాలానే ఉన్నాయి.ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిసి కూడా సుప్రీంకోర్టు గడప తొక్కడంలో ఆంతర్యం అదే.. 


ఇక ఈ మొత్తం వ్యవహారంతో మరో సారి స్పష్టంగా నిరూపితమైంది ఏదైనా ఉందంటే అది, 'అవినీతి పై అన్నాకు మద్ధతు' పేరుతో BJP సాగిస్తున్న కపట నాటకం. ఒక వైపు కేంద్రంలో బలమైన లోక్ పాల్ ని తేవాలని అన్నాతో కలిసి ఆందోళనలు చేస్తూ మరో వైపు తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లోకాయుక్తని గత 10ఏళ్ళుగా నియమించలేదంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలి..?  

Wednesday, January 11, 2012

ఆ పాడు పని చేసింది వాల్లే..(ఇలాంటి వార్తలు తెలుగు పేపర్లలో రావు. )

The Hindu : News / National : Pakistani flag hoisting was a Hindutva plot to foment strife, police say

హిందూ పత్రికలో ఈ రోజు వచ్చిన పై వార్తను చదవండి.
వారికి బాగా అలవాటైన, 'విభజించు పాలించు ' అనే సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఈ సారి కాలం కలిసివచ్చినట్లు లేదు. తీరా వీరి కుటిల బుద్ధి బహిర్గతమయ్యాక నేరం మాది కాదంటే మాది కాదని ఒకరిపై ఒకరు వేలెత్తి చూపించుకుంటున్నారు. శ్రీ రాంసేన, భజరంగ్ దల్, RSS.... పేర్లు వేరైనా అందరి వ్యూహం ఒకటే. మైనారిటీలను మెజారిటీ మతస్తుల నుండి వేరు చేయడం, మైనారిటీలను వారికి బూచిగా చూపి, హిందువులను ఉద్ధరించేది తామేనని నమ్మబలికి వారి ఓట్లను కొల్లగొట్టడం. ఇదే వీరి అజెండా.. బ్రిటీష్ వాడినుంచి నేర్చుకున్న ఈ సూత్రాన్ని ఇప్పటిదాకా అనేకసార్లు విజయవంతంగా అమలుపరిచారు. కాకపోతే ఈసారి కాలం కలిసి వచ్చినట్లు లేదు పాపం..

సానియా మీర్జా పొట్టి గౌను పై, ఊరూ పేరూ లేని ఓ మారుమూల గ్రామం లోని ముసలి ముల్లా ఎవరైనా ఫత్వా జారీ చేస్తే.. అలాంటి వార్తల్ని ప్రముఖంగా ప్రచురించే మన తెలుగు మీడియా.. మన రాష్ట్రం పక్కనే జరిగిన పై సంఘటన గురించి మాత్రం రాయలేదు. బహుశా మన పాఠకులకు ఇలాంటివి నచ్చవనుకున్నారు కాబోలు. మన తెలుగు మీడియా ఇలాంటి ధోరనిని చూపడం ఇది మొదటిసారి కాదు.
సుమారు రెండేల్ల క్రితం, కర్నాటకలో ఓ హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయితో లేచిపోయిన సంఘటన ఇలాగే మతం రంగు పులుముకొని వివాదాస్పదం అయింది. 'లవ్ జీహాద్ ' పేరుతో ముస్లిం లందరూ కూడబలుక్కొని హిందూ అమ్మాయిల్ని లేవదీసుకు పోయే కార్యక్రమం పెద్ద యెత్తున చేస్తున్నారని, కాబట్టి ముస్లింలను దూరంగా ఉంచాలని శ్రీ రాం సేన, RSS లాంటి సంస్థలు నానా రాద్ధాంతం చేశాయి. పైదా దానికి ఆధారాలంటూ వివిధ 'లేచిపోయిన' లెక్కల్ని కూడా చూపించేవి. దీనిని అప్పట్లో 'ఈనాడు' పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.. వారి కాకి లెక్కల్తో సహా. ఈ వివాదంపై  స్పందించిన కర్నాటక ప్రభుత్వం(BJP), హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణా సంఘాన్ని వేసింది. సుమారు 2 నెలల విచారన అనంతరం 'లవ్ జీహాద్ ' అనేది ఒట్టి పుకారేననీ, ఆ లెక్కలన్నీ కాకి లెక్కలేననీ తేలింది. కానీ విచారణా సంఘం ఫలితాన్ని మాత్రం మన 'ఈనాడు' ప్రచురించలేదు. ఐనా నిరంతరం ఏదో ఒక పార్టీ కొమ్ముకాస్తూ వార్తల్ని రాసే మన పత్రికల నుండి ఇలాంటి విలువల్ని ఆశించడం అత్యాశేనేమో. కాకపోతే.. ఇలాంటి అసత్యాల్ని, అర్థ సత్యాల్ని మాత్రమే చదివి, తమకు మొత్తం తెలుసనుకొని ఫీలైపోయి, మనసు నిండా విద్వేషం నింపుకొని, పైన పేర్కొన్న సంస్థల్ని నికార్సైన దేశభక్త సంస్థలుగా భావిస్తూ, తమను మించిన దేశభక్తులు లేరనే భ్రమల్లో బతుకుతూ.. తమకు నచ్చని విషయాల్ని రాసే వారందరినీ ద్వేశించడమే పనిగా పెట్టుకున్న కొందరు దారి తప్పిన యువకులు కాస్త అప్రమత్తంగా  ఉండాల్సిన అవసరం ఉంది..

ఇక అసలు ట్విస్టు ఏంటంటే.. 'మత పరమైన విభజన'కు ఆదినుండి ఆజ్యం పోసిందీ, దాని నుండి అత్యధిక లబ్ధి పొందిందీ BJP మరియా దాని అనుబంధ సంస్థలే.. కానీ మైనారిటీలకు మేలు చేసే రిజర్వేషన్లు, మత హింసా బిల్లు లాంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడల్లా.. వీరు చేసే మొదటి ఆరోపణ- ఇవి 'మత పరమైన విభజనకు దారితీస్తాయట, కాబట్టి వీరు వాటిని సమర్థించరట.. మంచి జోక్ కదూ..