నేను - సీమ - హైదరాబాదు!!!
మన జిల్లా పేరు ఏమిటి?
కడప జిల్లా.
మన రాష్ట్రం పేరు ఏమిటి?
ఆంధ్ర ప్రదేశ్.
మన రాష్ట్ర రాజధాని ఏది?
హైదరాబాద్.
ఏ క్లాసులో చదివానో గుర్తులేదు కానీ, అలా మా పోరుమామిళ్ళ, ప్రభుత్వ పాఠశాలలోని, పూరి గుడిసెలో మొదటిసారిగా నాకు హైదరాబాదు పరిచయమైంది. 1980 దశకంలో పుట్టి, తెలంగాణా, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, జై ఆంధ్రా ఉద్యమాల గురించి ఏమాత్రం తెలియక, మనది ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ 'మన' రాజధాని అనే ఊహతో పెరిగి పెద్దవాల్లైన అనేక మంది ప్రస్తుత యువకుల్లో నేనూ ఒకడిని.
"ఒరే పిల్లలూ , హైదరాబాద్,- దేశంలోని గొప్ప నగరాల్లో ఒకటి. అక్కడ 400 ఏళ్ళక్రితం నిజాం నవాబులు కట్టించిన, ఎత్తైన చార్మినార్ ఉంటుంది, దాని మీదికి ఎక్కి చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది . నగరం మధ్యలో హుస్సైన్ సాగర్ అనే పేద్ద చెరువు ఉంటుంది. దాని మధ్యలో NTR పెట్టించిన బుద్ధవిగ్రహం ఉంటుంది. అక్కడికి బోటులో వెల్లి రావచ్చు. ఇంకా సాలార్జంగ్ మ్యూజియం , పబ్లిక్ గార్డెన్స్, బిర్లా మందిర్ ఇలాంటివి చాలా ఉన్నై. మనం వచ్చేనెలలో హైదరాబాదుకి ఎస్కర్షన్ కి వెల్తున్నాం. ఒక్కొక్కరు 200 రూపాయలిస్తే ఇవన్నీ చూపిస్తాం. " ఎప్పుడూ చిరాగ్గా మొఖం పెట్టుకుని, ఎవడ్ని ఏ కారణంతో వాయిద్దామా అన్నట్లుండే మా ప్రభుత్వ పాఠశాల లెక్కల మాష్టారు , ఆ రోజు ప్రశాంత వదనంతో హైదరాబాద్ గురించి చెప్తున్న విషయాల్ని మైమరచి వింటున్న నాకు , ఆ చివరిమాట మాత్రం శరాఘాతం లా తగిలింది. 200 రూపాయలు ఎంత పెద్దమొత్తమో తెలీదు కానీ, మా నాన్న ఇవ్వగలిగినంత చిన్నది మాత్రం కాదని తెలిసుండటం వల్ల. అలా హైదరాబాదు మొదటిసారి నన్ను నిరుత్సాహ పర్చింది. తర్వాత 1999 వ సంవత్సరంలో గానీ, నాకు భాగ్యనగరానికి వెల్లే భాగ్యం కలగలేదు- అది కూడా ఎంసెట్ ఇంగినీరింగ్ కౌన్సిలింగ్ కోసం. అక్కడి అభివృద్ధినీ, కాస్మోపాలిటన్ కల్చర్ నీ చూశాక, అక్కడే చదవాలని మనసులో అనిపిస్తున్నా, మా వూరి నుంచి రాను పోనూ చార్జీలు మరియు సిటీ కాస్ట్ ఆఫ్ లివింగ్ లెక్కేసుకున్నాక, మాకు దగ్గర్లోనున్న నెల్లూర్లో ఐతే బాగుంటుందని అక్కడి కాలేజీ సెలెక్ట్ చేసుకున్నాను.
కడప, నెల్లూరు పేరుకు రెండూ జిల్లా కేంద్రాలే, పైగా పక్క పక్కనే ఉంటాయి. కానీ నెల్లూరు అన్ని విధాలుగా కడప కంటే చాలా అభివృద్ధి చెంది ఉంటుంది. నెల్లూర్ లో B.Tech జాయిన్ ఐన కొత్తలో మా కడప విద్యార్థులం ఎప్పుడైనా ఓ చోట గుమికూడితే ఈ విషయం గురించి మాట్లాడుకునే వాల్లం. కోస్తా వాల్లు బిజినెస్ మైండెడ్ అనీ అందుకే వాల్లు బాగా డెవెలప్ అయ్యారనీ, మా సీమ మనుషులు సెంటిమెంట్స్ కే ఎక్కువ విలువనిస్తారనీ, వారికి కపటత్వం తెలీదనీ అందుకే వెనుకబడి ఉన్నారనీ మాకు మేము చెప్పుకుంటూ, కోస్తా వారి మీద వివిధ రకాల జోకులు కూడా వేసుకుని ఆనందిచేవాల్లం. ఇదంతా సరదాకే కానీ, కోస్తాలో సీమ కంటే ముందు జరిగిన విద్యాభివృద్ధీ, అక్కడ బ్రిటీష్ వారికాలంలోనే ఏర్పాటైన రవాణా సౌకర్యాలు, విస్తారమైన, సారవంతమైన భూములు, తీర ప్రాంతం లాంటివి వారి అభివృద్ధికి ప్రధాన కారణాలని మాకు తెలీక కాదు.ఆత్మస్థుతి-పరనిందలో అదోరకం తృప్తి ఉంటుంది కదా.
తర్వాత BTech 3 వ సంవత్సరంలో ఉండగా మా సీనియర్ పెళ్ళికి అదిలాబాద్ వెల్లడం జరిగింది. హైదరాబాద్ దాటి ఇతర తెలంగాణా జిల్లాల్లోకి వెల్లడం అదే మొదటిసారి. అప్పటిదాకా కోస్తాలోని అభివృద్ధితో పోల్చుకుంటూ, మా రాయలసీమ వెనుకబడిందని ఇంఫీరియారిటీలో ఉన్ననాకు, తెలంగాణా సీమకంటే కూడా చాలా వెనుకబడి ఉందని అర్థం ఐంది. అట్లే అక్కడి ప్రజల నిరక్షరాస్యత, వ్యవసాయానికి తగిన నీటిపారుదల వసతులు లేకపోవడం వంటివి ఆ వెనుకబాటుకు కారణాలైఉంటాయని కూడా అనిపించింది.
ఖర్చుకు భయపడి నెల్లూర్ లో జాయిన్ అయ్యాననే గానీ, మనసంతా హైదరాబాద్లోనే ఉండేది. ఎప్పుడెప్పుడు BTech ఐపోతుందా, ఎప్పుడెప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదించి ఆ విశాలమైన రోడ్లపై బైక్ వేసుకుని తిరుగుదామా అనిపించేది. మా ఇంజినీరింగ్ కాలేజ్ లోని అందరు విధ్యార్థుల ఆలోచనలూ దాదాపు హైదరాబాద్ చుట్టూనే తిరుగుతుండేవి, US గురించి ఆలోచించే కొందరు సంపన్నుల బిడ్డలకి తప్ప.
సరిగ్గా అలాంటి సమయంలోనే,KCR తెరాసను స్థాపించారు. తెలంగాణాలోని ఊరూ,వాడా మరియు అక్కడి యూనివర్సిటీలు తిరిగి సీమాంధ్రోల్లు అలాంటివారనీ, ఇలాంటివారనీ, దొంగలనీ, దోపిడీ దారులనీ ఏవేవో లెక్కలు చెబుతూ, వారివల్లనే తెలంగాణా వెనుకబాటుకు గురైందని చెబ్తుండేవాడు . ఆయన మాటలు మా రాయలసీమ విధ్యార్థులం కోస్తా వారిమీద వేసుకునే కుల్లు జోకుల్లానే ఉండేవి. ఓ ప్రాంతం అభివృద్ధికి కావలసిన విద్యావకాశాలు, పారిశ్రామిక, రవాణా, నీటిపారుదల సదుపాయాలు, అవి సమకూర్చుకునే రాజకీయ చైతన్యం లేక ఓ ప్రాంతం వెనుకబడి ఉంటే, దానికి ఇతరప్రాంతం ప్రజలు ఎలా కారణమవుతారో అస్సలు అర్థమయ్యేది కాదు. సీమాంధ్రుల కుట్రలు అంటూ కేసీఅర్ చెప్పే చారిత్రక విషయాలు ఒక్కోసారి సహేతుకంగానే అనిపించినా.. ఆ మరునాడే లగడపాటి, ఉండవల్లి, తలసాని స్రీనివాస్ వంటి వారు ఇచ్చే వివరణలు, కేసీఆర్ పై చేసే ప్రత్యారోపణలతో 'కుట్ర ' కధనాలు నిరాధారమిపించేది. కానీ వీరిలో ఎవరి వెర్షన్ నిజమైనదని తేల్చుకోవడానికి ఆ డాక్యుమెంట్లను, గణాంకాలను తిరగేసేంత ఓపిక, తీరిక ఎవరికీ ఉండేది కాదు.
పైగా సీమాంధ్ర ఉద్దంఢులైన వైయెస్సార్, చంద్రబాబు లాంటి వారు కూడా కేసీఆర్ తో వేదికల్ని పంచుకోవడంతో కేసీఆర్ యొక్క విభజనవాదం అంత ప్రమాదకరమైందిగా ఎప్పుడూ అనిపించలేదు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత కానీ, విభజన వాదం ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందో అర్థం కాలేదు. అప్పటిదాకా మనదనుకున్న 'హైదరాబాద్ ' ఒక్కసారిగా పరాయిదవబోతుందన్న ఊహే చాలా కష్టంగా అనిపించింది. అందుకే ఆ ప్రకటనకి వ్యతిరేకంగా ఉద్యమించిన లగడపాటి, జె.సి దివాకర్ రెడ్డి లాంటి వారిని, ఇతర సమైక్యాంధ్ర విద్యార్థి నాయకుల్ని మనసారా అభినందిచాలనిపించింది. మొత్తానికి డిసెంబర్ 23 ప్రకటన ద్వారా తెలంగాణా ఏర్పాటును విజయవంతంగా అడ్డుకోగలిగారు కానీ, దగా పడ్డామనే భావన తెలంగాణా మిత్రుల్లో మరింత బలంగా నాటుకుపోఇందనే విషయం అక్కడ జరిగిన అసంఖ్యాక విధ్యార్థుల ఆత్మహత్యల ద్వారా స్పష్టమైంది. ఇక అప్పట్నుండి మాకు జరిగిన అన్యాయాలకు ఆధారాలు అంటూ వారి లెక్కల్తో వారు, అవి అన్యాయాలు కాదంటూ వీరి లెక్కల్తో వీరు- ఎవరి లెక్కలు వారివే, ఎవరి వాదనలు వారివే. ఎవరూ ఎవరి వాదనల్నీ వినే పరిస్థితి లేదని తేలిపోఇంది. మీడియాలో, బ్లాగుల్లో, TV స్టూడియోల్లో అన్నిట్లో ఇదే తంతు. అలాంటి పరిస్థితుల్లో మొదట ఎంతో ఆశాజనకంగా కనిపించిన శ్రీక్రిష్ణ కమిటీ కూడా సీమాంధ్ర నేతల విందు రాజకీయాల కారణంగా ఎందుకూ కొరగానిదిగా మిగిలిపొఇంది. తాము కుట్రలకు, దోపిడీకి గురయ్యామనే భావన తెలంగాణా వాదుల మనసుల్లోనుండి పూర్తిగా తీసివేయబడనంతవరకూ, 'కలిసిఉంటే ప్రయోజనాల ' పేరుతో ఎన్ని లాజిక్కులు మాట్లాడినా ఫలితం ఉండదు. అట్లే మేము విడిపోతాము మొర్రో అనే వారితో, కలిసిఉండాల్సిందే అని వాదించడం ఏ ప్రజాస్వామిక చట్టాల ప్రకారం చూసినా విరుద్ధమే. అపోహలూ, అపవాదులూ తొలగిపోకుండా ప్యాకేజీలతో సమస్యను మరికొంత కాలం పాటు కప్పిపుచ్చవచ్చేమో గానీ, ఓ 20 ఏళ్ళతర్వాత మరో నాయకుడు, మరో నినాదంతో ఉద్యమాన్ని తిరిగి తోడడన్న గ్యారెంటీ లేదు. కావున ఈ సమస్యను విభజనతోనే శాశ్వతంగా పరిష్కరించడం అవసరం. కానీ ఆ విభజన ఎలా ఉండాలి అనేది మరో చిక్కు సమస్యగా మారింది. ఈ విషయంలో రాయలసీమ 4 జిల్లాల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. తెలంగాణాతో ఉంటామంటే వారు ఒప్పుకోరు. కోస్తాతో ఉందామంటే, అభివృద్ధిలో ఇప్పటికే ముందంజలో ఉన్న ఆ ప్రాంత ప్రజలతో పోటీపడలేక మరింత వెనుకబాటుకు గురవుతామేమోననే అభద్రతా భావం. పోనీ ప్రత్యేక రాష్ట్రంగా మనగలుగుతామని కనీసం మాకు మేము కూడా గట్టిగా చెప్పుకోలేని పరిస్థితి.కావున గుడ్డిలో మెల్ల లా రాయలసీమను రెండుగా విభజించే 'రాయల తెలంగాణా' ఒక్కటే కాస్త మెరుగైన పరిష్కారంగా తోస్తుంది. దీనితో రాయలసీమ తన అస్తిత్వాన్ని కోల్పోతుందనే వాదనలో వాస్తవమున్నప్పటికీ, మనుగడ సాగించడానికి కావలసిన వనరులు లేనప్పుడు అస్తిత్వం గురించి అదే పనిగా మాట్లాడటం అత్యాశే అవుతుంది.ఇప్పటికే ఎడతెగని ఉద్యమం ఫలితంగా రాష్ట్రం చాలా రకాలుగా నష్టపోతుంది. ఒకప్పుడు ITలో దేశంలో మూడవ స్థానంలో ఉన్న హైదరాబాద్ క్రమంగా కిందికి జారుతుంది. గత కొన్ని సంవత్సరాలలో హైదరాబద్ లో చెప్పుకోదగిన పెద్ద కంపెనీ ఒక్కటీ స్థాపించబడలేదు. మంచి జీతం కావాలంటే చెన్నైకో, బెంగులూరుకో వెల్లక తప్పదనే పరిస్తితి ప్రస్తుతం నెలకొని ఉంది. ఎద్దు పుండు కాకికి ముద్దన్నట్లుగా ఉద్యమం మాటున మతతత్వ వాదులు తమ ప్రాబల్యం పెంచుకుంటూ పోతున్న సూచనలు భీతిగొలుపుతున్నాయి. కావున సమస్య మరింత జటిలమై రాష్ట్రం మరింత సంక్షోభంలోకి నెట్టివేయబడకముందే దీనిని శాశ్వతంగా పరిష్కరించుకోవడం అందరికీ ఉత్తమం.