Monday, November 29, 2010

మరో రాష్ట్రం 'చే 'జారినట్టే!!!

"కాంగ్రెస్ నుండి బయటికి వెల్లిన వారికి మనుగడ లేదు, మల్లీ కాంగ్రెస్ గూటికి చేరాల్సిందే" ఇది ఇప్పుడు కాంగ్రెస్ లోని వృద్ధ జంబూకాల కొత్త పల్లవి. తమ సొంత ఇంట్లోవాల్ల వోట్లు కూడా వేయించుకోలేని ఈ వెధవల విషయంలో అది  నిజమేనేమో కానీ, ప్రజల నాడి పసిగట్టి, దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేసే వారికి ఎప్పటికీ ప్రజల మద్దతు ఉంటుంది. దీనికి మంచి ఉదాహరణ శరద్ పవార్,మమతా బెనర్జీ. వీరిద్దరూ కాంగ్రెస్ లో నుండి బయటికి వచ్చి సొంతకుంపటి పెట్టుకున్నవారే. కానీ ఇప్పుడు వీరితో పొత్తుపెట్టుకుంటే తప్ప కాంగ్రెస్ కి ఆయా రాష్ట్రాల్లో మనుగడలేని పరిస్తితి. ఇక జగన్ కూడా ఈకోవలోకి వస్తాడో,లేదో కాలమే చెప్తుంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేంత బలం సంపాదించుకుంటాడో లేదో కానీ, కాంగ్రెస్ నడ్డి విరగ్గొట్టడానికి కావలసింత ప్రజాబలం, ధనబలమైతే జగన్ దగ్గర పుష్కలంగా ఉన్నట్లుంది. అదే నిజమైతే దక్షినాదిలో,తమదిగా చెప్పుకోవడానికి ఉన్న ఒక్కగానొక్క రాష్ట్రం కూడా ఇక 'చే 'జారినట్లే..

Friday, November 26, 2010

KKR పై రోశయ్య అంతరంగం: కోట(మనీ) స్ట్యైల్లో!



ప్చ్... 14మంథ్స్ బ్యాక్..
సేం స్పీచ్, నేంస్ డిఫరెంట్..
2 డేస్ హ్యాపీ..దెన్ స్టార్టెడ్ స్ట్రగుల్స్,
వై...? ఐ క్వొశెన్.. యు ఆన్సర్..
ఒన్ సైడ్ జగన్,అదర్ సైడ్ కేసీఆర్, బిట్వీన్ జల్,లైలా..
Next song..
భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ, CMగా మారకు పొలిటికల్ లీడరూ..
పవరూ మాటే వద్దు గురూ, గవర్నరు పదవే సోబెటరు...

Saturday, November 20, 2010

జీవన వైవిధ్యం!!!

ఇంట్లో బొచ్చుకుక్క తినుబండారాలకు,
వేల రూపాయలు ఖర్చు పెట్టేవారున్నారు.
నాలుగు రోజులు వర్షంపడి కూలీకి వెల్లలేకపోతే,
ఇంట్లో పిల్లలతో పాటు పస్తులు పడుకునేవారూ ఉన్నారు!
బట్టతలపై వెంట్రుకలు మొలిపించుకోవడానికి,
లక్షల రూపాయలు వెచ్చించే వారున్నారు.
బడికి పంపించే స్థోమత లేక,
పిల్లల్ని, తలపై బుట్టలతో పనికి పంపేవారూ ఉన్నారు!
ముఖంపై ఉన్న మచ్చని రోజూ అద్దంలో చూసుకొని,
అందంగా లేమనుకుని బాధపడేవారున్నారు.
చీకటి తప్ప, అందం ఎలా ఉంటుందో తెలీని
అంధులు కూడా ఉన్నారు!
అన్నీ ఉన్నా కూడా,లేనిదేదో ఉందనుకొని బాధపడేవారు కొందరు.
అంగవైకల్యం ఉన్నా, అది ఆనందానికి వైకల్యం కాదనేలా
జీవించే వాల్లు కొందరు!
అదే జీవితం! అదే జీవన వైవిధ్యం!!!
Half glass EMPTY/Half glass FULL..?
Everything depends on 'Perspective'!!!

Saturday, November 13, 2010

మా ఆత్మగౌరవానికి భంగం కలిగిందోచ్!!!

"మా ఆత్మగౌరవానికి భంగం కలిగింది" - ఇది ఇటీవల AP లో తరచుగా వినిపిస్తున్న మాట. 'మాకు లాటరీ టికెట్ తగిలిందోచ్!'  అన్నంత ఆనందంగా నాయకులు మా ఆత్మగౌరవానికి భంగం కలిగింది అని అనౌన్స్ చేసేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అనౌన్స్ చేయడానికి పోటీ పడుతున్నారు.ఇక అసలే కాంపిటీషన్ ఎక్కువై, 24గంటలూ చూపించటానికి న్యూస్ లేక ఆకలితో ఆవురావురుమంటున్న న్యూస్ ఛానల్స్ వారు,ఆత్మగౌరవం గురించి ఎవరు ఎత్తుకున్నా,రెక్కలు కట్టుకొని వారిముందు వాలిపోయి,వారికి ఫుల్ పబ్లిసిటీ ఇచ్చేస్తున్నారు.CM వేరే ప్రాంతం వ్యక్తి కాబట్టి,మా ప్రాంతం వారి ఆత్మగౌరవం దెబ్బతినింది అంటాడు ఒకడు. మా ప్రాంతంలో హైకోర్టు బ్రాంచి లేదు కాబట్టి మా ప్రాంతం వారి ఆత్మగౌరవం దెబ్బతినింది అంటాడు మరొకడు(అదేదో,IIT/AIRPORT లేదన్నట్లుగా).ఓ విగ్రహాన్ని ఎవరో ఏదో చేశారని,మా కులపోళ్ల ఆత్మగౌరవం దెబ్బతినింది అంటాడు ఇంకొకడు.రోడ్లమీద ధర్నాలు,రాస్తారోకోలూ చేస్తూ,ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న మా వాల్లని పోలీసులు ఇరగ్గొట్టి,జైల్ లో వేయడంతో మా ఆత్మగౌరవం డ్యామేజీ అయ్యిందంటాడు మరో విద్యార్థి నాయకుడు.నిజాం ని ఎవరైనా తిడితే మా ఆత్మగౌరవాన్ని బద్నాం చేసినట్లే అంటాడు ఓ మత నాయకుడు. ఇలాంటి న్యూస్ చూసీ చూసీ, ఈ మధ్య నాకో అనుమానం మొదలైంది. అసలు ఆత్మగౌరవం అంటే ఏమిటి? అది ఉందో,లేదో తెలుసుకోవడం ఎలా? ఒకవేళ ఉంటే, ఎంత ఉందో కొలవడం ఎలా? BP,షుగర్లు చెక్ చేయడానికి మెడికల్ టెస్ట్ లు ఉన్నట్లే,ఆత్మగౌరవం కొలవడానికి కూడా   ఏదైనా పరీక్ష ఉంటే బాగుండేది. అప్పుడు,ఆత్మగౌరవానికి భంగం కలిగింది అనే వాల్లందరికి ఆ పరీక్ష చేసి,ఎవరికి ఎంత భంగం కలిగిందో చెప్పే వీలుండేది. అట్లే, ప్రతీ సంవత్సరం నంది అవార్డుల్లాగా ఆత్మగౌరవ అవార్డులు కూడా కండక్ట్ చేసి, ప్రాంతాల,కులాల,మతాల వారీగా ఆత్మగౌరవ పిత, ఆత్మగౌరవ రత్న లాంటివి ప్రదానం చెస్తే మరీ బాగుంటుంది.అలాంటి టెక్నాలజీ త్వరగా రావాలని కోరుకుందాం. -జై ఆత్మగౌరవం.