చీకటి శాశ్వతం!
తల్లి గర్భం లో చీకటి- పుడమి గర్భం లో చీకటి,
కన్న తల్లి గర్భం లో నుండి, పుడమి తల్లి గర్భం లోకి ప్రయాణమే జీవితం.
మరో మాటలొ - చీకట్లోంచి చీకట్లోకి,
మధ్యలొ ఈ వెలుగు కేవలం కొన్నాల్ల మజిలి.
వెలుగు రెచ్చగొడుతుంది - చీకటి ప్రశాంతంగ ఉండమంటుంది.
వెలుగు ఓ నటన - చీకటి ఓ నిజం.
వెలుగులో ఉండి కూడా చీకట్లోని ప్రశాంతతని అనుభవించగలగడమే-
నా ద్రుష్ఠిలొ పెద్ద విజయం - దాని కొసమే నా ప్రయాణం...
-మహమ్మద్ హనీఫ్