Thursday, December 9, 2010

YSR పై ఓ అభిప్రాయం!!!

"YSR- ఓ అవినీతిపరుడు"
"YSR- ఓ ఫ్యాక్షనిస్టు"
"YSR- ఓ తెలంగాణా ద్రోహి"


ఇలా YSRని విమర్శించే వారి సంఖ్య ఈ మధ్య పెరిగిపోతుంది.. ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా, నాకేమనిపిస్తుందో   మీతో పంచుకోవాలని ఈ వ్యాసం.. రాజకీయనాయకుడు అంటే -ఐదేళ్లకోసారి ప్రజల వద్దకెల్లి, నోటికొచ్చిన హామీలిచ్చి,కులం,మతం,ప్రాంతం వీటిలో ఏదో ఒకటి,వీలైతే అన్నీ గుర్తుచేసి, ఇంకా వీలైతే రెచ్చగొట్టి, వారి ఓటును తద్వారా అధికారాన్ని పొంది, మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఇచ్చిన హామీలను, ఓటేసిన ప్రజలను మరచిపోయి రాజయోగాలు అనుభవించేవాడు అని ప్రస్తుత అర్థం."  ఏ నాయకుడు గెలిచినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సగటు ప్రజానీకం జీవితాలలో మాత్రం పెద్దగా మార్పు ఉండదు,గెలిచిన ఆ నాయకుని,అతని బంధువర్గ,అనుచరగణ జీవితాలలో తప్ప.. 2004కు ముందు వరకూ, రాష్ట్రప్రజలకు తెలిసిన రాజకీయమిదే..కానీ, 2004లో YSR ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత, ఓ రాజకీయ నాయకుడు తలచుకుంటే ప్రజల జీవితాలను ఎంతగా మార్చగలడో క్రమంగా అర్థమవుతూ వచ్చింది.ఇందిరమ్మ గృహాలు,ఆరోగ్యశ్రీ,వికలాంగ, వృద్ధాప్య పించన్లు,మైనారిటీ రిజర్వేషన్లు,విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్,108,104 etc..etc...రాష్ట్రంలో 80% పైగా ఉన్న దిగువ,మధ్య తరగతి కుటుంబాలలో, ప్రతి కుటుంబం  ఈ పధకాలలో కనీసం ఒక్క పధకం ద్వారానైనా లబ్ధిపొంది ఉంటుంది, వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ.. రాష్ట్రంలోని అనేక గ్రామాల్లాగే సాధారణంగా ఉండే మా ఊర్లో, 2004 తర్వాత సెలవులకు ఇంటికెల్లిన ప్రతిసారీ, ఈ మార్పును అక్కడి ప్రజల జీవితాలలో చాలా స్పష్టంగా గమనించాను.వర్షాకాలంలో నీరు కారకుండా నీలం రంగు పాలిథిన్ పేపర్లతో, ఎండాకాలంలో గాలికి ఎగిరిపోకుండా పైన పెద్ద రాల్లతో కనబడే బోదకొట్టాలన్నీ పక్కా గృహాలైపొయాయి-ఇందిరమ్మ పధకంవల్ల. పెద్ద రోగమేదైనా వస్తే, పెద్ద పాపమేదో చేసిఉంటామనుకుంటూ తమలోతాము కుమిలిపోవటమే తప్ప కార్పోరేట్  ఆసుపత్రులవైపు కన్నెత్తి చూడటానికికూడా సాహసించని నిరుపేదలు, పైసా ఖర్చు లేకుండా,దర్జాగా వ్యాధులు నయం చేసుకొని ఇల్లకెల్లటం నాకల్లతో చూశాను-ఆరోగ్యశ్రీ వల్ల...ఊర్లోకి అంబులెన్స్ వస్తే, 'రెడ్డిగారి ' వీధిలో ఎవరికో బాగాలేదనుకొనే పరిస్థితినుండి, పేదోడి ప్రాణాన్ని కాపాడటానికి కూడా ఆఘమేఘాల మీద అంబులెన్స్ లు రావడం 'కుయ్ కుయ్ 'శబ్దాల సాక్షిగా చూశాను- 108వల్ల. టెంత్/ఇంటర్ తర్వాత, విమానటికెట్ కి,వీసా చార్జీలకి అవసరమైనంతడబ్బును అప్పుగా పొందగల స్తోమత ఉన్నోడు గల్ఫ్ లో ఒంటెలు కాసుకోడానికో,మరేదైనా కూలిపనికో.. ఆ మాత్రం స్తోమత కూడా లేనివాడు.. నాలుగు చక్రాల బండి మీద పండ్లు,కూరగాయలు అమ్ముకుంటూ..స్థానిక మసీదులోని ముల్లా చెప్పే 'స్వర్గపు కబుర్లు' వింటూ, పేదరికం దేవుడు పెట్టే పరీక్ష అనుకుంటూ నైరాశ్యంలో బతకటం..ఇదీ నాకు తెలిసిన ఒకప్పటి మైనారిటీ యువకుల దీనస్థితి. కానీ, ఇప్పుడు వీరిలో చాలా మంది MBA/MCA/BTech లు జాయినవుతున్నారు- మైనారిటీ రిజర్వేషన్లు,ఫీజు రీఎంబర్స్మెంట్ ల వల్ల.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి.వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక వ్యక్తి-YSR.


YSR మహాత్ముడు కాదు:


చట్టాలను అతిక్రమించో, చట్టంలోని లొసుగుల్ని ఉపయోగించుకొనో తన వాల్లకి అక్రమ ఆస్తుల్ని కూడబెట్టడం ప్రస్తుతం రాజకీయాల్లో నడుస్తున్న ట్రెండ్.YSR దీనికి అతీతుడేమీ కాదు. తన బంధు,అనుచరగణం అక్రమాస్థులు సంపాదించుకోవడంలో సహకారం అందించటం, లేకుంటే చూసీ చూడనట్లు వదిలేయటం చేసిఉంటాడనటంలో ఎవరికీ సందేహం అవసరం లేదు.. అట్లే YSR ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జలయగ్నం మరియు ఇతర పథకాలలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిఉంటుంది అనే దాంట్లో కూడా సందేహం లేదు. కానీ ఈ అవినితిని ఆసరాగా చేసుకుని, దేశంలో ఇప్పటివరకూ ఏ CMకి కానీ,ఏ నాయకునికి కానీ, కనీసం ఊహకైనా అందనంత మంచి పథకాలను ప్రవేశపెట్టిన YSRని, పేదప్రజల గుండెల్లోనుండి శాశ్వతంగా తొలగించడానికి ఓ పథకం ప్రకారం
కుట్ర జరుగుతుండడమే అసలు విషాదం. YSR అవినీతి గురించి, నిజాయితీగా వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న JP లాంటి వారో,అవినీతికి పాల్పడే అవకాశం ఎప్పుడూ లేని,రాని కమ్యూనిస్టులో విమర్శిస్తే పరవాలేదు కానీ, అవినీతి వ్యవస్థలో తాము కూడా భాగమైపోయి, తమ హయాంలో సాధ్యమైనంత దోచుకున్న వారుకూడా-'మేమైతే కొంత తక్కువ దోచుకునే వాల్లం' అన్నట్లుగా విమర్శించటం హాస్యాస్పదం. ఇక YSR బతికి ఉన్నన్నాల్లూ తమ శకుని ఎత్తుగడలు ఫలించక, ఓ వైపు ప్రతి ఎలక్షన్లలోనూ తెలంగాణా ప్రజలు YSR పక్షానే నిలుస్తుండటంతో ఏంచేయాలో పాలుపోక అన్నీ మూసుకుకూర్చున్న కెసీఆర్ అండ్ కో, ఆయన మరణించిన ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రాన్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసారో కనిపిస్తూనే ఉంది. ఐనా, పార్టీలూ, ఉద్యామాలంటూ మొదలుపెట్టాక అపోజిషన్ వాడు ఎంత మంచోడైనా వాడిని తిట్టకుంటే మనుగడ ఉండదు కాబట్టి ఈ విమర్శలను కొంత వరకూ అర్థం చేసుకోవచ్చు. వీరందరూ కాక, YSRని విమర్శించే మరో గ్యాంగ్ కూడా ఉంది. అది -కాంగ్రెస్ లోని వృద్ధజంబూకాల గ్యాంగ్. వయసుతో పాటు YSRపై కుల్లు,ఈర్ష్య,అసూయ పెరుగుతూ వచ్చి, ఎవరికి చెప్పుకోవాలొ ఏం చేయాలొ తెలియక సతమవుతున్న ఈ ముసలి నాయకులు(?) ,ఇటీవల స్టేట్మెంట్లు ఇవ్వడంలో బిజీగా ఉన్నారు."YSR పధకాలన్నీ సోనియా పథకాలేనంటాడొకడు. మరి వేరే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు లేవు? కాంగ్రెస్ పార్టీ గెలుపులో తమ పాత్ర కూడా ఉందంటాడు మరొకడు.ఇది విని వాల్ల ఇంట్లొవారు కూడా నవ్వకుండా ఉండలేరు. సోనియా వల్లే YSR గొప్పవాడయ్యాడంటాడు ఇంకొకడు.YSRలేకుంటే కాంగ్రెస్ గతి ఏమయ్యేదో ఇప్పుడు సోనియాకు క్లియర్ గా తెలిసిఉంటుంది . కాంగ్రెస్ లోని ఇలాంటి నాయకులందర్ని 'ఏనుగును చూసి మొరిగే కుక్కలనవచ్చు ' కానీ కుక్కలలో కూడా ఇవి 'పిరికి కుక్కలు ' ఎందుకంటే ఏనుగు ముందు అరవడానికి భయపడి ఏనుగు వెల్లింతర్వాత, ఏనుగుకు వినపడకుండా సైలెంట్ గా మొరుగుతున్నాయ్ కాబట్టి. ఇక ఇలాంటి నాయకులతో నిండిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటో కాలమే చెప్తుంది.

35 comments:

  1. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇచ్చిన ఋణాలు ఇళ్లు కట్టడానికి సరిపోక అసంపూర్తి గోడలు మిగిలాయి. ఆరోగ్యశ్రీ ప్రైవేట్ ఆసుపత్రులకి లాభం కలిగించింది. ఆ డబ్బుతో ప్రభుత్వ ఆసుపత్రులలోని సౌకర్యాలు పెంచొచ్చు అని తెలిసినా ప్రైవేట్ ఆసుపత్రులని మేపారు. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. చంద్ర బాబు ఎంత అవినీతిపరుడో, రాజశేఖరరెడ్డి అంతే అవినీతిపరుడు.

    ReplyDelete
  2. baaboo done it polishly nd reddy done it openly,thats why..reddy faced much criticism now a days.

    ReplyDelete
  3. This is why no one can change our fate. Even educated people are failing to think straight.

    1) First point, Its govt duty to provide us services...Dont think that they are doing us some favor.

    2) How many acres of land converted to Irrigation in the last five years by spending almost 30-40% or 30k to 40k crores of budget every year

    3) Instead of Arogya Sri (disclosed budget of 500 crores for year * 6 years), imagine spending 6000 crores on upgrading govt hospitals.

    4) Private hospitals are building dedicated blocks for Arogya Sri with 100 - 500 beds, thats how shows how much they are earing.

    5) What is going to happen to Govt hospitals now? no doctors, no facilities eventually no govt hospitals (Privatization of Health care)

    6) Arogya Sri cap is 3Lakhs per head....what happens next if there is any health issue?

    7) There are 1.5 crore white cards (1.5 crore families * 4 people average = 6 crore people).
    so almost entire state is eligible for free food, free power, free health etc..etc...Then how come any of my friends or not covered by this....where are all these 6 crore people who are availing these benefits?

    8) Its completely vote bank politics by putting the state and growth of the people at stake. They are not worried about the consequences.

    9) Name any of the effective functioning or at least functioning body of the state?

    "Thinking in the wrong direction is worse than not thinking at all"

    ReplyDelete
  4. If people say that YSR was a factionist,murderer,cheater or whatever I am least bothered.Actually YSR before 2004 was different from YSR after 2004. No human being is a saint and there is nobody on this universe without flaws. I can just say "ITS NOT IMPORTANT THAT WHERE WE COME FROM BUT WHERE WE GO IS IMPORTANT"
    Inka pacchi telugulo oka paata kooda vundi "mee lo paapam cheyyani vadoo evado cheppandi"

    ReplyDelete
  5. ఆరొగ్యశ్రీ గురించి:
    "ఈ పథకంతో కార్పోరేట్ హాస్పిటల్స్ లాభపడ్డాయి"," ఈ పథకానికి పెట్టిన డబ్బుతో ప్రభుత్వాసుపత్రుల్ని బాగుచేసిఉండవచ్చు"-- ఈ వ్యాఖ్యల్లో కొంత వరకు నిజం ఉంది. కానీ ప్రభుత్వాసుపత్రుల్ని రాత్రికి రాత్రి బాగుచేయటం ఎవరివల్లా కాదు. దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.మరి అప్పటివరకు రోగుల పరిస్థితి ఏంటి? ఈ పథకం పై ఎన్ని విమర్శలున్నా, ఈ పథకం వల్ల లబ్ధిపొందిన నిరుపేదలు నాకు ప్రత్యక్షంగా పదుల సంఖ్యలో తెలుసు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది ఉంటారో..? ఐనా, ప్రభుత్వాసుపత్రుల్ని బాగుచేయడానికి కనీసం ప్రయత్నించకపోవడం మాత్రం YSR వైఫల్యమే. అట్లే అవినీతిని అరికట్టలేక పోవడం కూడా.. అందుకే YSRమహాత్ముడు కాదు అని అండర్లైన్ చేసి మరీ రాశా..

    ReplyDelete
  6. arogyasree:
    The argument that new hospitals can b opened or updated with the heavy spending of arogya sree???

    firstly: see RIMS a govt. multi specialty hospital constructed in kadapa, whats the fate of this hospital???
    for the kind information "NO DOCTOR IS INTERESTED IN WORKING AT KADAPA"

    secondly: can u pay lakhs of rupees as salaries to govt doctors if so will other employees like engg n other will be quiet???

    thirdly: be wise in accepting the fact that even if govt hospitals open up will the employees work as sincerely as in a private hospital??? jst see the hygienic conditions in govt hospitals not jst doctors even patients visiting will have an negligence attitude that its govt hospital n behave as we can. "PAN" strains r the best example u can find them on the walls of most of the govt. offices but would u dare to see it in any private one???


    fourth: their is a saying "GONTU KOOSEY VAADI KANNA, NALUKA KOOSE WAADU NAYAM" i mean YSR KOOSEY DI NAALUKA MATRAMEY GONTU KAADA

    HOPE ITZ JUSTIFIED

    ReplyDelete
  7. బాగుంది.YSR పధకాల వలన లబ్ది పొందిన వ్యక్తుల్ని నేను కూడా ప్రత్యక్షంగా చూసాను.ఎవరు ఎన్ని విమర్శలు చేసినా YSR ను ప్రజల గుండెల్లోంచి దూరం చెయ్యలేరు.
    అతను మరణించి సంవత్సరము దాటినా YSR ను తలవని రోజు అంటూ లేదు ఈ రాష్ట్రంలో. అదే YSR ప్రభావం ప్రజలపై.

    ReplyDelete
  8. @Amar
    /*3) Instead of Arogya Sri (disclosed budget of 500 crores for year * 6 years), imagine spending 6000 crores on upgrading govt hospitals.*/
    అమెరికా లో మీరు ఏదన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళరా? లేకపోతె ఇక్కడ కూసోని ఇండియా లో మన వాళ్లకి సొల్లు కబుర్లు చెప్తున్నారా ?ఆపండి మీ రెండు నాలుకల మాటలు.
    /*What is going to happen to Govt hospitals now? no doctors, no facilities eventually no govt hospitals (Privatization of Health care)*/
    It is very much required..Already late man..

    ReplyDelete
  9. చాలా బాగా రాశారు. ysr చనిపోయి సంవత్సరం దాటినా ఇంకా కక్షతో కసితో కులపిచ్చితో విమర్శించే బ్లాగర్లు కూడా ఉన్నారు. మీరు అన్నట్టు ysr మహాత్ముడు కాక పోవచ్చు. కానీ కోట్లాది మంది అభిమానులు పిచ్చివాళ్ళు కాదు కదా. ఈ విషయం కొంతమంది arm chair expert blogger లకు ఎప్పటికీ అర్థం కాదు.

    ReplyDelete
  10. @Appi-Boppi
    Well I was in US only for sometime on business, I am not talking Sollu like you sitting in US. I am in India by choice (even if I have chance to stay in US).

    And its not just Arogya Sri, if you r in AP now...you will feel it in each and every sector...roads...employment....govt employees behavior.

    @Anonymous
    Kotladi mandi abhimanulu, if it is not for caste or financially gains..show me one educated person who is great fan of YSR.
    If there is someone, I doubt his mental condition.

    ReplyDelete
  11. I can agree all your points. We should not expect from one CM can change our lifes. First the people should change.Lets talk about little more on Govt Hospitals. In our life everybody can feel sick. When you feel sick have you gone to hospital any time. In your mind you feel govt hospitals are not good, medicines are not good and the doctors dont care you. This is created by us. In my life i went to govt hospitals when i feel sick eventhough i have capable of spending money for private hospitalization. The treatment and medicines in govt hospitals was good. This is happened very long back. But i dont know the current status. Now if the govt hospitals are not good means the people are not using them properly.

    ReplyDelete
  12. YSR was the most corrupt person in the last 50 years. He looted estimated 10 Lakh Crores.

    1-2 Lakh Cores by his family
    5 Lakh Cores to Sonia and gang at Center
    2-3 Lakh Crores to Congress Leaders/Ministers/MLA's and MP's in the State.

    After 2002 land prices shot up 50 times (some cases 100 times) in AP. For example 1 Lakh worth land (Acre) was 50-100 Lakhs in a short period of time.

    Most of the land was sold to Indian Industrialists and International lobby. Given away to Congress MLA's and MP's.

    Reliable sources point out Indian politicians stashed 1.5 Trillion Dollars in Swish Banks. There many other such systems (similar to Swish Banks) all over the world accept black money.

    ReplyDelete
    Replies
    1. nee daggara sakhya munte court case veyavachu kadara badkov
      vimarsinchadam passion aipoindi prati vadiki. kaneesa peru cheppukoleni vadivai vedava lekkalu cheputunnav

      Delete
  13. i am neither a reddy nor a congressman but i am a big fan of ysr.Let us assume that reddys like ysr because of his caste then why dont reddys love all other reddy politicians like jeevan reddy, nagam janardhan reddy ,janareddy, marri sasidhar reddy etc.,

    ysr is the only reddy politician who has a huge fan following irrespective of caste,region and party.And the same is not true in case of CHANDRABABU NAIDU and he is loved only by kammas and nobdy else

    ReplyDelete
  14. ఆయన పోయి ఏడాది దాటినా కేవలం రెడ్డి అనే ద్వేషంతో అడ్డగోలుగా విమర్శించే వాళ్ళలో చదువరి ఒకడు!

    ReplyDelete
  15. ఆంధ్రాలొ హిందు రెడ్లు (మరే ఏ కుల మైనా సరే) ఒక విషయములొ వెనుకబడి వున్నారు. ఒక సారి మతము మారిన రెడ్డి (in this case YSR) ఆ మారిన మతానికి దాసుడు అవుతాడు. తన రెడ్డి కులాన్ని ఒక పావుగా వాడుకొని, మత మార్పిడులు చెస్తాడు. వాడి కూతురు, వాడి అల్లుడు ల తొ మత మార్పిడులు చెస్తాడు. ఈ విషయము హిందు రెడ్లు ఎప్పుడు గ్రహిస్తారొ!.

    ఒక సారి మతము మారిన వాడి loyalty తెల్లవానికి పొతుంది. ఇక వాడు మన దేశానికి/సంస్క్రుతికి ఒక శత్రువుగా తయారు అవుతాడు.

    YSR అదే చెసి చూపించాడు. తిరుపతి కొండలు మింగాలని చూచాడు.

    ReplyDelete
  16. మీ పొస్తులు అన్ని చుసను అన్ని నకు నచ్హాయి కాని ఈ పొస్త్ థొ నెను పూర్ఠిగా ఏకీభవించట్లెదు అతను చెసినవి అన్ని నాకు చీప్ పోలిటిక్స్ లాగానే అనిపించాయి!

    ReplyDelete
  17. Excellent review on YSR.
    Thanks for posting.

    ReplyDelete
  18. అజ్ఞాత వ్రాసారు
    >>>>>
    ysr చనిపోయి సంవత్సరం దాటినా ఇంకా కక్షతో కసితో కులపిచ్చితో విమర్శించే బ్లాగర్లు కూడా ఉన్నారు. మీరు అన్నట్టు ysr మహాత్ముడు కాక పోవచ్చు. కానీ కోట్లాది మంది అభిమానులు పిచ్చివాళ్ళు కాదు కదా. ఈ విషయం కొంతమంది arm chair expert blogger లకు ఎప్పటికీ అర్థం కాదు.
    >>>>>
    నేనేమీ కులం పేరుతో రాజశేఖరరెడ్డిని విమర్శించడం లేదు. చంద్రబాబు ఎంత అవినీతిపరుడో రాజశేఖరరెడ్డి కూడా అంతే అవినీతిపరుడని అన్నాను. కులం విషయానికి వస్తే రాజశేఖరరెడ్డికి వ్యక్తిగతంగా కులం మీద నమ్మకం లేదు. అతను ఒక దళిత స్త్రీకి, రెడ్డి పురుషునికి పుట్టినవాడు. రాజకీయాలలోకి వచ్చేసరికి వోట్ల కోసం ఎవడైనా కులం పేరు చెప్పుకుంటాడు. అతనికి వ్యక్తిగతంగా కులం మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇక్కడ సెకండరీ విషయం. చంద్రబాబు నాయుడికి కూడా కులం మీద నమ్మకం లేదు. సొంత మామకే వెన్నుపోటు పొడిచినవాడు కులాన్ని ఏమి ఉద్ధరిస్తాడు? పల్లెటూర్లలో కుల సంబంధాలు బలంగా కనిపిస్తాయి కానీ పట్టణాలలో బలంగా కనిపించేవి డబ్బు సంబంధాలే. దోచుకునేవాడు ఆ పని చెయ్యడానికి కులం, మతం లాంటి అవధులు చూడడు. అది పల్లెటూర్లో అయినా, పట్టణంలో అయినా.

    ReplyDelete
  19. ysr might have converted to christianity and his family(jagan) may convert to islam or buddhism or jainism or sikhism. even then i love ysr's family because that family has guts to take on the "G" family

    ReplyDelete
  20. ఇందిరమ్మ ఇండ్లా :)) ఆ ఇండ్లను కొనుక్కున్న వాళ్ళని కలిసి మాటాడి చూడండి :)
    మా పనిమనిషి రోజూ బూతులు తిడుతోంది .

    ReplyDelete
  21. anonymous gaaru mee panimanishi ki koncham "g" balisi vuntundandi

    ReplyDelete
  22. i was held up in warangal for 15 days due to some work and i stayed in indiramma illu for 15 days and it was very good with all facilities.Even an upper middle class family can stay in that indiramma illu.Your panimanishi will be satisfied if she is given taj mahal to stay

    ReplyDelete
  23. Thanks to Weekend Politician,Praveen Sarma,astrojoyd ,అమర్ (Amar) ,4smartstudents,అప్పి-బొప్పి ,kranthi and all other anonymous readers for your views and comments..

    ReplyDelete
  24. I completely agree with Amars comments.
    why to take on caste, religion.
    comeout and see what good he did to society.

    free ga vaste anni andariki ruchigaane vuntayi.
    Tax kattevadiki telustundi aa badha. atu tax kadutu itu ee free padhakaalu not eligible avutu. kashta pade vaadini kuda addadaarlu tokkamanadam aa mahanubhavudu chesindi prove chesindi. "kaka pote ysr lo naaku nachhindi panche kadatadu, Navvutu vuntadu"

    ReplyDelete
  25. /*show me one educated person who is great fan of YSR */
    హైదరాబాద్ ,రంగా రెడ్డి జిల్లాల్లో ఉండే అన్ని సీట్లు (పాత బస్తీ తప్ప) YSR గెలిచాడు.ఇక్కడ ఉండేది దాదాపుగా educated పీపుల్ ఎ చిన్న.
    మరి నీ statement ఎక్కడన్నా పెట్టుకోండి.
    నీలాంటి వాళ్లకి ఈ విషయం ఈ జన్మకి అర్ధం కాదులే కానీ వచ్చే జన్మలో ట్రై చెయ్యి

    ReplyDelete
  26. @ above Anonymous:

    I completly agree with ur views on tax payer's money not getting utilised properly. If you dont like YSR for this reason, I'm sure u dont like any other politician of current politics..who offered to give all freeees.. who offered to give directly 2K per month to everyhome,color TVs,etc..

    @ అప్పి-బొప్పి : Thanks.

    ReplyDelete
  27. @Appi-Boppi

    "నీలాంటి వాళ్లకి ఈ విషయం ఈ జన్మకి అర్ధం కాదులే కానీ వచ్చే జన్మలో ట్రై చెయ్యి"

    :-) I am just laughing like YSR at you.

    ReplyDelete
  28. very good,
    me abhiprayam tho nenu purthiga ekibhavisthuna.
    ysr vunnappudu state ela vundi,ippudu ela vundi andharu okkasari alochinchandi.

    ReplyDelete
  29. @kirankumar.vakada
    నా రాతలు మీకు నచ్చినందుకు సంతోషం. Thanks.

    ReplyDelete
  30. meru illanti stories inka rayandi plz
    naku chala baga nachindi

    ReplyDelete
  31. mana(KULA GAJJI MEDIA) telugu media...TV9,ETV,ETV2,ABN,ANDHRA JYOTHI,VARTHA ,MAHA TV,EENADU,...VELLU EPPUDINA NIJAALANU NERBHAYAGA..RASARA....?

    YSR AVINETHI GURINCHI MATLADE EE KULAGAJJI MEDIA ... RAMOJI ,CHANDRA BABU,CM RAMESH,NAMA GURINCHI ENDHUKU PRASNICHADHU....?

    OKAPPUDU DONGALU,DHOPIDIDHARULU ANI CONGRESS VALLANI ANNA TDP ,CHENDRABABU & BATCH EPPUDU EE CONGRESS VALLANU THAMA TDP LO ELA CHERCHUKUNNARU? ANTE CONGESS LO VUNTE AVINITHIPARULU TDP LO UNTE GOPPOLLA?

    TELANGANA BHUMILUNI DOCHINA RAMOJI GOPPODA?

    ANDHRA KG BASIN (GAS) NEECHANGA DHOPIDI KI GURI AVUTHUNNA ENDHUKU EE TV9,EENADU, ABN,EENADU, PRASNICHADHU ?

    AMBANILU ANTE ENDHUKU VELLAKI BHAYAM?

    EE KULAGAJJI MEDIA RASTRA VIBAJANA LO TDP VIKERINI EPPUDINA TAPPU PATTINDHA?
    NINNA WARANGAL LO JAI TELANAGANA ANNADU..MARI ANDHRA LO SAMANYAAM ANTADU...EE MEDIA KI CBN AVAKASA VADHAM KANIPICHDHA...? GUDDI MEDIA>..>>>

    JAGAN AVINITHIPARUDU KAVACHU...KANU AVKASAVDHI KADHU.. VELLA LA PUTAKO MATA MATLADALEDHU..

    WAR BETWEEN.....

    EENADU+TV9+ABN+JP+MODI+CHANDRABABU+LAGADAPATI+BJP+PAWAN+TRS+VEMURI RADHAKRISHNA(10) ONESIDE........>JAGAN OKKADU OKASIDE....EDHI PRJALU CHUSTHUNNARU...

    ReplyDelete
  32. Ysr చనిపోయి 4సంవత్సరం దాటినా ఇంకా కక్షతో కసితో కులపిచ్చితో విమర్శించేకూడా ఉన్నారు. మీరు అన్నట్టు ysr మహాత్ముడు కాక పోవచ్చు. కానీ కోట్లాది మంది అభిమానులు పిచ్చివాళ్ళు కాదు కదా....EPPATIKI YSR PERU THALUCHUKONE NERUPEDHALU ENTHAMANDHOO...UNNARU..

    AROGYASRI VALANA HEART POERATION CHENCHUKUNNAVALLU ANDHRU YSR PHOTO NI VALLA PUJAGADHI LO PETTUKUNNARU...

    ReplyDelete