2010లో, తెలంగాణాపై తేల్చటానికని కేంద్ర ప్రభుత్వం ఓ ఐదుగురు తటస్థులతో నీతి నిజాయితీ గల నికార్సైన వ్యక్తిగా పేరున్న జస్టిస్ శ్రీక్రిష్ణ గారి అద్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణాలోని అన్ని రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు ఈ కమిటీ ఎదుట హాజరై తమ వాదనలు, అభిప్రాయాలు వెలిబుచ్చారు. దినపత్రికలు,వార్తలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి ఎవరికైనా అప్పట్లో చర్చల అనంతరం బయటికి వచ్చిన తెలంగాణా నాయకులు T.V మైకుల ముందు ఏమన్నారో గుర్తుండే ఉంటుంది. "కమిటీ సభ్యులు మేం చెప్పింది పూర్తిగా,శ్రద్ధగా విన్నారు", "తెలంగాణాకు అనుకూలంగా రిపోర్టు ఇస్తారని మాకు పూర్తి నమ్మకం కలిగింది" లాంటి అభిప్రాయాలు దాదాపు అందరి నోటినుంచి వచ్చాయి. KCRగారైతే మరో అడుగు ముందుకు వేసి, జస్టిస్ శ్రీక్రిష్ణ గారి నైతికత హిమాలయాలంత ఎత్తు అనీ, రిపోర్టును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగ ఇస్తారనే నమ్మకముందని స్టేట్మెంట్లిచ్చేశారు. ఇదే రకంగా సీమాంధ్రా నాయకులు,ప్రజాసంఘాల వాదనలు కూడా విన్న శ్రీక్రిష్ణ కమిటీ, తెలంగాణా వారు చెప్తున్న అన్యాయం,దోపిడీ లాంటివి వట్టిమాటలని తేల్చెశారు.ఇక అప్పటిదాకా శ్రీక్రిష్ణ మంచోడు,మంచోడు అన్న నోల్లే, రాత్రికి రాత్రి ప్లేటు ఫిరాయించేసి ఆయన మీద ఎలాంటి ఆరోపణలు చేశారో గుర్తుండే ఉంటుంది. "జస్టిస్ శ్రీక్రిష్ణ అమ్ముడుపోయారు"," శ్రీక్రిష్ణ కమిటీ దిక్కుమాలిన కమిటీ","సీమాంధ్ర నాయకుల ప్రలోభాలకు లొంగిపోయారు" లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంలో తె.గ నాయకులు పోటీ పడ్డారు.
ఇక మధుయాష్కీ ఐతే- సీమాంధ్ర నాయకులు శ్రీక్రిష్ణ కమిటీ సభ్యులకు దుబాయ్ లో ఫ్లాట్లు కొనిచ్చారనీ, దీనికి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయనీ సమయమొచ్చినప్పుడు బయట పెడతాననీ నిస్సిగ్గుగా చెలరేగిపోయాడు. ఆ ఆధారాలు ఎప్పుడు చూపిస్తావని తర్వాత తెలంగాణాలో ఎవరూ మధుయాష్కీని అడగలేదు, ఈయన చూపించనూ లేదు. తమ ప్రజల అమాయకత్వం మీద ఈ నాయకులకి ఎంత నమ్మకమో!
ఇక మధుయాష్కీ ఐతే- సీమాంధ్ర నాయకులు శ్రీక్రిష్ణ కమిటీ సభ్యులకు దుబాయ్ లో ఫ్లాట్లు కొనిచ్చారనీ, దీనికి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయనీ సమయమొచ్చినప్పుడు బయట పెడతాననీ నిస్సిగ్గుగా చెలరేగిపోయాడు. ఆ ఆధారాలు ఎప్పుడు చూపిస్తావని తర్వాత తెలంగాణాలో ఎవరూ మధుయాష్కీని అడగలేదు, ఈయన చూపించనూ లేదు. తమ ప్రజల అమాయకత్వం మీద ఈ నాయకులకి ఎంత నమ్మకమో!
ఇలాంటి నిరాధార,అడ్డగోలు ఆరోపణలతో శ్రీక్రిష్ణ రిపొర్టు 'ఓపెనింగ్స్ బాగున్నా, కమర్షియల్ గా ఫ్లాప్' ఐన సినిమాలా తయారయ్యింది.ఇక లేటెస్టు గా, ఈ ఫ్లాప్ సినిమాను రీమేక్ చేయడానికన్నట్లుగా ఆజాద్ మల్లీ చర్చలు షురూ చేసి, తె.గ కాంగ్రెస్ నాయకులతో గంటలు గంటలు మంతనాలు సాగించాడు. ఈ మీటింగుల నుంచి బయటికి వచ్చిన తె.గ నాయకుల స్పందన, శ్రీక్రిష్ణ కమిటీతో చర్చల అనంతరం లాగానే ఉంది. -"తరతరాలుగా తెలంగాణా కి జరిగిన అన్యాయాన్ని కల్లకు కట్టినట్లు ఆజాద్ కి వివరించాము, ఆయన చాలా శ్రద్ధగా విన్నడు.మద్యలో అక్కడక్కడా కంటతడి కూడా పెట్టిండు.( వెనక నుంచి- ముక్కు కూడా చీదుకున్నడు), కాబట్టి తెలంగాణాకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటడని మాకు పూర్తిగా నమ్మిక ఉన్నది". ఇక షరా మామూలుగానే తర్వాతి రీలు, సీమాంధ్ర నాయకులతో చర్చలు. వీరితో కూడా చర్చలు ముగించాక కాంగ్రేస్ హై కమాండ్ కి, ఆజాద్ రిపోర్టు సమర్పిస్తారట. ఈ రిపోర్టు కూడా ఎలా ఉండబోతుందో ఊహించటం పెద్ద కష్టం కాదు. కాకపోతే ఈ రిపోర్టును తయారు చేయటానికి ఆజాద్ 2 నెలలు సమయం కావాలన్నాడట. అంత టైం ఎందుకు అంటే రంజాన్ ఉంది కాబట్టి అనేది ఒక రీజను. రంజాను కీ, చర్చలకీ సంబంధం ఏమిటో..? ఉపవాసాలు ఉంటూనే,చర్చలు గట్రా చేయకూడదా..? ఏదేమైనా, ఆజాద్ నివేదిక ఎప్పుడు ఇచ్చినా.. శ్రీక్రిష్ణ కమిటీ లాగానే ఆజాద్ కూడా ఆరోపణలు,నిందలు భరించటానికి సిద్ధం కావాల్సిందే. "ఆజాద్ అమ్ముడు పోయాడు", "ఆజాద్ ద్రోహి"," ఆజాద్ కి సీమాంధ్రా నాయకులు చంద్ర మండలంలో ఫ్లాట్ కొనిచ్చారు,దీనికి మాదగ్గర బోలెడన్ని ఆధారాలు ఉన్నాయి" లాంటి కామెంట్లు భవిష్యత్తులో బుల్లి తెర సాక్షిగా చూడాల్సి రావచ్చు. అప్పటిదాకా Lets wait and see..