Wednesday, January 11, 2012

ఆ పాడు పని చేసింది వాల్లే..(ఇలాంటి వార్తలు తెలుగు పేపర్లలో రావు. )

The Hindu : News / National : Pakistani flag hoisting was a Hindutva plot to foment strife, police say

హిందూ పత్రికలో ఈ రోజు వచ్చిన పై వార్తను చదవండి.
వారికి బాగా అలవాటైన, 'విభజించు పాలించు ' అనే సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఈ సారి కాలం కలిసివచ్చినట్లు లేదు. తీరా వీరి కుటిల బుద్ధి బహిర్గతమయ్యాక నేరం మాది కాదంటే మాది కాదని ఒకరిపై ఒకరు వేలెత్తి చూపించుకుంటున్నారు. శ్రీ రాంసేన, భజరంగ్ దల్, RSS.... పేర్లు వేరైనా అందరి వ్యూహం ఒకటే. మైనారిటీలను మెజారిటీ మతస్తుల నుండి వేరు చేయడం, మైనారిటీలను వారికి బూచిగా చూపి, హిందువులను ఉద్ధరించేది తామేనని నమ్మబలికి వారి ఓట్లను కొల్లగొట్టడం. ఇదే వీరి అజెండా.. బ్రిటీష్ వాడినుంచి నేర్చుకున్న ఈ సూత్రాన్ని ఇప్పటిదాకా అనేకసార్లు విజయవంతంగా అమలుపరిచారు. కాకపోతే ఈసారి కాలం కలిసి వచ్చినట్లు లేదు పాపం..

సానియా మీర్జా పొట్టి గౌను పై, ఊరూ పేరూ లేని ఓ మారుమూల గ్రామం లోని ముసలి ముల్లా ఎవరైనా ఫత్వా జారీ చేస్తే.. అలాంటి వార్తల్ని ప్రముఖంగా ప్రచురించే మన తెలుగు మీడియా.. మన రాష్ట్రం పక్కనే జరిగిన పై సంఘటన గురించి మాత్రం రాయలేదు. బహుశా మన పాఠకులకు ఇలాంటివి నచ్చవనుకున్నారు కాబోలు. మన తెలుగు మీడియా ఇలాంటి ధోరనిని చూపడం ఇది మొదటిసారి కాదు.
సుమారు రెండేల్ల క్రితం, కర్నాటకలో ఓ హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయితో లేచిపోయిన సంఘటన ఇలాగే మతం రంగు పులుముకొని వివాదాస్పదం అయింది. 'లవ్ జీహాద్ ' పేరుతో ముస్లిం లందరూ కూడబలుక్కొని హిందూ అమ్మాయిల్ని లేవదీసుకు పోయే కార్యక్రమం పెద్ద యెత్తున చేస్తున్నారని, కాబట్టి ముస్లింలను దూరంగా ఉంచాలని శ్రీ రాం సేన, RSS లాంటి సంస్థలు నానా రాద్ధాంతం చేశాయి. పైదా దానికి ఆధారాలంటూ వివిధ 'లేచిపోయిన' లెక్కల్ని కూడా చూపించేవి. దీనిని అప్పట్లో 'ఈనాడు' పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.. వారి కాకి లెక్కల్తో సహా. ఈ వివాదంపై  స్పందించిన కర్నాటక ప్రభుత్వం(BJP), హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణా సంఘాన్ని వేసింది. సుమారు 2 నెలల విచారన అనంతరం 'లవ్ జీహాద్ ' అనేది ఒట్టి పుకారేననీ, ఆ లెక్కలన్నీ కాకి లెక్కలేననీ తేలింది. కానీ విచారణా సంఘం ఫలితాన్ని మాత్రం మన 'ఈనాడు' ప్రచురించలేదు. ఐనా నిరంతరం ఏదో ఒక పార్టీ కొమ్ముకాస్తూ వార్తల్ని రాసే మన పత్రికల నుండి ఇలాంటి విలువల్ని ఆశించడం అత్యాశేనేమో. కాకపోతే.. ఇలాంటి అసత్యాల్ని, అర్థ సత్యాల్ని మాత్రమే చదివి, తమకు మొత్తం తెలుసనుకొని ఫీలైపోయి, మనసు నిండా విద్వేషం నింపుకొని, పైన పేర్కొన్న సంస్థల్ని నికార్సైన దేశభక్త సంస్థలుగా భావిస్తూ, తమను మించిన దేశభక్తులు లేరనే భ్రమల్లో బతుకుతూ.. తమకు నచ్చని విషయాల్ని రాసే వారందరినీ ద్వేశించడమే పనిగా పెట్టుకున్న కొందరు దారి తప్పిన యువకులు కాస్త అప్రమత్తంగా  ఉండాల్సిన అవసరం ఉంది..

ఇక అసలు ట్విస్టు ఏంటంటే.. 'మత పరమైన విభజన'కు ఆదినుండి ఆజ్యం పోసిందీ, దాని నుండి అత్యధిక లబ్ధి పొందిందీ BJP మరియా దాని అనుబంధ సంస్థలే.. కానీ మైనారిటీలకు మేలు చేసే రిజర్వేషన్లు, మత హింసా బిల్లు లాంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడల్లా.. వీరు చేసే మొదటి ఆరోపణ- ఇవి 'మత పరమైన విభజనకు దారితీస్తాయట, కాబట్టి వీరు వాటిని సమర్థించరట.. మంచి జోక్ కదూ..

20 comments:

  1. వాళ్లసంగతి సరే మతహింసబిల్లు వల్ల దేశ ఐక్యతపెరుగుతుందా ? ఆవీషయం చెప్పండి ముందు . ఇలా విభజించి ఇచ్చే సౌకర్యాలవల్ల దేశమేగతి బాగుపడుతుందో కూడా వివరిమ్చండి

    ReplyDelete
    Replies
    1. @Durgeswara:
      మత హింసా బిల్లుకు, దేశ ఐక్యత కు ఏంటి సంబంధం..? SC,ST అట్రాసిటీ యాక్టుకు, మహిళల కోసం చేసిన గృహ హింసా వ్యతిరేక బిల్లుకూ రాని 'దేశ సమైక్యతా 'అనుమానాలు దీనికే ఎందుకు వస్తున్నాయి..? మత కలహాలు జరిగినప్పుడు, రాజకీయ, అధికార వ్యవస్థ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ మైనారిటీల రక్షణ పట్ల ఉదాసీన వైఖరి చూపిస్తున్నాయి అనే దాని ఆధారంగా 'Targeted violence against religious and linguistic minorities bill ' అనేది వస్తుంది. పోలీసులు, అధికారుల ఉదాసీనతకు మొన్నటి ముంబై అల్లర్లనుండి, నిన్నటి గుజరాత్ అల్లర్లలో వరకూ అసంఖ్యాక ఆధారాలు ఉన్నాయి. గుజరాత్లో అనేక ముస్లింల ఊచకోత సంఘటనల్లో , సుప్రీం కోర్టు చెప్పే వరకూ కనీసం కేసులు కూడా నమోదు చేయని విషయం రోజూ పేపర్లు చదివే వారికి అందరికీ తెలిసే ఉంటుంది. ఇక కేవలం మెజారిటీలు మాత్రమే దాడులు చేస్తారా..? మైనారిటీలు చేయరా..? టైపు లాజిక్కులు మాట్లాడే వారికి సమాధానం..
      కొందరు SC,ST లు కూడా అగ్ర వర్ణాల్ని తిడుతారు, అలాగని SC,ST అట్రాసిటీ బిల్లు ఆగలేదు. కొందరు మహిళలు కూడా పురుషుల్ని హింసిస్తారు, అలాగని 'గృహ హింసా బిల్లు రాకుండా ఉండలేదు. ఇదీ అంతే.. ఒకటీ, అరా కేసుల్ని తప్పించి మెజారిటీ సంఘటనల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయి...అదే ప్రజాస్వామ్యం అంటే..

      Delete
    2. మైనారిటీలకు మేలు చేసే రిజర్వేషన్లు, మత హింసా బిల్లు లాంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడల్లా
      --------------------
      అసలు ఇదే పెద్ద జోకు అయినప్పుడు , దాని మీద చర్చ జోకు కావటం లో పెద్ద తప్పేమీ లేదులెండి .

      మత హింసా బిల్లుకు, దేశ ఐక్యత కు ఏంటి సంబంధం
      ------------------------------------
      ఎందుకంటే ఒకసారి మాట ప్రాతిపాదిక జరిగిన విభజన ఇప్పటికే చూసాం కాబట్టి .
      yes ముక్కలు గా ఉన్న చరిత్ర ఈ దేశానికి ఉంది , కానీ ఒకసారి ఒకే దేశం గా ఏర్పడిన తరవాత జరిగిన విభజన మాత్రం మతం ఆధారం గా జరిగిందే .

      Delete
    3. దేశ విభజనని చూశామంటున్నారు. అంటే అప్పటి రాజకీయాలు,దానికి దారి తీసిన పరిస్థితులు..దానిలో ఎవరి పాత్ర ఎంతో.. లాంటివి మీకు తెలిసే ఉంటుందని ఆశిస్తున్నా. ఒకవేళ తెలిసి ఉంటే.. నేను ఈ పోస్టులో ఉదహరించిన జెండా ఎగురవేయడం లాంటి రాజకీయాలు దేశ సమైక్యతకి ప్రధాన కీడు చేస్తాయి తప్ప మైనారిటీలకు ప్రాణ రక్షణ కల్పించే బిల్లులో, రిజర్వేషన్లో కాదన్న సంగతి కూడా తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు.

      Delete
    4. దహరించిన జెండా ఎగురవేయడం లాంటి రాజకీయాలు దేశ సమైక్యతకి ప్రధాన కీడు చేస్తాయి
      ----------------------------
      ఆ జెండా ఎగరవేసిన వాళ్ళని ఇవాళ కాకపొతే రేపన్నా ఎవరన్న సరైనా రీతి లో సత్కారం చేస్తారు . నేను దీన్ని సమర్ధించటం లేదు . దీని కన్నా మత పరమైన రిజర్వేషన్స్ చేసే హాని ఇంకా ఎక్కువ, అది తరతరాలకు ఇదుగో ఇలా చిచ్చు రేపే ద్రోహులని ఇంకా పెంచి పోషిస్తుంది అని నా అభిప్రాయం.

      Delete
    5. సమర్థించనందుకు ధన్యవాదాలు.
      "దేశంలోని అన్ని వర్గాల ప్రజల సమాన అభివృద్ధికి కావలసిన చర్యలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత. ముస్లింలలో తీవ్ర వెనుకబాటు ఉన్నదని జస్టిస్ రాజేంద్ర సచార్, జస్టిస్ రంగనాధ్ మిశ్రా లాంటి కమిటీల సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం వారికి రిజర్వేషన్లు కల్పిస్తే దీనిలో వ్యతిరేకించాల్సింది ఏముంది? -ఇది సుప్రీంకోర్టులో AP రిజర్వేషన్ల కేసు విచారణ సంధర్భంగా అప్పటి చీఫ్ జస్టిస్ -K.G.బాలక్రిష్ణన్ వ్యాఖ్య.
      రిజర్వేషన్ల వల్ల ఓ 4% మంది ముస్లింలకు విద్యా సంస్థల్లో సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. వీరికి ఉద్యోగాలొస్తే దేశ సమైక్యతకి ఏ విధంగా నష్టం కలుగుతుందనేదే అర్థం కాని విషయం.

      ---- ఇదుగో ఇలా చిచ్చు రేపే ద్రోహులని ఇంకా పెంచి పోషిస్తుంది అని నా అభిప్రాయం.---
      ఈ వాదన ఎలా ఉందంటే, "మహిళలు బయట తిరిగితే ఆకతాయిలు ఏడిపిస్తారు కాబట్టి, మహిళల్ని ఇంట్లోనే ఉంచి తాళం వేస్తే ఎలాంటి గొడవ ఉండదు" అన్నట్లుగా..

      Delete
    6. This comment has been removed by a blog administrator.

      Delete
    7. రిజర్వేషన్లను ఎంగిలి మెతుకులతో పోల్చుతూ మీరు రాసిన పై కామెంట్, రిజర్వేషన్లు పొందుతున్న BC,SC,STలు మరియు మహిళలని కించపరిచేదిగా ఉంది కాబట్టి, దానిని డిలీట్ చేస్తున్నాను. పైగా ఇలాంటి కామెంట్లకు సమాధానాలు ఇచ్చే ఉద్ధేశ్యం కూడా నాకు లేదు. సెలవు.

      Delete
    8. హిందూత్వ లాంటి అభివృద్ధి నిరోధక భావజాలాలని వ్యతిరేకించాల్సిందే కానీ మైనారిటీలకి రిజర్వేషన్‌లు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. ముస్లింలలో ఇప్పటికే దూదేకుల, ఖస్సాబ్, రంగ్రేజ్ లాంటి కులాలవాళ్ళకి రిజర్వేషన్‌లు ఉన్నాయి. ఇస్లాం మతంలో కులం అనే కాన్సెప్టే లేనప్పుడు ముస్లింలకి కులం పేరుతో రిజర్వేషన్‌లు ఇవ్వడం అవసరమా? విచిత్రమేమిటంటే ఇస్లాం మతంలో కులం అనే కాన్సెప్ట్ లేదని ఒప్పుకునే అసదుద్దీన్ ఒవైసీ కూడా ముస్లిం రిజర్వేషన్‌లని సమర్థించడం. ఒవైసీ తన మతంవాళ్ళ వోట్ల కోసం ఏమైనా చేస్తాడు.

      పార్శీలూ, యూదులు కూడా మైనారిటీలే కానీ వాళ్ళు హిందువుల కంటే ఆర్థికంగా చాలా ముందున్నవాళ్ళు. పార్శీలూ, యూదులలో ఎక్కువ మంది వ్యాపారులైతే హిందువులలో ఎక్కువ మంది వ్యవసాయదారులు. మైనారిటీ పేరుతో వ్యాపారాలు చేసేవాళ్ళకి రిజర్వేషన్‌లు ఇవ్వగలమా?

      నేను హిందూ మతాన్ని తీవ్రంగా ద్వేషిస్తాను. శూద్రుడు అగ్రకులస్తుని పక్కన కూర్చుంటే అతని నడుము మీద వాతలు పెట్టాలని మనుస్మృతిలో వ్రాసి ఉంది. ఈ విషయం చెపితే మనుస్మృతి ప్రామాణికం కాదు అని వాదించే హిందూత్వవాదులు కూడా ఉన్నారు. అయితే కులం కంటే మనిషిని ఎక్కువగా ప్రభావితం చేసేది ఇంకొకటి ఉంది. అది డబ్బు. కుల వ్యవస్థ, మనుధర్మం గురించి అడిగితే హిందూత్వవాదులు ఎలాగూ సమాధానం చెప్పలేరు, వాళ్ళతో వాదించడం సమయం దండగ. అందుకే నేను ఆర్థిక అంశాల గురించే ఎక్కువగా బ్లాగుల్లో వ్రాస్తుంటాను. చాలా రోజుల తరువాత మీ బ్లాగ్ ఓపెన్ చేసి చూశాను. మీ పోస్ట్ చదివిన తరువాత ఈనాడుకి కులగజ్జితో పాటు మతగజ్జి కూడా ఉందని అర్థమైంది. ఎలాగైతేనేం, మంచి ఆర్టికల్ వ్రాసారు.

      Delete
    9. మనం హిందూత్వని ఎంతైనా వ్యతిరేకించొచ్చు కానీ మైనారిటీలని గుడ్డిగా నమ్మకూడడు. ఈ లింక్ ఓసారి చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/RE8VKSykkrc

      Delete
    10. ప్రవీన్ శర్మ గారూ,

      ఆర్టికల్ బాగుందన్నందుకు ధన్యవాదాలు.
      మీ కామెంట్లలో చాలా విషయాలు జనరలైజ్ చేస్తూ రాశారు. నేను ఏదో ఓ మతాన్ని ద్వేషించాలనో, ఓ ప్రత్యేక వర్గాన్ని ఉద్ధరించాలనో, లేదా ఓ వర్గాన్ని విమర్శించాలనో పని గట్టుకుని బ్లాగు రాయట్లేదు. కానీ రాజకీయాల్లోని అతివాద,విపరీత పోకడల్ని(మతాలు, ప్రాంతాల పేరుతో) మాత్రం అవసరమైనప్పుడు విమర్శిస్తూనే ఉంటాను. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే.. ముస్లిం సమాజంలో అత్యధికులు(అందరూ కాదు) వెనుకబడి ఉన్నారు. వారి మెరుగు కోసం ముఖ్యంగా వారుచేయ వలసింది చాలా ఉంది. (మతాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోవడం, ఆచరించడం, ఆధునిక, స్త్రీ విద్యను ప్రోత్సహించడం లాంటివి..)
      అదే సమయంలో ప్రభుత్వం నుండి కూడా కొంత చేయూత అందివ్వాల్సిన అవసరం ఉంది. దానిలో భాగమే రిజర్వేషన్లు. రిజర్వేషన్లు ఇచ్చినంత మాత్రాన వారందరూ రాత్రికి రాత్రి బాగుపడతారని ఇక్కడ ఏవరూ అనట్లేదు. కాకపోతే.. 'మాకు కూడా చదువుకుంటే ఉద్యొగాలొస్తాయనే' నమ్మకాన్ని ముస్లిం యువతలో కలింగించడానికి, ఫలితంగా డ్రాపవుట్లను తగ్గించడానికి అది తోడ్పడుతుంది.
      ఇక కులాల అధారంగా.. అనే మాటకు వస్తే, AP Govt మొదట కులం ప్రసక్తి లేకుండా ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు కోర్టు దానిని తప్పుపట్టింది. తర్వాత ఓ లూప్ హోల్ గా ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసింది.- టెక్నికల్గా ఇది సరైనదా కాదా అనేదానికంటే, Something is better than nothing అన్నట్లుగా కనీసం కొందరు ముస్లింల కైనా ఇది మేలు చేస్తుంది కాబట్టి, దీనిలో తప్పుపట్టాల్సింది నాకేం కనిపించడంలేదు. మీకు తప్పుగా అనిపిస్తే అది మీ ఇష్టం.
      2వ కామెంట్:
      మైనారిటీల్నే కాదండి.. గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు, ఎవరినీ విమర్శించకూడదు. Thanks.

      Delete
    11. జెనెరలైజేషన్ కాదు. ముస్లిం సమాజం గురించి యోగీందర్ శిఖండ్ అనే సామాజిక శాస్త్రవేత్త వ్రాసిన రచనలు చదివాను. హిందువులలో అగ్రకుల హిందువులు దళితులకి ఎలా దూరంగా ఉంటారో, ముస్లింలలో ముఘల్, పఠాన్ లాంటి ఆర్థికంగా ముందున్న జాతులవాళ్ళు మెహ్తర్, దూదేకుల, ఖస్సాబ్ లాంటి వెనుకబడిన ముస్లింలకి అలాగే దూరంగా ఉంటారు. మన అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలలో ఈ కుల విభజనలు లేవంటాడు కానీ ముస్లింలందరికీ మైనారిటీ ప్రాతిపదికన రిజర్వేషన్‌లు ఇవ్వాలంటాడు. మతం మారినంతమాత్రాన కుల ఐడెంటిటీ పోదు అనుకుంటే దూదేకుల, ఖస్సాబ్, రంగ్రేజ్ లాంటి వెనుకబడిన కులాలకి చెందిన ముస్లింలకి రిజర్వేషన్‌లు ఇస్తే సరిపోతుంది. కుల ప్రస్తావన లేకుండా ముస్లింలందరికీ రిజర్వేషన్‌లు ఇవ్వడం అంటే రిజర్వేషన్‌ల యొక్క పర్పోస్‌ని మార్చినట్టే అవుతుంది.

      Delete
    12. Problem with present india & intellectuals is they think wtever side they know its only the full reality and hence some facts r ignored from other side. Earlier idea of reservations make sense because at that time, SC/ST were the most backward sections in India society and the likes of Ambedkar felt that by giving reservation to them for a limited period of time (about 1 generation), it gives enc ouragement for them and will be able to catch up with rest of the society soon and then the entire Indian society can grow uniformly.

      Thanks to the Congress and its politics and then to V P Singh, the entire concept got screwed up. These stupid politicians even after 100 years will continue to say that we need to uplift SC/ST/OBC/Minorities etc because they really dont do anything for the SC/ST/OBC/Minorities , just treat them as votebanks and use their backward status for their political mileage. We need true leaders who really care for all sections of the society including SC/ST/OBC/minorities. What have these political parties done to bring up the status of muslims in the country.. other than using them as a votebank?

      Some of the facts today r mind blowing ; A reservation eligbility candidate's family has 5 job holders & their children with just 40% marks r still able to get a job due to these reservations & a kid in other upper caste family, especially in brahmin family with poverty arround is not sure of his job and hence forced to take up his own caste job or going for a sub-standard job by stopping his education in between.

      In the name of creating equality and stopping some indesparitites in the societies, govts and political leaders has created more division. if a caste is backward, then give them encouragement to come forward – like free or subsidized tution – or give them like ~5% merit bonus for admission, that will ensure that the they have to work hard to get the benefits. and working hard is the key to uplift a backword class. The current reservation systems just creates more “sarkari jamai (governmental son-in-law)”

      I have seen highly educated guys working in very low cadre jobs and I dont mind if that candidate has no merit , he deserves that position. But I will have an issue if that person is highly educated and deserves a much bigger post than some of the guys who got lesser marks than him and who hold a post higher than him. Thats the dangerous problem thats getting being created in India.

      Caste/religion based Reservations not only divide the society where people who deserved their true merits lost chance feel desciminated , but also causes brain drain where a merit oriented candidate says good bye to India and goes to a country like US where his/her merit is respected. We will continue to hear that most NASA engineers, Pentagon researchers, IBM scientists in US etc are Indians…

      This also ensures that India has a second class knowledge society were the students are happy to get 40% marks in the exams , still get jobs and their next generation will continue to do the same with no fear of job insecurty and they can never really face the competition in the western universities. :) Can the Indian government make foreign institutions like MIT, Stanford etc provide reservations to the backward classes of India?? Don’t the students from backward classes want to study in MIT and Stanford? :):):):) Please ask Indian government to work other coutries to have reservations even in such great educationsal institutions. :)

      Delete
    13. First of all.. this post is not related to reservation as a whole, and I wont be publishing anymore comments related to reservations here, as I dont want the main topic to be diverted/diluted.

      Coming to your comment, equal competition should only be between equals. having same yardsticks to measure both rabbit and tortoise is nothing but ensuring that the tortoise never wins the race. Here, though all people are born with equal intelligence there are many other things which decides a candidate's success in academics/jobs etc, like standards of school/colleges, coaching centers, family's economic support etc.. a student from a rich family who studied in corporate techno schools, narayana/chaitanya IIT integrated colleges etc has definite chances of succeeding, than compared to a poor student who studied in a rural govt school/colleges. If a rich guy failed in a attempt he can opt for going to long term coaching for a yr or two backed with his family support, which a poor student cant do. And the income levels of forward castes is much higher than others, with very few exceptions. In this scenario reservations to the backward people are definitely required , though the implementation mechanism is debatable, to ensure equal opportunities to all.
      my previous essay on reservations -
      http://andamainacheekati.blogspot.in/2011/08/blog-post_26.html

      Delete
    14. And, appreciate your concern about sending backward students to MIT, Stanfords. Keep it up..

      Delete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
    Replies
    1. By.వ్యాఖ్యాతJan 12, 2012 06:50 AM
      (Edited, to remove defamatory names)
      @Durgeswara,
      ఈ టపాలో మాట్లాడిన ఇతర అంశాల సంగతి తరవాత చూద్దాం. అసలు ఈ టపా ఉదహరించిన విషయం మీద మీ అభిప్రాయం చెప్పండి.
      లేదు, నాకవసరమైనప్పుడు ----లాగా పిచ్చి పిచ్చిగా సంబంధం లేకుండా మాట్లాడుతాను అంటే.. ఇంకెం చేస్తాం నోరు ముసుకుంటాం..

      Delete
  3. ద్వేషాన్ని రగిల్చి..అమాయకుల ప్రాణాలు తీయడమే...వారికి కావలిసింది....RSS ..సంఘ్ పరివార్ మరియు దాని అనుభంద సంస్థలని నిషేదించాలి.

    ReplyDelete
    Replies
    1. Yes, Raafsun gaaru,
      SIMI ని నిషేధించినట్లుగానే వీరిని కూడా నిషేధించాల్సిన అవసరం ఉంది. గాంధీజీ హత్య తో పాటు అనేక విద్రోహ చర్యల్లో వీరికి పాత్ర ఉందని చూపించే అనేక ఆధారాలున్నా, కేవలం వీరి 'మంది బలానికి' భయపడి ప్రభుత్వాలు వీటిని నిషేధించడం లేదు. కానీ , 100 జీవాల్ని తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకి చచ్చినట్లు వీరి పాపం పండే సమయం, ఏదో ఒక రోజు రాకపోదు.

      Delete