షాహిద్ - ఓ వెంటాడే జీవిత గాధ
గత వారం ప్రకటించిన 61వ జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకత్వం కేటగిరీల్లో షాహిద్ సినిమా విజేతగా నిలవడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. మానవ హక్కుల కార్యకర్తగా, న్యాయవాదిగా పనిచేసిన షాహిద్ ఆజ్మి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించబడిన ఈ సినిమా, విడుదలైనప్పుడే చాలా గొప్ప సినిమాగా విమర్శకుల ప్రశంసలందుకుంది.
షాహిద్ ఆజ్మీ 1977లో ముంబై లో ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. టీనేజ్ లో ఉన్నప్పుడు, 1992 లో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం ముంబై లో జరిగిన ముస్లిం వ్యతిరేక అల్లర్లను దగ్గరినుండి చూసిన షాహిద్ తీవ్రంగా చలించి పోయాడు. దీనితో ఇంటి నుండి పారిపోయి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తీవ్రవాద సంస్థలో చేరి, కొన్నాళ్ళు ఆయుధాల్ని ఉపయోగించడంలో శిక్షణ పొందాడు. కానీ, అమాయకుల్ని అమానుషంగా పొట్టనపెట్టుకునే టెర్రరిజం కూడా సరైన విధానం కాదని తెలుసుకున్న షాహిద్, అక్కడి నుండి తప్పించుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు. అనంతరం , ఓ పట్టు బడిన తీవ్రవాది వద్ద దొరికిన సమాచారం ఆధారంగా పోలీసులు షాహిద్ ని టాడా చట్టం కింద అరెస్టు చేసి తీహార్ జైలుకి తరలించారు. ఏడేళ్ళు తీహార్ జైల్లో గడిపిన షాహిద్ అక్కడే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. జైలు నుండి విడుదలయ్యాక, చేయని నేరానికి జైల్లలో మగ్గుతున్న అనేక మంది నిర్భాగ్యుల్ని రక్షించాలనే లక్ష్యంతో షాహిద్ న్యాయవాద విద్యను అభ్యసించాడు. ముంబై లో ప్రముఖ క్రిమినల్ లాయర్ మాజిద్ మీనన్ దగ్గర కొన్నాళ్ళు సహాయకుడిగా పని చేసిన అనంతరం 2003 లో తానే సొంతంగా ప్రాక్టీసు మొదలు పెట్టాడు. ఎక్కడ బాంబు దాడులు జరిగినా పోలీసులు కొందరు మైనారిటీ యువకుల్ని హడావుడిగా అరెస్టు చేసి తాము కేసును ఛేదించామని ప్రకటించేయడం, అది పూర్తిగా యదార్థమన్నట్లుగా మీడియా మొత్తం వారిని తీవ్రవాదులుగా భావిస్తూ వార్తలు రాయడం, గత దశాబ్ధంలో అనేక కేసుల్లో జరిగింది. షాహిద్ ఈ కేసుల్ని క్షుణ్ణంగా పరిశీలించేవాడు. నిందితులు అమాయకులని తనకు నమ్మకం కుదిరాక వారి పక్షాన పోరాడటానికి ముందుకు వచ్చేవాడు. 2002 ఘట్కోపర్ బస్ బాంబు కేసు, 2006 ఔరంగాబాద్ కేసు, మాలేగావ్ కేసు, 2007 ముంబై లోకల్ ట్రైన్ కేసు వంటి అనేక కేసుల్లో అమాయక నిందితుల పక్షాన వాదించి, వారు నిర్దోషులుగా విడుదల అవ్వడంలో కీలక పాత్ర పోషించాడు. వీరిలో చాలామంది కనీసం బెయిలు అప్లికేషన్ రుసుము కూడా చెల్లించుకోలేని పేదలే. వీరి నుండి ఏమాత్రం ఫీజు ఆశించకుండా షాహిద్ వీరి పక్షాన పోరాడాడు. షాహిద్ సాగిస్తున్న ఈ నిస్వార్థ పోరాటం కొందరు మతోన్మాదులకి కంటగింపుగా మారింది. తీవ్రవాద కేసుల్లో నిందితుల తరుపున వాదించడం మానుకోవాలని అతనికి రోజూ బెదిరింపు ఫోన్లు వస్తుండేవి. అయినా ఏ మాత్రం చలించకుండా షాహిద్ తన పని తాను చేసుకు పోతుండేవాడు. చివరికి 2008 ముంబై పై దాడి కేసులో, కసబ్ బృందానికి సహకరించాడనే ఆరోపణ మీద అరెస్టు కాబడిన ఫాహీం అన్సారీ తరపున వాదిస్తున్నప్పుడు, షాహిద్ ఆజ్మీని అతని ఆఫీస్ లోనే కొందరు దుండగులు కాల్చి చంపారు. ఇది జరిగిన 2 సంవత్సరాల తర్వాత , 2012 లో భారత సుప్రీంకోర్టు ఫాహిం అన్సారి ని నిర్దోషిగా విడుదలచేసింది. ఈ విధంగా ఏడేళ్ళ తన న్యాయవాద జీవితంలో మొత్తం 17 కేసుల్లో నిందితుల్ని నిర్దోషులుగా విడుదల చేయించడం ఓ అద్భుతం. ఇన్ని ఆటుపోట్లని ఎదుర్కొని, ఇంతటి విజయాలను సాధించిన షాహిద్ వయసు మరణించేనాటికి కేవలం 33 సంవత్సరాలే. షాహిద్ మరణం న్యాయదేవతకి తీరని లోటని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. కళియుగాంతం నాడు, భగవంతుడు సమస్త ప్రాణుల్ని తిరిగి పుట్టిస్తాడనీ, అప్పుడు భూమిపై వారు చేసిన తప్పొప్పుల పట్టిక ప్రకారం వారికి స్వర్గమో, నరకమో నిర్దేశింపబడుతుందనీ చెప్తుంటారు. అదే నిజమైతే, అప్పుడు కొందరు తాము చేసిన తప్పుల్ని తలుచుకుని నరక భయంతో వణికి పోతుంటారు. మరికొందరు తాము చేసిన మంచి పనులకు కలగబోయే స్వర్గ సుఖాలకోసం ఆతృతతో ఎదురు చూస్తుంటారు. కానీ కొందరు మాత్రం, తమకివేమీ పట్టనట్టు భూమిపై తమ కళ్ళముందు జరిగిన అనేక అన్యాయాలు, అక్రమాల గురించి దేవున్ని నిలదీయాలని కళ్ళల్లో ఎర్రని జీరతో, దేవుని వైపు వడివడిగా అడుగులు వేస్తుంటారు. అలాంటి వారినే షహీద్ (అమరుడు) లంటారు. ఇంతటి గొప్ప జీవితాన్ని యధాతదంగా తెరకెక్కించిన దర్శకుడు హన్సల్ మెహత, షాహిద్ పాత్రలో జీవించిన రాజ్ కుమార్ యాదవ్ లు మిక్కిలి ప్రశంసార్హులు.