Saturday, November 13, 2010
మా ఆత్మగౌరవానికి భంగం కలిగిందోచ్!!!
"మా ఆత్మగౌరవానికి భంగం కలిగింది" - ఇది ఇటీవల AP లో తరచుగా వినిపిస్తున్న మాట. 'మాకు లాటరీ టికెట్ తగిలిందోచ్!' అన్నంత ఆనందంగా నాయకులు మా ఆత్మగౌరవానికి భంగం కలిగింది అని అనౌన్స్ చేసేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అనౌన్స్ చేయడానికి పోటీ పడుతున్నారు.ఇక అసలే కాంపిటీషన్ ఎక్కువై, 24గంటలూ చూపించటానికి న్యూస్ లేక ఆకలితో ఆవురావురుమంటున్న న్యూస్ ఛానల్స్ వారు,ఆత్మగౌరవం గురించి ఎవరు ఎత్తుకున్నా,రెక్కలు కట్టుకొని వారిముందు వాలిపోయి,వారికి ఫుల్ పబ్లిసిటీ ఇచ్చేస్తున్నారు.CM వేరే ప్రాంతం వ్యక్తి కాబట్టి,మా ప్రాంతం వారి ఆత్మగౌరవం దెబ్బతినింది అంటాడు ఒకడు. మా ప్రాంతంలో హైకోర్టు బ్రాంచి లేదు కాబట్టి మా ప్రాంతం వారి ఆత్మగౌరవం దెబ్బతినింది అంటాడు మరొకడు(అదేదో,IIT/AIRPORT లేదన్నట్లుగా).ఓ విగ్రహాన్ని ఎవరో ఏదో చేశారని,మా కులపోళ్ల ఆత్మగౌరవం దెబ్బతినింది అంటాడు ఇంకొకడు.రోడ్లమీద ధర్నాలు,రాస్తారోకోలూ చేస్తూ,ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న మా వాల్లని పోలీసులు ఇరగ్గొట్టి,జైల్ లో వేయడంతో మా ఆత్మగౌరవం డ్యామేజీ అయ్యిందంటాడు మరో విద్యార్థి నాయకుడు.నిజాం ని ఎవరైనా తిడితే మా ఆత్మగౌరవాన్ని బద్నాం చేసినట్లే అంటాడు ఓ మత నాయకుడు. ఇలాంటి న్యూస్ చూసీ చూసీ, ఈ మధ్య నాకో అనుమానం మొదలైంది. అసలు ఆత్మగౌరవం అంటే ఏమిటి? అది ఉందో,లేదో తెలుసుకోవడం ఎలా? ఒకవేళ ఉంటే, ఎంత ఉందో కొలవడం ఎలా? BP,షుగర్లు చెక్ చేయడానికి మెడికల్ టెస్ట్ లు ఉన్నట్లే,ఆత్మగౌరవం కొలవడానికి కూడా ఏదైనా పరీక్ష ఉంటే బాగుండేది. అప్పుడు,ఆత్మగౌరవానికి భంగం కలిగింది అనే వాల్లందరికి ఆ పరీక్ష చేసి,ఎవరికి ఎంత భంగం కలిగిందో చెప్పే వీలుండేది. అట్లే, ప్రతీ సంవత్సరం నంది అవార్డుల్లాగా ఆత్మగౌరవ అవార్డులు కూడా కండక్ట్ చేసి, ప్రాంతాల,కులాల,మతాల వారీగా ఆత్మగౌరవ పిత, ఆత్మగౌరవ రత్న లాంటివి ప్రదానం చెస్తే మరీ బాగుంటుంది.అలాంటి టెక్నాలజీ త్వరగా రావాలని కోరుకుందాం. -జై ఆత్మగౌరవం.
Subscribe to:
Post Comments (Atom)
Excellent -- Naresh
ReplyDeleteThanks for the compliment,Naresh
ReplyDelete