ఎదుటివాడు ఎంత సున్నితమనస్కుడు అని అంచనావేసే ఓపిక,వివేచన లేకుండా, ఎదుటివాని బాధను కూడా ఎంజాయ్ చేసే శాడిజం ఉన్న సీనియర్లు..
పుట్టిన మరుక్షణమే, ప్లే స్కూల్ ఫీజ్ నుండి,పెద్దయ్యాక విదేశాల్లో ఉన్నత చదువులకు అవసరమైన ఖర్చులు కూడా లెక్కగట్టి, దానికి తగ్గట్లు పాలసీలు కట్టే నాన్న,పిల్లలపెంపకం గురించి పుస్తకాలు చదివి మరీ ప్రిపేర్ అయ్యే అమ్మ, ఉంటే,గింటే మరో అన్నో,చెల్లో.. వీరు తప్ప ఇంకో ప్రపంచం అంటూ తెలీకుండా చిన్న కుటుంబాల్లో, అతిసున్నితంగా,ప్రొటెక్టివ్ గా పెరిగిన జూనియర్లు...
వీరివల్ల, ర్యాగింగ్ అనేది ఓ సామాజిక రుగ్మతగా మారి, పరిస్థితి హత్యలు, ఆత్మహత్యల వరకూ వెల్లడంతో..ప్రభుత్వం దానిని పూర్తిగా రూపుమాపటానికి ప్రయత్నిస్తుంది. అంతకు మించి వేరే మార్గం కూడా లేదు. కానీ,కొన్నేల్ల క్రితం వరకూ ర్యాగింగ్ అంటే, అప్పటివరకూ పుస్తకాలతో కుస్తీ పట్టి, వృత్తి విద్యాకోర్సుల్లో సీట్ సాధించిన విద్యార్ధికి, సిగ్గూ,బిడియం లాంటివి పోగొట్టి, చాలా సరదాగా, సీనియర్లతో చక్కటి పరిచయాలు పెంపొందించుకోవటానికి ఓ మార్గంగా ఉండేది. సీనియర్లు ర్యాగింగ్ లో చెప్పించే మాటలు,చేయించే పనులు, ఆ సమయంలో కొంచెం ఇబ్బందిగానే ఉన్నా ఆ తర్వాత ఎప్పుడైనా గుర్తుకు తెచ్చుకుంటే చాలా నవ్వు తెప్పిచ్చేలా ఉండేవి. నా అనుభవంలో ఉన్న అలాంటి కొన్ని సరదా ఞాపకాలను మీతో పంచుకుంటాను..
ఓ రోజు, నన్ను, మా రూమ్మేట్ కిరణ్ ని సీనియర్లు మెస్ దగ్గర అటకాయించి ,SD(సొంత డబ్బా) చెప్పమన్నారు.
మారూమ్మేట్ తన పేరు చెప్పి, వూరు నెల్లూర్ అన్నాడు. ఆ తర్వాత, నెల్లూర్ తో కాస్త పరిచయం ఉన్న ఓ సీనియర్ తో కిరణ్ సంభాషన ఇలా సాగింది.
సీనియర్: నెల్లూర్లో ఎక్కడ్రా మీ ఇల్లు?
కిరణ్: సార్, నెల్లూర్ జిల్లాలో గూడూర్ సార్..
సీ: గూడూర్లో ఎక్కడ్రా మీ ఇల్లు?
కిరణ్: గూడూర్ దగ్గర పొదలకూర్ సార్..
సీ: పొదలకూర్లో ఎక్కడ?
కిరణ్:పొదలకూర్ పక్కన తూర్పుకోండ్ల అనే వూరు సార్..
సీ (కొంచెం ఇరిటేషన్ తో) : ఒరే ఎక్కడో.. తూర్పుకోండ్ల నుంచి ఎర్రబస్సు ఎక్కి వచ్చి, ఇక్కడ నెల్లూర్ అని బిల్డప్పు కొడుతున్నవా..? ఐనా సొంత ఊరి పేరు చెప్పుకోడానికి నామోషీనారా నీకు? ఇంకో సారి ఎవరైనా అడిగితే ఉన్నది ఉన్నట్లు చెప్పు, ఎగస్ట్రాలొద్దు..
ఆ తర్వాత, మరుసటిరోజే మరో బ్యాచ్ సీనియర్లు మెస్ దగ్గర మమ్మల్ని అటకాయించి, SD చెప్పమన్నారు. అప్పుడు మా కిరణ్ తో సీనియర్ల సంభాషన ఇలా సాగింది.
కిరణ్: నా పేరు కిరణ్. మా వూరు తూర్పుకోండ్ల.
సీ : తూర్పుకోండ్ల..? అదెక్కడుందిరా..?
కిరణ్: పొదలకూర్ మండలంలో సార్..
సీ: పొదలకూరా..? అదెక్కడుంది..?
కిరణ్: గూడూర్ తాలుకా సార్..
సీ: గూడూరా..? అదెక్కడ?
కిరణ్: నెల్లూర్ జిల్లా సార్..
సీ(ఇరిటేషన్ తో) : ఒరే, నెల్లూర్ అని చెబితే ఒక్క మాటలో ఐపొయేది కదరా..? SD అడిగిన పాపానికి ఇంతలా టార్చర్ పెట్టాలా..? ఆ చెప్పడం చూడు.. తూర్పుకోండ్ల అంట, అదేదో న్యూయార్క్ సిటీ నుంచి వచ్చానన్నట్లు..
మా కిరణ్ పరిస్థితికి, ఎంతగా ఆపుకోవల్లన్నా కుదరక, నేను తల వంచుకొని నవ్వుతుంటే, ఒరే ఇక్కడ ఇంతమంది సీనియర్లు ర్యాగింగ్ చేస్తుంటే, ఏ మాత్రం భయంలేకుండా నవ్వుతున్నవా..? అని వాన్ని వదిలేసి నన్ను సెంటర్ చేశారు... నేను చేసిన ఈ ఘోర అపరాధానికి ఏం శిక్ష వేయాలనేదానిమీద కాసేపు వాల్లలో వాల్లు తర్జనభర్జన పడ్డారు. 'సపోటా' మేడంకి లవ్ లెటర్ రాయిద్దామన్నాడొకడు.(అతని మనసులో కోర్కెని నా ద్వార తీర్చుకుందామనేమో.?) , వీల్ల క్లాస్ లో ఎవరో ఓ అమ్మాయి తో వీడికి లవ్ లెటర్ రాయించుకొని రమ్మందామన్నడొకడు.. (ఈ ఐడీయా ఏదో బాగుంది అనుకున్నా, మనసులో) ..ఇలా కొన్ని ఆప్షన్స్ అనుకొని, చివరికి ఒకటి ఖాయం చేసేశారు. అది- ఓ వారం రోజుల పాటు, ప్రతిరోజూ పొద్దున క్లాసెస్ స్టార్ట్ కావడానికి ఓ 5 నిమిషాలు ముందు, వారి క్లాస్ లోకి వెల్లి,ఇంగ్లీష్ లో ఓ జోక్ చెప్పి అందరిని నవ్వించాలి. ఎప్పుడూ గుంపులో కూర్చుని గోల చేయడమే తప్ప, స్టేజీలపైన, కొత్తవారి ముందు మాట్లాడటం మన హిస్టరీలోనే లేదు. అది కూడా ఇంగ్లీష్ లో చెప్పాలంట.. మనదేమో ఒకటో కిలాసు నుంచి ఇంటర్ వరకూ ప్రభుత్వ స్కూల్లలో, ప్యూర్ తెలుగు మీడియం చదువు. ఆ రోజుల్లో నేను ఇంగ్లీష్ సీరియస్ గా మాట్లాడితేనే వినేవాల్లు తెగ నవ్వేసేవారు. ఇక జోక్ చెబితే ఎలా ఫీల్ అవుతారో..? పైగా,అసలే సీనియర్ల కంటపడకుండా ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్న టైంలో, నాకు నేనే వారి క్లాస్ రూంలోకి వెల్లి జోక్ చెప్పడం...ఏమి నా ఖర్మము అనుకుంటూ, పాత వారపత్రికలు ముందేసుకొని , ఈజీగా ఉన్న జోకుల్ని ఇంగ్లీష్ లోకి అనువదించుకొని,కంఠతా పట్టేసా. మొదటిరోజు సీనియర్ల క్లాస్ లోకి అడుగుపెట్టడం.. వాల్లందరూ నా మీద జోకులేసుకొని పగలబడి నవ్వడం వరకైతే గుర్తుంది కానీ, నేనేం చెప్పానో నాకే తెలీలేదు.. అలా ఆ ఆరు రోజులూ ఆరు ప్రహసనాలుగా గడిచిపొయాయి. కానీ, నాకున్న 'స్టేజ్ ఫియర్ ' ని జయించడంలో మాత్రం అది బాగా హెల్ప్ అయింది...
బాగుంది మీ ర్యాగింగ్ experience !
ReplyDeleteమీరు "కానీ,కొన్నేల్ల క్రితం వరకూ ర్యాగింగ్ అంటే, అప్పటివరకూ పుస్తకాలతో కుస్తీ పట్టి, వృత్తి విద్యాకోర్సుల్లో సీట్ సాధించిన విద్యార్ధికి, సిగ్గూ,బిడియం లాంటివి పోగొట్టి, చాలా సరదాగా, సీనియర్లతో చక్కటి పరిచయాలు పెంపొందించుకోవటానికి ఓ మార్గంగా ఉండేది." ఇలా పాజిటివ్ గా ఆలోచించటం ఇది ఇంకా నచ్చింది నాకు.
btw నలుపు మీకు ఇష్టమైనా కలరు అయ్యిండచ్చు కాని నలుపు background లో చదవటం కొద్దిగా కష్టమనుకుంటా :)
brother u can launch a mini weekly magazine
ReplyDeleteRAGGING MUCHATLU-1 ante inka vunnaya???????
ReplyDeleterakta charitra influence tho 1 2 3 ani pettava brother ????
ReplyDelete@Sravya Vattikuti:
ReplyDeleteThanks for the comment.yah.. its true and I too observed that the font and background is not much reader friendly. 'll definatly try to change my blog's appearence.
@Anonymous1: Thanks brother.. :-)
@Anonymous2: yah.. inka chaala unnai.. cheyinchukunnavi.. chesinavi.. but not sure when I can put them on paper..(keyboard..)
@Anonymous3: wow.. title baagundi.. 'raaging charitra-1' ani pettiundaalsindi nenu.. next time nunchi ide follow avutha..Thanks ;-)