Monday, February 14, 2011

ప్రాణం ఖరీదు!!!

ఇటీవల ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా 'No one killed Jessica' అనే సినిమా వచ్చింది. 1999 లో, అర్థరాత్రి టైం దాటి పోవటం వల్ల లిక్కర్ అమ్మడానికి నిరాకరించిన పాపానికి, ఓ హర్యానా మంత్రి కొడుకు చేతిలో హత్యకావించ బడిన 'జెస్సికా లాల్ ' ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. సుమారు 300 మంది ఉన్న ఆ పార్టీలో, అంత మంది ప్రత్యక్ష సాక్షుల కల్ల ముందే ఈ హత్య జరిగినప్పటికీ, మంత్రి గారి డబ్బు,అధికారానికి భయపడి ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాకపోవటంతో, క్రింది కోర్టు మంత్రి గారి కొడుకును, అతనికి సహకరించిన అతని మిత్రుల్ని నిర్దోషులుగా విడుదల చేసింది. ఆ తర్వాత NDTV మరియు ఇతర జాతీయ మీడియా 'ఓ అమ్మాయి ప్రాణం ఖరీదు, ఓ లిక్కర్ బాటిల్ తో సమానమా..? అంటూ దీనికి విషేశ ప్రాధాన్యం కలిగించడంతో, ప్రజాభి ప్రాయానికి తలవంచిన హైకోర్టు కేసును పునర్విచారన చేసి, మంత్రి కొడుకుకి యావజ్జీవ శిక్ష విధించటం జరిగింది.ఇలా ఏ తప్పూ చేయకపోయినా, అర్ధాంతరంగా తనువు చాలించిన జెస్సికా మీద మొదట్లో చాలా సానుభూతి కలిగినప్పటికీ, నేరం చేసిన వాడు మంత్రి కుమారుడైనా చట్టం అతడిని శిక్షించగలిగిందనే  తృప్తి కలిగేలా ఈ సినిమా రూపొందించబడింది. మీడియా చివరివరకూ పోరాడటం వల్ల జెస్సికా మృతికి బాధ్యులైన వారిని చట్టం శిక్షించగలిగింది. కానీ ఈ మాత్రం అవకాశం కూడా లేని దురదృష్ట జెస్సికాలు ఇంకెంత మంది ఉన్నారో..?
#కొన్నేల్ల క్రితం సినీ హీరో బాలక్రిష్ణ ఇంట్లో కాల్పుల ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత, బాలక్రిష్ణ ఇంటి వాచ్ మేన్ హత్య చేయబడ్డాడు. కొన్ని రోజులు హడావుడి చేసిన తెలుగు మీడియా తర్వాత ఈ విషయాన్ని అటకెక్కించేయటం తో, ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలీదు.ఇక్కడ ఒక పేద వాచ్ మేన్ ప్రాణం ఖరీదు ఎంతో ఎలా చెప్పడం..?
#మొన్న ముంబై మీద 11 మంది తీవ్రవాదులు చేసిన దాడిలో సుమారు 200 మంది అమాయకులు మరణించారు. ఆ తర్వాత భద్రతా దలాల చేతిలో 10 మంది తీవ్రవాదులు హతమయ్యారు. అంటే ఒక్కో తీవ్రవాది ప్రాణం ఖరీదు 20 మంది ప్రాణంతో సమానమా..? ఇక్కడ బాధితులకి పూర్తి న్యాయం జరిగిందనుకోవాలా..? మరి అన్యాయానికి  బాధ్యులు ఎవరు..?
#అట్లే ప్రతినిత్యం ఎంతో మంది అమాయకులు బూటకపు ఎన్కౌంటర్లలోనూ,ఇంఫార్మర్లు,కోవర్టులనే  నెపంతోనూ, కాష్మీర్ లాంటి చోట్ల భద్రతాదళాలు,టెర్రరిస్ట్ ల చేతుల్లో అసువులుబాస్తున్నారు. మరి వీరందరి చావులకూ అకౌంటబిలిటీ ఉంటుందా..? వీరి ప్రాణాలకు విలువ లేదా..?
#మొన్నటికి మొన్న, సామూహిక జనహనన ఆయుధాలున్నాయనే నెపంతో, అగ్రరాజ్యాలు ఇరాక్ మీద చేసిన అక్రమ యుద్ధంలో మరణించిన వేలకొద్దీ అమాయక ప్రజలకు, అవిటివాల్లైన పసిపిల్లలకు న్యాయం చేసేదెవరు..? మేమనుకున్నట్లు అక్కడ మరు భూములు తప్ప, మారణాయుధాలు లేవు, చిన్న పొరబాటు జరిగింది అని అమెరికా అధ్యక్షులవారు ఇచ్చిన వివరణ, పోయిన ప్రాణాలకు ఖరీదు కట్టగలదా..?

7 comments:

  1. Questions are OK. what about answers..?

    ReplyDelete
  2. mee drushtilo nyaayam ante yemiti?

    ReplyDelete
  3. ఇరాక్ లో అన్యాయం ప్రపంచానికి తెలిసి జరిగింది.. కాని ఇక్కడ అన్యాయం ప్రపంచానికి తెలియకుండా జరుగుతూనే ఉంది .. మరి వీళ్ళ మీద దాడులను, అత్యాచారాలను ఆపేదెవరు? అస్సలు వీళ్ళ మీద ఇలా అత్యాచారాలు జరగటానికి కారణం అవుతున్న కారణాలు ఏమిటి? ఏ మత సంస్థలు వీటి వెనకాల ఉన్నాయి?

    http://forumforhinduawakening.org/articles/id/awakening/misconceptions/murder-and-jihad-the-destruction-of-bangladesh-s-hindus#a_3

    ReplyDelete
  4. ప్రపంచానికి తెలిసి జరిగే అన్యాయాన్నే అడ్డుకునే దిక్కు లేదు. ఇక తెలియని అన్యాయాల్ని ఆపడం ఎలా..? మెజారిటీలు, మైనారిటీలపై దాడులకు దిగడం వారి అస్తిత్వాన్ని/సంస్కృతిని నాశనం చేయడం అనేవి ఆటవిక లక్షణాలు. కానీ బలాబలాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తీ తనకు నచ్చిన మతాన్ని,సంస్కృతిని జీవన విధానాన్ని పాటించే అవకాశం కల్పించటం ఆధునిక/ప్రజాస్వామ్య లక్షణం.
    ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని కొంతమంది ఎదవలు మైనారిటీల అస్థిత్వాన్ని రూపుమాపాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ఎదవలు బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో,శ్రీలంకలో,చివరికి మన భారతదేశంలో.. ఇలా అన్ని చోట్లా ఉన్నారు. మతాల గురించి కాకుండా మనుషుల గురించి బాధపడే రోజులు వచ్చినప్పుడే ఇలాంటి వాటిని కొంత వరకు అడ్డుకోగలం.

    ReplyDelete
  5. mee drushtilo nyaayam ante yemiti? mallee aduguthunnanu? BalaKrishna intlo,Mumbai lo, Kashmir lo Jaruguhtunna daaniki nyaayam yem jaragaalani anukuntunnaru?

    ReplyDelete
  6. @Above anonymous:
    న్యాయానికి నాకంటూ స్పెషల్ డెఫినిషన్ ఏమీ లేదు.గీత,బైబిల్,ఖురాన్ వీటిలో ఏదినచ్చితే అది ఓ సారి తిరగేసుకోండి, న్యాయం అంటే ఎంటో తెలుస్తుంది.(వ్యాకరణ బేధాలు తప్ప,కాన్సెప్ట్ అన్నిట్లో ఒకటే ఉంటుంది).మీరు దేవున్ని నమ్మని నాస్తికులైతే -"పక్కనున్నోల్లు మిమ్మల్ని పట్టుకొని ఇరగకుమ్మనంత వరకూ,మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే న్యాయం."
    అనామకుల(అనానిమస్) ఒన్ లైన్ కామెంట్లకు ఇంతకంటే ఎక్కువ వివరణ ఇచ్చే ఉద్దేశ్యం లేదు. ఇంకా కావాలంటే, న్యాయం గురించి మీరేమనుకుంటున్నరో వివరంగా రాయండి, తర్వాత మాట్లాడ్దాం...

    ReplyDelete
  7. @Nyaayaaniki definition:
    కామెడీ గా/వెటకారంగా చెప్పినా, బాగా చెప్పారు.

    ReplyDelete