Thursday, April 3, 2014

'కొనిదెల' కాదు, 'కరివేపాకు' కరెక్టు.

'కొనిదెల' కాదు,  'కరివేపాకు'  కరెక్టు.
వీడికి  తిక్కుందని అందరికీ తెలుసు కానీ, అది ఈ రేంజ్ లో ఉందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది.  ఇక వీడి తిక్క వెనకాల ఉన్న లెక్కలేమిటో  చంద్రబాబుకు, రామోజీరావుకే తెలియాలి.  ఎందుకంటే వీడి తిక్క వాగుడు అంతిమంగా వీరికి మాత్రమే ఉపయోగకరంగా ఉంది కాబట్టి.  ఏప్రెల్ ఫూల్స్ డే రోజున  ఈనాడు పత్రికలో వీడి తిక్క ఇంటర్యూ  అర పేజీ నిండా వచ్చింది.  మొత్తానికి దాని సారాంశం ఏంటంటే,  కాంగ్రెస్సు, జగన్,కె.సి.ఆర్.కమ్యూనిస్టులు  వీల్లంతా వేస్ట్,    ఇక్కడ చంద్రబాబు, అక్కడ మోడీ  వీల్లిద్దరే నిఖార్సైన నాయకులు.   వీడి తిక్క లాజిక్కులు ఏ రేంజ్ లో ఉన్నాయో వీడిచ్చిన ఒక ఆన్సర్ ని బట్టి చెప్పేయొచ్చు.
ప్రశ్న:  మోడీ పై మతవాద ముద్ర ఉంది కదా. ఆయనకు ఎలా మద్దతిచ్చారు?
తిక్కోడి సమాధానం:  నా దృష్టిలో కాంగ్రెస్ కంటే మోడీ యే నిజమైన లౌకికవాది. నేనొక దిక్కుమాలిన సినిమా షూటింగ్ కోసం  గుజరాత్ వెల్లినప్పుడు, అక్కడ ఒక హోటల్ లో బస చేశాను. దాని యజమాని ఓ ముస్లిం.  ఆయనతో మాట్లాడిన సంధర్భంలో  ఆయన మోడీ మహాత్ముడని చెప్పారు.   ఇక మోడీ  సెక్యులరిస్టని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి.
అదీ విషయం.  గుజరాత్లో  బిజినెస్ చేసేవాల్లు ఎవరైనా అక్కడ పదేళ్ళనుండీ  ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతారా? మాట్లాడి సుఖంగా బతక గలుగుతారా? మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా, పైకి మాత్రం అంతా బాగుందనే అంటారు.  మన తిక్కోడికి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటే కదా.  ఇంకా నయం.  గాంధీ కంటే గాడ్సే గొప్ప వాడనీ, గాంధీని  చంపి అతను చాలా మంచి పని చేశాడనీ చెప్పే  ఖాకీ  నిక్కర్ బ్యాచ్ వాల్లు  కూడా దేశంలో చాలా మంది ఉన్నారు.    మన తిక్కోడు అలాంటి వారితో మాట్లాడి  మన జాతిపిత గాంధీ కాదు, గాడ్సే  అనే స్టేట్మెంటు ఇచ్చేయలేదు.
ఇట్టాంటి దేడ్ దిమాఖ్ గాడి సినిమా టిక్కెట్లకోసం ఎగబడిన నా గత చరిత్ర మీద నాకే కంపరం పుడుతుంది.
అప్పట్లో వీల్ల అన్న పార్టీ పెట్టాడు, అది ఓట్ల  చీలికకు దారితీసి యై.యస్.ఆర్ కి ఉపయోగపడింది.
ఆ పార్టీని తీసుకెల్లి కాంగ్రెస్ లో కలిపాడు, అది  జగన్ దెబ్బకు పడిపోతున్న ప్రభుత్వాన్ని కాపాడు కోవడానికి సోనియాకు ఉపయోగపడింది.
ఇప్పుడు  ఈ మేధావి పెట్టిన పార్టీ ఎవరి ఉపయోగం కోసమో  తెలుస్తూనే ఉంది.  అందుకే వీల్ల ఇంటి పేరు 'కొనిదెల ' కాకుండా 'కరివేపాకు ' అని ఉంటే బాగా సూటవుద్దేమో అనిపిస్తుంది.

3 comments:

  1. Light travels faster than sound. This is why some people appear bright until you hear them speak అనంటారు. పవన్ చదువరి, మేధావి అని నేను ఆయన అభిమానుల నుంచి విన్నాను. పార్టీ పెట్టిననాడు ఆయన చేసిన ప్రసంగం చూస్తే పైన చెప్పిన కూయనంతవరకే కాకికీ, కోకిలకీ అభేదం అన్నవిషయం నిజమనిచెప్పడానికి మరో ఉదాహరణ దొరికిందనుకున్నాను.

    పోతన పద్యాల్లో, తిలక్ కవితల్లో అంతటి విప్లవావేశం ఉందని నాకు పవన్ చెప్పేంతవరకూ తెలీనేలేదు! తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో కేకలెయడమా వక్తృత్వమంటే? రాజకీయ పార్టీ మేనిఫెస్టోల్లో అతి ప్రధానమైనవి ఆర్ధిక విధానాలని అభిప్రాయం. అసలు వాటి ప్రస్థావనే లేకుండా పవన్ ప్రసంగాలన్నీ సాగుతాయి. ఆయన ప్రసంగాలు అవినీతి నిర్మూలన, మహిళాజన రక్షణల అవశ్యకతలను ప్రస్తావిస్తూ స్వఛ్ఛంద సేవా సంస్థల్లో నడిచే ప్రసంగాల్లా నడుస్తాయేగానీ రాజకీయ, ఆర్ధిక విధానాల ప్రస్థావన మచ్చుకైనా కనబడదు (ఒక్క కాంగ్రెస్ వ్యతిరేకత మినహా (which looks more like a personal vendetta). ఆయన ISM పుస్తకం రాంగోపాల్ వర్మ పుస్తకానికి మరో versionలా కనిపిస్తుందేగానీ విధానాల ప్రకటనగా అనిపించదు. ప్రతి fullstopకూ చప్పట్లుకొట్టే అభిమానుల్లో ఎంతమందికి ISMలోని మాటలు అర్ధమయ్యి ఆయన పార్టీ అభిమానులుగా మారారో, ఎంతమంది 'కాపు'లుకాబట్టీ, సినిమా నటుడుకాబట్టీ పార్టీ కార్యకర్తలయ్యారో ఎవరికి తెలుసు?

    తెలంగాణా ఏర్పాటు గురించి చంద్రబాబును మించిన స్థాయిలో పల్టీలుకొడుతున్నాడు. ఒకప్రక్క తెలంగాణా ఏర్పాటు సంతోషమంటాడు. ఇంకోప్రక్క కాంగ్రెస్ నాయకత్వం 'ఫలానా' పనిచేసుంటే తెలంగాణా ఏర్పడేదే కాదనంటాడు (అంటే తెలంగాణా ఏర్పాటు కూడని పరిణామమనే అర్ధం వస్తుందికదా). తెలంగాణా వాదులతో తకరారు పెట్టుకోవడం ఆయనకు ఇష్టంలేదన్న విషయం ఆయన ప్రసంగాల్లో స్పష్టంగానే అర్ధమౌతుంది. అలాగే సీమాంధ్రులను వదులుకోకూడదన్నదికూడా.

    సరిగ్గా గమనించడి. పవన్ మోదీతో కలవకముందున్నంత వ్యతిరేకత మోదీతో చేతులు కలిపాక ప్రస్తుతం బ్లాగావరణంలో మోదీత్వవాదులనుండి కనబడడంలేదు. ఒక్కసారిగా పవన్ ఆలోచనల్లో స్పష్టత, దూరదృష్టి, ఇంకా ఏవేవో కనబదుతున్నాయి చాలా మందికి.

    ReplyDelete
    Replies
    1. @Sree naadh
      Thanks for the nice comment. కమ్యూనిస్టు చేగువేరా ఫోటో పెట్టుకుని కమ్మ్యూనలిస్టు, క్యాపిటలిస్టులకు వంత పాడుతుండడంలోనే పి.కె. మాటల్లోని డొల్లతనం బైటపడుతుంది. ఇక అతనికి జై కొడుతున్న అభిమానుల అవగాహన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరన్నట్లు మోడీ పంచన చేరాక వచ్చిన మార్పు కూడా నిజమే.

      Delete
  2. నాకయితే ఈ పగటి వేషగాని సొల్లు మాటలు & తైతక్కలు చూస్తె యమ కామెడీగా ఉంది. వరంగల్ జిల్లా జమ్మికుంటలో అమ్జద్ ఖాన్ సినిమా నేల క్లాసు టికెట్టు కొని "చీమిడి ముక్కెట్టుకొని చింపిరి జుట్టేసుకొని బురదలో పొర్లుతుంటే కెవ్వు కేక" పాట చూస్తున్నంత ఆనందంగా ఉంది.

    ReplyDelete