ఏదైనా నేరం జరిగితే, ఆ నేరం చేసినవారి, అట్లే ఆ నేర బాధితుల కుల,మత,ప్రాంతాలతో, మరియు డబ్బు,హోదా వంటి సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఆ నేరస్థులు నేరానికి తగ్గ శిక్ష అనుభవించేలా చేయగలగడం ఏదైనా అభివృద్ధి చెందిన సమాజానికి,గొప్ప సంస్కృతికి ఉండాల్సిన ప్రధాన లక్షణం.నేరం చేసిన వారిని శిక్షించడం ఎంత అవసరమో, నేరం చేయని అమాయకులని ఆ నేరానికి బాధ్యులని చేస్తూ శిక్షించకుండా ఉండటం అంతే అవసరం. ఈ విషయాన్ని దృష్ఠిలో ఉంచుకునే మన న్యాయ శాస్త్ర చట్టాలు రూపొందిచబడ్డాయన్నది సుస్పష్టం. ఈ చట్టాలని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులు,న్యాయవాదులు మరియు న్యాయమూర్తుల మీద ఉంది. కానీ, వీరు కూడా మానవ మాత్రులే కాబట్టి, కులం,ప్రాంతం,మతం,డబ్బు,హోదా లాంటి వాటికి అతీతమైన వాల్లు కాదు కాబట్టి, కొన్ని సార్లు చట్టం దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. దీని వల్ల కొన్నిసార్లు నేరస్థులు తప్పించుకోవచ్చు, అట్లే, నేరంతో సంబంధం లేని అమాయకులు బలిపశువులు కావచ్చు.ఈ విషయాన్ని దృష్ఠిలో ఉంచుకునే మన రాజ్యాంగ నిర్మాతలు, న్యాయవ్యవస్థను వివిధ అంచెలుగా తీర్చిదిద్దారు. న్యాయ వ్యవస్థ మెజిస్ట్రేట్,సెషెన్స్,హైకోర్ట్,సుప్రీం కోర్ట్ ఇలా వివిధ స్థాయిల్లో విభజించబడింది.ఏదైనా ఓ కోర్ట్లో తమకు న్యాయం జరగలేదని భావించిన వాల్లు ఎవరైనా సరే పై కోర్ట్ కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ కూడా కాకుంటే ఆపై కోర్ట్ కు, ఇలా సుప్రీం కోర్ట్ వరకు కూడా వెల్లవచ్చు.దీని వల్ల కాలయాపన జరగవచ్చేమో కానీ, అన్యాయం న్యాయం కాకూడదనే ఉదాత్త ఆశయానికి ఇది తప్పనిసరి.పై కోర్టులు, క్రింది కోర్టుల తీర్పుని సమర్థిస్తూనే ఇంకా తీవ్రమైన శిక్షని విధించిన సంధర్భాలూ, క్రింది కోర్టుల తీర్పులకి పూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన సంధర్భాలూ కూడా చాలానే ఉన్నాయి. జెస్సికా లాల్ కేసు దీనికొక చక్కని ఉదాహరణ. మొత్తం మీద , ఏదైనా క్రింది కోర్టు తీర్పుతో విభేదించటం అనేది తప్పో,చట్ట వ్యతిరేకమో కాదు. కానీ, ఈ విభేదించటం, పై కోర్ట్ కి అప్పీల్ చేసుకోవడం లాంటివి ఓ పద్దతి ప్రకారం చట్టానికి లోబడి జరగాలే కానీ, న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదు. ఎందుకంటే, తీర్పు మనకు నచ్చలేదు కదా అని న్యాయ వ్యవస్థని నిందించటం/అగౌరవ పరచటం అంటే, కూర్చున్న కొమ్మని నరుక్కోవడమే.
ఉదాహరణకి, ఇటీవలే గోధ్రా రైలు దుర్ఘటనకి సంబంధించి ఓ సెషన్స్ కోర్ట్ తీర్పు వెలువరించింది. కొందరు తీర్పుని స్వాగతించారు, కొందరు అసంతృప్తి ప్రకటించారు. అసంతృప్తులు పైకోర్ట్ కి అప్పీల్ చేసుకుని రీట్రైల్ కోసం ప్రయత్నించుకోవచ్చు. దీనిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సాక్ష్యాధారాల్ని మరింత క్షున్నంగా పరిశీలించి పై కోర్ట్లు తీర్పు ప్రకటిస్తాయి కాబట్టి, నిజంగానే వారు నేరస్థులైతే, శిక్ష నుంచి తప్పించుకోలేరు. అట్లే, ఆ రైలు దహనం అనంతరం జరిగిన అల్లర్ల పైనా, అజ్మీర్,మాలేగావ్ లాంటి బాంబు పేలుల్ల గురించీ వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. భవిష్యత్తులో వాటి తీర్పులు వెలువడినప్పుడు కూడా, కొందరు సోకాల్డ్ నాయకులు, బ్లాగర్లు ఇలాగే కోర్ట్ తీర్పుని వ్యతిరేకిస్తూ, ఇది కొందరి ఓట్ల కోసం జరుగుతున్న కుట్ర అనీ, ఓ మతం పై జరుగుతున్న దుష్ప్రచారం అనీ ఆవేశంగా స్టేట్మెంట్లు ఇచ్చే అవకాశం ఉంది. అఫ్కోర్స్ , అప్పుడు కూడా.. ఎవరి Programed Mindని బట్టి వారు రియాక్ట్ అవడమూ, రెచ్చిపోయి కామెంట్లు రాయడమూ చేస్తారు. ఏదేమైనా, సత్యమేవ జయతే అని ఆశిద్దాం.

Nicely written !
ReplyDeleteI guess this is high time to think about your blog template :)
intresting!!!
ReplyDeleteThanks Ooha & Sravya.
ReplyDeleteyah.. my blog template is not good. 'll try to update it. Thanks.
ఏదేమైనా, సత్యమేవ జయతే అని ఆశిద్దాం.
ReplyDeleteYep :)