మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ప్రస్తుత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మెన్ ఐన జస్టిస్ మార్కండేయ కట్జూ , భారతరత్న అవార్డు గురించి రాసిన ఆలోచనాత్మక వ్యాసం ఇవాల్టి 'ది హిందూ' లో ప్రచురితమైంది.
http://www.thehindu.com/opinion/op-ed/article2732614.ece
జస్టిస్ కట్జూ 'కాలిదాస్-గాలిబ్ ఫౌండషన్' అనే సంస్థ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వివిధ సామాజిక రాజకీయ అంశాలపై లోతైన విశ్లేషణలతో రాసిన అనేక వ్యాసాలు- http://www.kgfindia.com అనే వెబ్ సైట్లో ఉన్నాయి.
ఉదాహరణకి భారత దేశంలో చరిత్ర బోధన గురించి రాసిన వ్యాసం నుండి కొంత భాగం ఇలా ఉంది-
"1928లో, టిప్పుసుల్తాన్ గురించి నేను పరిశోధన చేస్తున్న టైంలో, ఒక విధ్యార్థి సమాఖ్యకు సంబంధించిన కొందరు తాము స్థాపించబోతున్న చరిత్ర సంబంధమైన ఒక సంఘ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడానికి వచ్చారు. వారి దగ్గరున్న చరిత్ర పుస్తకంలో నుండి టిప్పుసుల్తాన్ గురించి రాసి ఉన్న ఒక వాక్యాన్ని చూసి దాదాపు నాకు కల్లు బైర్లు కమ్మినంత పనైంది. అది - "టిప్పుసుల్తాన్ 3 వేల మంచి బ్రాహ్మణుల్ని బలవంతంగా ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నించగా వారు ఆత్మహత్య చేసుకున్నారు అనేది" . ఆ టెక్స్ట్ బుక్ రాసింది మహామహోపాధ్యాయ హర్ ప్రసాద్ శాస్త్రి, కలకత్తా యూనివర్సిటీలో సంస్కృత శాఖాధిపతి. దేని ఆధారంగా ఆయన టిప్పుసుల్తాన్ గురించి ఈ వ్యాఖ్య చేశారో, దానిని నిరూపించే చారిత్రక ఆధారాలేమైనా ఉంటే తెలియజేయండని నేను వెంటనే శాస్త్రి గారికి రాయడం జరిగింది. ఇలా అనేక సార్లు అడగిన తర్వాత- మైసూరు గెజిట్ నుండి తీసుకున్నానని ఆయన నుంచి ప్రత్యుత్తరం వచ్చింది. మైసూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీకాంతియా ని ఈ విషయమై సంప్రదిస్తే, మైసూర్ గెజిట్లో ఏనాడు బ్రాహ్మణుల ఆత్మహత్యల గురించి రాలేదనీ, పైగా, విద్యార్థి దశలో మైసూరు చరిత్ర మీద తాను పరిశోధన చేశాననీ, ఇలాంటి సంఘటన ఏదీ మైసూర్లో జరగలేదని తాను కశ్చితంగా చెప్పగలననీ అన్నారు. ఇంకా టిప్పుసుల్తాన్ ప్రధానమంత్రి-పునియా మరియూ సర్వ సైన్యాధిపతి- క్రిష్ణారావు ఇద్దరూ బ్రామ్హణులేననీ చెప్తూ, అప్పట్లో టిప్పుసుల్తాన్ 156 దేవాలయాలకు ప్రతి సంవత్సరం భరణం చెల్లించే వాడనీ ఆ దేవాలయాల లిస్టూ అట్లే శ్రింగేరి మఠాధిపతి జగద్గురు శంకరాచార్య గారితో టిప్పుసుల్తాన్ ఆత్మీయ సంబంధాన్ని తెలిపే ఉత్తరప్రత్యుత్తరాలకి సంబంధించిన సుమారు 30 ఫోటో కాపీలను కూడా పంపించాడు.
చరిత్రను వక్రీకరిస్తూ శాస్త్రి గారు రాసిన పుస్తకం అప్పటికే బెంగాల్, ఒరిస్సా, యు.పి, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పాఠ్యాంశంగా బోదించబడుతుంది. అప్పటి కలకత్తా యూనివర్సిటీ VC-శ్రీ అశుతోశ్ ముఖర్జీ గారికి, శాస్త్రి గారితో, మైసూర్ యూనివర్సిటీ VC -బ్రిజేంద్ర నాధ్ శీల్ గారితో, మరియూ ప్రొఫెసర్ శ్రీకాంతియా గారితో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలనూ ఇతర అధారాలనూ పంపించి అసత్యాలను ప్రాచుర్యంలోకి తెస్తున్న వారిపై చర్య తీసుకోవలసిందిగా కోరడం జరిగింది. అశుతోశ్ ముఖర్జీ గారు వెంటనే స్పందించి శాస్త్రి రాసిన పుస్తకాలన్నింటినీ పాఠ్యాంశాలనుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కానీ బాధాకరమైన విషయమేమంటే - విద్యార్థుల మనసుల్లో విద్వేషాల్ని నింపే ఇలాంటి కట్టుకథలు ఇంకా అనేక పాఠ్యపుస్తకాలలో ఇప్పటికీ బోధిస్తూనే ఉన్నారు."
భారత దేశం మీదికి దండెత్తి వచ్చిన తొలితరం ముస్లిం పాలకులైన ఘజనీ, ఘోరీ లాంటి కొందరు హిందూ దేవాలయాలను కూలగొట్టిన మాట వాస్తవమేననీ, కానీ ఆ తర్వాత ఇక్కడ రాజ్యస్థాపన చేసిన అనేక మంది ముస్లిం రాజులు హిందువులతో సఖ్యతను కొనసాగిస్తూ వారి సంస్కృతినీ, దేవాలయాలనూ పరిరక్షించారనీ, కానీ 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత, హిందూ ముస్లింలు ఐక్యంగా ఉన్నంత కాలం వారి మీద ఆధిపత్యం చెలాయించడం సాధ్యం కాదని గ్రహించిన బ్రిటీష్ వారు, తమ 'విభజించి పాలించు' పధకంలో భాగంగా చరిత్ర వక్రీకరణకి పూనుకున్నారనీ వివరిస్తూ, వివిధ బ్రిటీష్ అధికారుల మధ్య ఈ విషయం గురించి జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్ని ఆధారాల్తో సహా జస్టిస్ కట్జూ గారు వివరించడం జరిగింది.
ఆసక్తి ఉన్న వారు పూర్తి వ్యాసాన్ని ఇక్కడ చదువుకోవచ్చు. -
http://www.kgfindia.com/kalidas-ghalib.php

Thanks for the links.
ReplyDeleteBritishers started the 'Divide and rule' policy. Now the so called certified Deshbhakts are deliberately following this for their political gains with hidden agendas. This brain wash of twisted historic facts is the main reason behind many moderate hindus also supporting the Babri demolition,Gujarath riots etc..
@Anonymous:
ReplyDeleteThanks. నిజమే.. వక్రీకరించబడిన చరిత్రను బుర్రల్లో నింపుకుని, - " వారు మమ్మల్ని పీడించిన మాట నిజం, కాబట్టి ఇప్పుడు మేము వారిని పీడించాలనో, పీడించడం తప్పు కాదనో " వాదించే వారికి సుప్రీంకోర్టు జడ్జి కాదు కదా, ఎవరు ఎన్ని ఆధారాల్తో చెప్పినా అర్థం కాదు. కొందరి సబ్ కాన్షస్ మైండ్ కొన్ని (ద్వేష)భావాలకి అణుగునంగా ట్యూన్ చేయబడి ఉన్నప్పుడు వాటిని మార్చడం ఆంత ఈజీగా అయ్యేపని కాదు.
బ్రిటిష్‌వాళ్ళ టైమ్‌లో కొంత మంది భూస్వామ్య కులాలవాళ్ళు బ్రిటిష్‌వాళ్ళకి ఓపెన్‌గా సపోర్ట్ ఇచ్చారు. మలయాళీ నాయర్లు ఆ వర్గానికి చెందినవాళ్ళే. టిప్పూ సుల్తాన్ మలయాళీ నాయర్లని ఊచకోసిన మాట నిజమే కానీ బ్రాహ్మణులని చంపలేదు. హైదర్ అలీ, టిప్పూ సుల్తాన్‌లిద్దరికీ చదువు నేర్పించినవాళ్ళు బ్రాహ్మణులే. అయితే టిప్పూ సుల్తాన్ శ్యామయ్య అయ్యంగార్ అనే బ్రాహ్మణుణ్ణి బ్రిటిష్‌వాళ్ళ కోవర్ట్ అనే అనుమానంతో కళ్ళు పొడిపించిన మాట నిజమే కానీ శ్యామయ్య కొడుకుని మాత్రం తన ఆస్థానంలో ఉద్యోగంలో కొనసాగించాడు. ఒకవేళ మతం పేరుతో పీకెయ్యాలనుకుంటే అతని కొడుకుని కూడా ఉద్యోగం నుంచి పీకేసేవాడు కదా. హైదరాబాద్ నిజాంలు హిందువులపై ఎన్ని అత్యాచారాలు చేసినా బ్రిటిష్‌వాళ్ళు నిజాంలని వెనకేసుకొచ్చారు. ఇప్పటికీ మన పాలక వర్గంవాళ్ళు ముస్లింల వోట్ల కోసం నిజాం పాలనని పొగడడం జరుగుతోంది.
ReplyDelete@ప్రవీణ్ శర్మ:
ReplyDeleteమీరన్నది నిజమే, కానీ చరిత్రను మతం కళ్ళనుండి చూడ్డం బాగా అలవాటైన కొన్ని ప్రాణులకి ఇలాంటి వ్యాఖ్యలు రుచించవు/అర్థం కావు. Thanks.
విచిత్రమేమిటంటే అన్నిటినీ మతం కళ్ళతో చూసేవాళ్ళే మార్క్సిస్ట్‌లని మత ప్రవక్తలతో పోలుస్తూ విమర్శిస్తున్నారు. మతం అనేది కేవలం ఊహాజనితమే కానీ సమాజాన్ని శాసించే శక్తి (power of determination) ఎన్నటికీ కాదు అనేది మార్క్సిస్ట్‌లందరికీ తెలిసిన విషయమే. కొందరు పెట్టుబడిదారీ నాస్తికులు మతం ఊహాజనితమనే విషయాన్ని తాము కనిపెట్టామని చెప్పుకుంటున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందని భూస్వామ్య కాలంలో కూడా మతం కేవలం ఊహాజనితంగా ఉండేది కానీ వాస్తవికంగా మతానికి కట్టుబడి ఉన్నవాళ్ళు తక్కువ.
ReplyDelete