Friday, August 3, 2012

ఆ ముష్కరులు చేసింది తప్పే..కానీ..


మంగుళూరులో తమని తాము సంస్కృతీ పరిరక్షకులుగా, పుట్టు దేశభక్తులుగా చెప్పుకునే అల్లరి మూకలు మల్లీ రెచ్చిపోయారు. ఓ బర్త్ డే పార్టీ పై దాడిచేసి అక్కడి అమ్మాయిలు,అబ్బాయిలను కొట్టి నానా హంగామా సృష్టించారు. దానికి సంబంధించిన 'ది హిందూ' పత్రిక కధనాలు - ఇక్కడ
విషయం ఏంటంటే.. ఈ దాడికి నాయకత్వం వహించిన వ్యక్తి, 2009లో మంగులూర్లోనే ఓ పబ్ లోకి చొరబడి అక్కడి మహిళలపై దాడిచేసిన వీరుడు. ఇతని వీరత్వాన్ని అప్పుడు కూడా దేశవ్యాప్తంగా T.Vలు వీడియో  ప్రసారం చేశాయి. కానీ కర్నాటకలో ఉన్నది BJP ప్రభుత్వం కాబట్టి, అందరూ ఊహించినట్లుగానే ఇతడిమీద చర్యలేవీ తీసుకోలేదు. దానితో మళ్ళీ ఇప్పుడిలా తెగబడ్డాడు. అసలే అలవాటైన పని, పైగా దేశవ్యాప్తంగా ఫ్రీ పబ్లిసిటీ, అపై శిక్షలేవీ ఉండవనే భరోసా.. ఇంకేం కావాలి..? 

2009లో పబ్ మీద దాడి చేసినప్పుడే ఇతన్ని సరైన రీతిలో 'సత్కరించి ' ఉంటే ఇప్పుడు ఇలా చేసి ఉండే వాడు కాదు. కానీ 2009 పబ్ పై దాడిని ఖండిస్తూనే, మన సంస్కృతి, విలువలు అంటూ అనేక మంది కుహన దేశభక్తులు/సంస్కృతి భక్తులు ఇతన్ని ఇండైరెక్ట్ గా వెనకేసుకొచ్చారు. దాని ఫలితంగానే ఇతను ఇప్పుడిలా బరితెగించాడు. ఇప్పుడు కూడా ఈ సర్టిఫైడ్ దేశభక్తుల స్పందనలో మార్పులేదు. తప్పే కానీ.. సంస్కృతి,విలువలూ అంటూ నీళ్ళు నములుతున్నారు.వీరిలా స్పందించడానికి రెండు కారణాలు ఉండొచ్చు.
1. ఎప్పుడూ పబ్బులకీ,పార్టీలకీ వెల్లక, వెల్లే అవకాశం రాక, అలా వెల్లే వాల్లందరూ అక్కడ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారేమో ననే ఓ విధమైన అక్కసు(జెలసీ ) వీరి స్పందనకి కారణం కావచ్చు.(తాను చేయలేని పనిని ఇంకెవరైనా చేస్తూ.. అతను దానిలో ఆటంకాలు ఎదుర్కొంటేనో లేక విఫలమైతేనో, పక్కనుండి చూసే వారికి ఓ విధమైన తుత్తి ఉంటుంది. ఇది సగటు మానవ నైజం) . 
2. నేను కానీ, మా ఇంట్లో వారు కానీ పబ్బులకి,పార్టీలకీ  వెల్లం కాబట్టి, అలా వెల్లేవారిని ఎవరేం చేసినా నాకు పోయేదేం లేదనే ఓ విధమైన నిర్లిప్తతతో, ఈ దాడుల వల్ల మన సంస్కృతి కాస్తైనా బాగుపడుతుందేమోననే ఆశ కావచ్చు.

దాడులు,సంస్కృతి అవేని రెండు వేర్వేరు విషయాలు. వీటిని ఎప్పటికీ కలిపి చూడకూడదు. ఆ పార్టీల్లో చట్టవ్యతిరేక కార్యక్రమాలేవైనా జరుగుతున్నాయనుకున్నప్పుడు దానిని చట్టప్రకారమే ఎదుర్కోడానికి ప్రయత్నించాలే తప్ప ఇలా  మృగాల్లా దాడులు చేయకూడదు. దీనిని ఖండించడంలో, ఆ ముష్కరుల్ని తీవ్రంగా శిక్షించమని అడగడంలో మీనమేశాలు లెక్కించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు.
ఇక సంస్కృతి అనేది మరో అంశం. సంస్కృతిని పరిరక్షించమనీ, పబ్బులకీ,పార్టీలకీ వెల్లకండనీ శంకరాచార్యలాంటి మఠాధిపతులో, TTD లాంటి ధార్మిక సంస్థలో ప్రచారం చేస్తే బాగుంటుంది తప్ప, ఓ నలుగురు ఆకతాయిల్ని వెంటేసుకు తిరిగే ప్రతివాడు సంస్కృతి పరిరక్షకున్నని చెప్పుకోవడం, ప్రస్తుతం మన సంస్కృతి యొక్క దౌర్భాగ్యం.


సంస్కృతి-పబ్బులు-పార్టీలు


మా నాన్న యువకుడిగా ఉన్నప్పుడు వాల్ల పల్లెలో వీధినాటకాలు, కోలాటాలూ లాంటివి తెగ ఆడేవాడంట. 'ఒరే ఇది మన సంస్కృతి కాదురా' అని వాల్ల నాన్న మా నాన్నని రోజూ తిట్టేవాడంట.
కాలేజీ రోజుల్లో నేను సినిమాలు తెగ చూసేవాన్ని. 'ఒరే ఇది మన సంస్కృతి కాదురా' అని మా నాన్న నన్ను రోజూ తిట్టేవాడు. 
రేపు నా కొడుకు పెద్దయ్యాక పబ్బులకు,డిస్కోలకు వెల్తాడు. 'ఒరే ఇది మన సంస్కృతి కాదురా' అని నేను కూడా వాన్ని తిడతాను. అదే సంస్కృతి అంటే..
"ఏ సంస్కృతీ ఏనాడూ కాదొక స్థిర బిందువు. అనైక నదీనదాలు కలిసిన అంతస్సింధువు"- అన్నాడో కవి.
మార్పు చెందని జాతులు,సంస్కృతులు త్వరగా అంతరిస్తాయి. ఆ కొత్తగా వచ్చే సంస్కృతికి అప్పటికే ఉన్న సంస్కృతికీ మధ్య కొంత ఘర్షణ అనేది సహజమే. తల్లిదండ్రులు పిల్లల్ని మందలించడం అనేది అలాంటిదే..
కానీ ఇలా మందలుగా వెల్లి దాడులు చేయడమనేది సంస్కృతి కాదు. దీనికి సరైన పేరు-కుల్లు రాజకీయం.  




6 comments:

  1. Sahir Ludhianvi in a rare piece of Hindi poetry wrote:

    यह पाप है क्या, यह पुन्य है क्या

    रीतों पर धर्म के मोहरे है

    हर युग में बदलते धर्मोंको

    कैसे आदर्श बनावोगे?


    Loosely translated:

    What is sin? What is good?
    These are the stamps of values on customs
    Values change every aeon
    How can such values become absolute ideals?

    ReplyDelete
  2. शुक्रिया, Jai Gottimukkala जी,
    हिन्दी कविता मस्त है.

    ReplyDelete
  3. అంటే మీ ఉధ్ధేశ్యంలో చేనేత పరిశ్రమ ములిగిపొతున్నా సగం బట్టలు వేసుకుని(అది కూడా చేనేత వస్తాలకు రెండు మూడు రెట్లు ఖరీదైన బట్టలు) వేసుకోవడం తప్పుకాదా?
    నేను వాళ్ళని సమర్ధిస్తున్నాను అని మీరు అనుకోవచ్చు అది నిజం కూడా కావచ్చూ కానీ ఈ Pub's Parties వల్ల లాభపడేది ఎప్పటికీ సామాన్యుడు కాదు అని తెలుసుకుని వాళ్ళని పొగడటం ఆపితే మంచిది.

    ReplyDelete
    Replies
    1. అంటే ఈ దాడుల వెనుక చేనేత కార్మికుల్ని ఉద్ధరించాలనే తపన కూడా ఉందంటారా..? నాకిది తట్టనేలేదు సుమీ..
      చేనేత కార్మికులపట్ల, ఈ దేశ సామాన్యులపట్ల మీకున్న అపార పేమకు జోహార్లు.

      Delete
  4. "ఏ సంస్కృతీ ఏనాడూ కాదొక స్థిర బిందువు. అనైక నదీనదాలు కలిసిన అంతస్సింధువు".. I liked this line... good post...

    ReplyDelete