ఈ రోజు హిందూ పత్రిక మొదటి పేజీలో వచ్చిన ఫోటో మరియు వార్త ఇది..
60 ఏళ్ళక్రితం తీసిన పాత చార్మినార్ పోటోకి ఇప్పటి ఫోటోకి ఉన్న తేడా స్పష్టంగానే కనబడుతుంది.
అప్పుడు లేని గుడి ఇప్పుడు అక్కడికి ఎలా వచ్చింది? ఒక చిన్న రాయిగా మొదలైన నిర్మాణం ఇప్పుడు ఓ స్పష్టమైన గుడి రూపాన్ని సంతరించుకుంది. ఇది క్రమంగా విస్తరిస్తుంది. దీని వెనక ఎవరున్నారు.? సగటు హిందువులెవరికీ ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉండదు. ఇలాంటి వివాదాల్ని ఉపయోగించుకుని లబ్ధిపొందాలనుకునే రాజకీయ రాబందులే ఇలాంటివి సృష్టిస్తుంటారు. ఇది ఆల్రెడీ ఓ సారి నిరూపితమైంది.
బట్ట కాల్చి ముఖాన వేయడం:
రాయలసీమలో ఒక సామెత ఉంది. అది బట్టకాల్చి ముఖాన వేయడం. ఎవరి ముఖంపై అయినా బట్టకాల్చి వేస్తే ముఖం కాలిపోతుంది. దానిని తీసేద్దామని ప్రయత్నిస్తే ఆ మసి అతని చేతులకి అంటుకుంటుంది. ఆ బట్ట వేసిన వ్యక్తిని ఎందుకు అలా చేశావని అడిగితే- నేను వేయలేదు, అతనే వేసుకున్నాడు, కావాలంటే అతని చేతులకి మసి ఉంది చూసుకోండి అంటాడు. ఇప్పుడు పాతబస్తీ ముస్లింలది ఇదే పరిస్తితి. తమ చారిత్రక వారసత్వానికి గుర్తుగా 4 శతాబ్ధాలనుండి ఠీవిగా నిలబడి ఉన్న చార్మినార్ పక్కనే ఇప్పుడు ఓ గుడి వెలుస్తుంది. దానిని చూసి ఆవేశంలో 4 రాల్లు వేస్తారు. మరుసటి రోజు మన తెలుగు పేపర్లలో మొదటి పేజీలో ఈ ఘటనల గురించి వార్తలు వస్తాయి. "పాతబస్తీలో అల్లరి మూకల విధ్వంసం" అని. ఆ పక్కనే కిషన్ రెడ్డి, వెంకయ్యనాయుడు వంటి వారి ఖండనలు. మరి దీనికి కారణమైన వారు ఎవరు, ఎవరి ప్రొద్బలంతో అక్కడ గుడి నిర్మానం జరుగుతుంది లాంటి వివరాల జోలికి మన తెలుగు పేపర్లు వెల్లవు. ఎందుకు వెల్లవంటే.. మెజారిటీ పాఠకులకి ఇలాంటి వార్తలు నచ్చవు కాబట్టి, దీనినే మెజారిటీ అప్పీస్మెంట్ అంటారు.
ఈ వివాదం భవిష్యత్తు ఎలా ఉండబోతుంది.
ఇది ఊహించడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మన అతివాద హిందూ గ్రూపులు ఫాలో అయ్యేది ఒకప్పటి హిట్లర్ వ్యూహాలనే.( మన దేశభక్త బాల్ థాకరే హిట్లర్ కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే కదా) వీరి వ్యూహాల్లో మొదటిది- నిజాల్ని నాశనం చేయడం, అబద్ధాల్ని పదే పదే ప్రచారం చేసి వాటినే నిజాలుగా నమ్మించడం. ఈ పని కోసం హిట్లర్ ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశాడు, దానికి అధిపతిగా గోబెల్ ని నియమించాడు.)
ఇక మన చార్మినార్ కి సంబంధించి గోబెల్స్ ప్రచారం ఇలా ఉండబోతుంది.
1. అక్కడ చార్మినార్ కన్నా ముందునుండే దేవాలయం ఉండేదని, దానిని కూలగొట్టి ముస్లిం రాజులు చార్మినార్ నిర్మించారని ప్రచారం చేస్తారు.
2. ప్రతి పండుగకి అక్కడికి జనాలని అసంఖ్యాకంగా తరలించి అక్కడ చాలా మహిమలున్నాయనీ, అక్కడ దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయని ప్రచారం కల్పిస్తారు.
3. భక్తుల ముసుగులోనే ఈ కుట్రదారులు కూడా వెల్లి అప్పుడొక ఇటుక,అప్పుడొక ఇటుక తో నిర్మానాన్ని క్రమంగా విస్తరిస్తారు. దీనిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే, "ప్రభుత్వం ముస్లింలకి కొమ్ముకాస్తూ, హిందువుల్ని కనీసం దేవాలయాలకు కూడా వెల్లనీకుండా చేస్తుందని, BJP మరియు ఇతర ధార్మిక సంస్థల ప్రతినిధులూ ఊరూ వాడా తిరిగి నెత్తీ నోరూ బాదుకుంటారు. వీరి ఆక్రోశాన్నిపత్రికలు మొదటిపేజీలో ప్రచురిస్తాయి.
4. ముస్లింల ఓట్లు మహా అంటే 15 శాతం, అవి కూడా చాల వరకూ MIM కే వెల్తాయి, కానీ హిందువుల ఓట్లు సుమారు 80%, కాబట్టి ఏ ప్రభుత్వం కూడా ' హిందూ వ్యతిరేకి అనే విమర్శని తట్టుకోని నిలబడలేవు. కాబట్టి ప్రభుత్వాలేవీ వీరిని నిలువరించే ప్రయత్నం చేయవు. పైగా ప్రస్తుతం ఉన్న కిరన్ కుమార్ రెడ్డి లాంటి ఎప్పుడు ఊడుతుందో తెలీని, అసమర్థ నాయకత్వం ఉంటే ఇక వీరి ఆగడాలు వేగవంతం అవుతాయి.
ఈ వివాదం వల్ల లాభ నష్టాలు- ఎవరికెంత..?
ఈ వివాదం వల్ల BJP,MIMలు ప్రజల్ని మతాల వారిగా విభజించి, తమ వర్గం వారి ఓట్లను గంపగుత్తగా పొందే అవకాశం ఉంది. ఈ విధంగా అత్యధికంగా లాభపడేది- BJP
ఇలాంటి విషయాల్లో TDP,కాంగ్రెస్ లాంటి పార్టీలు ఏ వర్గాన్ని నొప్పించకూడదని తటస్థంగా ఉండటానికి ప్రయతించి దారునంగా విఫలమవుతాయి. కాబట్టి భవిష్యత్తులో వీటి మనుగడ ప్రశ్నార్థక మవుతుంది.