రిజర్వేషన్ల గురించి TVల్లో, వివిధ బ్లాగుల్లో ఎప్పుడు చర్చ జరిగినా ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలనే ఒక వాదన చాలా మంది వినిపిస్తుంటారు. ఆర్థిక వెనకబాటు ఆధారంగా రిజర్వేషన్లు అనేది ఓ మాంచి రొమాంటిక్ థాట్. ఆర్థికంగా వెనబడిన వాల్లకు రిజర్వేషన్లు ఇస్తాం, పేదోల్లెవరో వచ్చి క్యూ లో నిలబడండి అని ఒకసారి అనౌన్స్ చేసి చూడండి. బాగా డబ్బున్న మారాజులందరూ సొంత వాహనాల్లో వెల్లి, మేము చాలా పేదోల్లమంటూ క్యూ లో ముందు నిలబడ్తారు, చేతుల్లో MRO ఇచ్చిన ఆదాయ ధృవీకరణ పత్రాలతో సహా.(MRO చేతిలో ఎంత ఎక్కువ పెడితే, మన ఆదాయం అంత తక్కువగా రాస్తాడనేది తెలిసిందేగా) పాపం నిజంగానే డబ్బులేనోల్లేమో బస్సుల్లో,పాసింజర్ రైల్లలో వెల్లి క్యూ లో ఆఖరున నిలుచుంటారు.
అసలు మనదేశంలో ఎవరిదగ్గర ఎంత సంపద ఉందో, ఎవరి ఆదాయం ఎంతో,వంశపారంపర్యంగా అప్పణంగా వచ్చి పడుతున్న ఆస్తులెంతో ప్రభుత్వం దగ్గర ఏమైనా లెక్కలున్నాయా? పన్నులు ఎగ్గొట్టడానికీ, ప్రభుత్వ సంక్షేమ పధకాలు పొందటానికి ఉన్న అదాయాన్ని/సంపదను బయటపెట్టకుండా, మేము పేదోల్లమని ప్రకటించుకోవడానికి ఏమాత్రం సంకోచం లేని 120 కోట్ల ప్రజలున్న దేశంలో, అసలు అలా ఆర్థిక వెనుకబాటు లిస్ట్ తయారు చేయడం సాధ్యమయ్యే పనేనా..?
సాధ్యం కాని ప్రాత్యమ్నాయాలతో ఆదర్శాలు వల్లెవేయకుండా ఉన్న వ్యవస్థను కొనసాగిస్తూనే దానిలోని లోపాలను సవరించడంపై దృష్టిపెడితే బాగుంటుంది.
Reservation is one of the ways to uplift the poor but not the sole way. జార్ఖండ్లో ఇనుప ఖనిజాన్ని దోచుకుని విదేశాలలో అమ్మి బిలియనైరైన మిత్తల్ కంపెనీ ఆస్తులని స్వాధీనం చేసుకున్నా ఎంతో మంది జీవితాలు బాగుపడతాయి.
ReplyDeleteకనీసం ఐఏఎస్ ఐపిఎస్ లాంటి వారి బిడ్దలకైనా రిజర్వేషన్ ఎత్తేస్తే ఆ రిజర్వుడు కులాల్లో పేదలకైనా ఆ ఫలాలు బాగా అందుతాయి కదా?
ReplyDelete@ ప్రవీన్ శర్మ:
ReplyDeleteఈ ఐడియా బాగానే ఉంది కానీ, మరి మిత్తల్ గమ్మునుంటాడా..?
Thanks.
@KRISHNA:
ReplyDeleteమీరన్నట్లు, ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థలో కొన్ని లోపాలున్నమాట నిజం. వాటిని గుర్తించి, లోపాల్ని చక్కదిద్దగలిగితే, రిజర్వేషన్ ఫలాలు మరింతగా అందరికీ అందుతాయి. ఉన్నతోద్యోగుల పిల్లలు మరియు క్రిమీలేయర్ పై నున్న వారి పిల్లల్ని రిజర్వేషన్ల నుంచి మినహాయించడం లాంటివి దీనికి కొన్ని ఉదాహరణలు.
Thanks.
yes,it is difficult to identify and implement reservations on the basis of economic status.instead,itwill be better if stipends and scholarships are given to all students (including forward caste students)selected for higher studies.
ReplyDelete