Tuesday, August 16, 2011

ఎలక్షన్లు,పార్లమెంట్,అసెంబ్లీలను నిషేధించాలి!!!

తిండి మానేసి నేను చెప్పినట్లు చేయకుంటే చస్తానని బెదిరించే ప్రతివాడూ గాంధీగారిలా ఫీలైపోవడం శోచనీయం. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పని ఎవరు చేసినా వారికి గుడ్డిగా మద్దతు పలికే ప్రతిపక్షాలు, TRP రేటింగ్ల కోసం గోరంతను కొండత చేసి చూపడంలో పోటి పడుతున్న మీడియా, వీరందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు.
మొన్నటికి మొన్న, తెలంగాణా ప్రకటించకపోతే చస్తానంటూ KCR నిరాహారదీక్షకు పూనుకున్నాడు. ఇంకేముంది పోతాండంట..పోబోతున్నాడంట..కోమా అంట.. అంటూ ఒకటే ఫ్లాష్ న్యూసులు. సహజంగానే చావు అనేది బలమైన సెంటిమెంట్ కాబట్టి ప్రజల్లో కూడా ఎక్కడలేని సానుభూతి. ఎద్దుపుండు కాకికి ముద్దన్నట్లుగా, నిరాహార దీక్ష భగ్నం చేయడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాన్ని ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అంటూ, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రతిపక్షాలు ఉండనే ఉన్నాయి.ఇక వేరే గత్యంతరం లేక కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9 ప్రకటన చేయడం, చర్చలు,సంప్రదింపులు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ తర్వాత జరిగిన సంఘటనలు తెలిసిందే.
KCR దీక్ష నుండి స్పూర్తి పొందాడో ఏమో గానీ, అవినీతి గురించి ఇప్పుడే తెలిసినట్లుగా, ఇప్పటికిప్పుడే దానిని అంతమొందిస్తానన్నట్లుగా దీక్షలకు పూనుకుంటున్నాడు అన్నా హజారే. ఇక peepli live మీడియా, ప్రభుత్వానికి మైనస్ ఐతే, మనకు ప్లస్సే అనుకునే ప్రతిపక్షాలు ఉండనే ఉన్నాయి.

సరే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? అన్నా హజారే బృందం చెబుతున్నట్లుగా వారు తయారు చేసిన లోక్పాల్ బిల్లుని పార్లమెంటులో పెట్టి ఆమోదించేయడమా? ఇక ఆ తర్వాత వీరు మల్లీ ఇలాంటి దీక్షలకు పూనుకోకుండా మూటా ముల్లే సర్దుకుని,పౌర సమాజాన్ని మూసేసుకుని హిమాలయాలకు వెల్లిపోతారా..? లేక,  దేశ ప్రజలకు  ప్రభుత్వం పైన కంటే, ఇలాంటి పౌర సమాజం పైన మాత్రమే నమ్మకముంది కాబట్టి పార్లమెంటుని, అసెంబ్లీలని రద్దు చేసి, అన్నా హజారే గారి అధ్యక్షతన పౌరసమాజాన్నే పాలించమందామా..?
అన్నా హజారే దీక్షకు వస్తున్న స్పందనను చూసి, భవిష్యత్తులో మరికొంత మంది నాయకులు ఇలా దీక్షల బాట పడితే పరిస్తితి ఏంటి..?
ఉదాహరణకి ముంబై లోని మరాఠా ప్రజలకి అన్యాయం జరిగి పోతుందని బాల్ ధాకరే గారు మహారాష్ట్ర లోని ఊరూ వాడా తిరిగి, ఉన్నవి లేనివీ జనాలకి నూరిపోసి, ముంబై నుండి ఇతరుల్ని తరిమి వేయాలని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే..?
తమిళులకి దేశంలో తీరని అన్యాయం జరుగుతుందనీ, తమిలులకి, కాష్మీర్ తరహా ప్రత్యేక మినహాయింపులో,లేక ప్రత్యేక దేశమో కావాలని కరుణానిధి నిరాహార దీక్షకు పూనుకుంటే..?
దేశంలో రిజర్వేషన్ల వల్ల అగ్రకులాల యువకులకు తీరని అన్యాయం జరుగుతుందనీ, రిజర్వేషన్లను ఎత్తేయ్యాలనీ ఏ సుబ్రమన్య స్వామి లాంటి వారో ఆమరణ నిరాహార దీక్ష కి సిద్ధపడితే. సహాజంగానే అగ్రకులాల ప్రజలు ఆయన దీక్షకు మద్దతుగా తండోపతండాలుగా తరలి వస్తారు.ఇక peepli live మీడియా ఉండనే ఉంది.
ఇక అప్పుడు రిజర్వేషన్లను తీసేద్దామా..?

ఇప్పటికే ఎలక్షన్ల నిర్వహణకి బోలెడంత ప్రజాధననం ఖర్చవుతుందంట. కాబట్టి భవిష్యత్తులో ఎలక్షన్లను నిషేధించి వాటి స్థానంలో దీక్షల పోటీలను  పెట్టాలి. అంటే ఎవరు ఎక్కువ రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆ నాయకునికి దేశంపైన,ప్రజలపైన అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్లు నిర్ధారించి వారికే పాలించే అవకాశం ఇవ్వాలి. జై దీక్షలు..జై జై దీక్షలు.

My previous post on the similar topic:

http://andamainacheekati.blogspot.com/2011/06/blog-post.html

13 comments:

  1. Thought provoking. When I said the same about these fasts on to death, there wren't many who supported me. People in india are so vexed up with politics, politicians and political system..everything goes when people of Hazare's status takes such extreeme steps.
    There is no use reminding anyone that we are undermining the very democratic process that we want to save. What we are seeing is the collective outburst of frustation, cynicism and anger of billion plus of humanity.
    When you are dealing with such gargatuan situation, it generally doesn't follow even simple logic.

    But his arrest so soon is suicidal to the govt.

    ReplyDelete
  2. this is a country which is starved of leaders.. which is vexed with brute selfishness.. in such a scenario, support to Anna is very much expected.. we dont have any other leader who could match his stature..
    And many people are supporting because they want to show their anger in some way or the other.. and they chose this man for that!!

    ReplyDelete
  3. Pavani gaaru,
    Thanks for the comment.
    I just saw your link and yah, our views are almost same on this issue.
    I don’t think it’s a movement of billion plus.
    The total voter turnout in 2009 general elections was 58.19% . then what about the remaining 41%..?
    I think most of this 40% are the middle class youth who migrated/settled in urban cities, who never bother to cast their votes by visiting their native places on the voting day. And these are the ones who are playing active role on the roads by shouting slogans, in fasting tents and on various blogs. They feel, they are doing their bit for the country in this way. These energetic youth and most of the hardcore anti-Congress, anti-UPA people who voted for BJP+ in elections ( who loves to see the fall of the current govt by any means), are the ones who are mainly supporting this agitation.
    But almost all indians(including U n Me), feels sympathetic with Anna’s goal but the problem is only with the way he is trying to do that which may look beneficial in short term, but may turn fatal to the country and to the concept of democracy itself in the long run .
    And regarding the suisidal act of govt, yah suiside is not a bad option, when its clear that someone is surely going to kill. Thanks.

    ReplyDelete
  4. UPA has made series of strategic blunders in this episode. It branded Anna corrupt, which is totally unnecessary. Arrested him too soon ang gave in even sooner. Its helplessness is quite evident.

    Also the govt. was never able to send the message anout the impossibility of approving janlokpal. At the end it made a self goal.
    you may read this
    http://www.rediff.com/news/slide-show/slide-show-1-is-hazares-arrest-upas-biggest-blunder/20110816.htm

    ReplyDelete
  5. Yah.. calling Anna as corrupt at this point is unnecessary and also childish. But the govt is left with very few options when the Anna gang is adament about the fast and their demands.
    I just want to ask one question to all those who are criticizing the govt arresting Anna - what would you do, if you are in the place of Govt/Mr.M.M Singh? will u simply accept whatever they are demanding? or will you just let him fast till death?

    ReplyDelete
  6. The UPA contested 2009 elections and won mejority seats compared to other parties, (which is a proof that they have majority people's support and they are representing mejority people's aspirations) and they are trying to do the things which they have promised to do. Based on their performance people will judge then in next elections. But suddenly, someone stands up and they themselves claimed that they are original repesentatives of people and dictating the govt what to do. Still the govt accepted to some extent. but now they are dictating the govt, even HOW TO DO that. Clearly this is not democracy, and this is just 'EMOTIONAL CHAVNISM' which once Winstain Charchill predicted denouncing Indian Independence struggle. the self certified Deshbhakts are putting the country's democray and integrity in danger with their over excited acts. The least they can do is, if they are really concerned about the people, contest next elections, go to people with their agenda and explain the failures of the current govt and if people get convinced with them, they can easily win and rule as they want.

    ReplyDelete
  7. Good observation.It would have been great if you had given some thoughts for the corruption UPA had inflicted like never before. The inability of the present PM to tackle any issue has led to all this. To put it simple if PM don't know how to lead he should hang up and give chance to others. Being a captain and seeing the ship sinking makes him no better than Nero.

    ReplyDelete
  8. Thanks. Not just ManmohanSingh, there are many other Neros. There is a Nero-CM who teach action-reaction theories, when thousands of innocent minorities are being murdered on streets , just for the reason of being born in a religion. There is a Ex-Nero-PM, who cried and wrote kavitas on this genocide, but could not dare to sack the irresponsible CM from the post. There are many Neros and people have to choose among these Neros only based on their preferences. 'll write a seperate post ,abt why I critised Anna's team only instead of Govt. Thx.

    ReplyDelete
  9. మీవి అర్థంలేని ప్రశ్నలు. కావాలంటే మీరు/నేను/పావని గారు నిరాహార దీక్షకు అలాంటి ఏ అంశం పైనైనా ఆమరణ నిరాహారకు దీక్షకు కూచుంటే, తిహార్ కాదు కదా చెంచల్గూడ జైలుకు కూడా వెళ్ళము, ఏ కానిస్టేబులో వచ్చి ఇన్‌స్టంట్ పరిష్కారం చేయగలడు, చేయాలి కూడా.
    రాందేవ్ బాబా విషయంలో ఏమైందో తెలిసుకదా? జగన్, చంద్రబాబు కూడా మద్దతిచ్చారు, వాళ్ళు నిరాహారదీక్షకు కూచునివుంటే ఏమయ్యేదో ఎవరైనా వూహించగలరు. పోరాటానికి ఎంచుకున్న అంశం, నెలకొన్న పరిస్థితులు, ప్రజల మద్దతు, మూడ్, పాలకుల అసమర్థత, వ్యక్తి యొక్క విశ్వసనీయత ... ఇవన్నీ కలిసిరావాలి. ఆన్నాని జైలునుంచి ప్రభుత్వం బయటకు పంపించేందుకు ఎంత హైరానా పడిందో తెలుసుకుంటే, ఆన్నా ఎందుకు పట్టుదల(మీరు మొండితనం అంటారేమో) చూపించాడో అర్థమవుతుంది. 3రోజుల అనుమతితో పోయేదాన్ని, 15రోజులకు ఎలా పొడిగించబడిందో కూడా చూడాలి. మీరు చెప్పినవన్నీ ఎవరో ఒకరు ఎపుడో చేసి విఫలమయ్యారు.

    అన్నా ఎక్కడో 2.2లక్షలు దుర్వినీయోగపరిచాడనుకున్నా, బిలియన్లు మింగిన ప్రభుత్వాధినేతలు ప్రజలను అంగీకరింప చేయడంలో నవ్వులపాలయ్యారు అనేది గమనించాలి.

    ReplyDelete
  10. ప్రశ్నలో అర్థం ఉందా లేదా అనేది చూసే వ్యక్తుల్ని బట్టి ఉంటుంది. జగన్,చంద్రబాబు మద్దతివ్వడమో, 15 రోజులు అన్నం మానేయడమో, తీహార్ జైలుకు వెల్లడమో..ఇవే విజయాలనో,ఘన కార్యాలనో అనుకుంటే ఇక చెప్పేదేమీలేదు. సాక్షాత్తూ కేంద్రమంత్రి రాజా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అట్లే ఓ ముఖ్యమంత్రి కూతురు మరియు MP కూడా ఐన కనిమొళి, కల్మాడీ, వందల కోట్ల డబ్బున్న హసన్ అలీ లాంటి వారందరూ ఇప్పుడు ఊచలు లెక్కబెడ్తున్నారు. ఇదంతా లోక్పాల్ లేకుండానే, ప్రస్తుతం ఉన్న చట్టాలతోనే జరింగింది. గత ఐదేల్ల కాలంలో ఎన్నో స్కాములు వెలుగు లోకి రావడానికి ప్రధాన కారణం - 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టం. ఎవరో నిరాహార దీక్ష చేసి బెదిరిస్తే ప్రభుత్వం ఈ చట్టం తేలేదు కదా? ఐనా ప్రభుత్వం చక్కగా పనిచేస్తుందనో, ఉద్యమాలు అవసరం లేదనో ఇక్కడ ఎవరూ అనట్లేదు. ప్రజలను అవినీతికి వ్యతిరేకంగా ఎవరు ఉత్తేజపరిచినా,ఉద్యమించినా అభినందించవలసిందే. కానీ అవినీతిని అడ్డంపెట్టుకుని ఓ ప్రజాస్వామ్యయుత్నగా ఎన్నికైన ప్రభుత్వాన్ని శాశించాలని చూడడమే అసలు సమస్య. సమాజంపైన అంత బాధ్యత ఉందనుకుంటే.. మరో మూడేల్లలో పార్లమెంటుకు ఎన్నికలొస్తాయి. ఓ కొత్త పార్టీ పెట్టొ, లేదా ఉన్న పార్టీల్లో ఏదైనా మంచిదనుకుంటే దానిలో చేరిపోయో ప్రజలవద్దకు వెల్లి. ఎన్నికల్లో గెలిచి ఏ చట్టం కావాలో చేసుకోమనండి. మరో మూడేల్లు ఆగలేరా..?లేక ప్రజల విచక్షనా ఙానం మీద అణుమానమా? లేక ప్రజలు నమ్మరేమో నని భయమా..? అఖండ ప్రజా ఉద్యమం అంటున్నారు కదా.. అదే నిజమైతే తప్పకుండా గెలుస్తారు.ఓటేసే ప్రజలందరికీ మనకున్నన్ని తెలివితేటలు, సమాజం పట్ల బాధ్యత ఉన్నాయి.అదే ప్రజాస్వామ్య విజయం అంటే. Thanks.

    ReplyDelete
  11. కెసి‌ఆర్ తన ఉద్యమంలో ఆర్థికంగా వెనుకబడినవాళ్ళనే ఎక్కువగా కలుపుకున్నాడు. ధనవంతులతో కలిసి ఉద్యమం నడుపుతున్న అన్నా హజారేకి కెసి‌ఆర్‌తో పోలికే లేదు. కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకి నేను అనుకూలమే కానీ ఆర్థిక ప్రాతిపదిక రిజర్వేషన్లని కూడా వ్యతిరేకించే అరవింద్ కెజ్రివాల్ లాంటి పక్కా ప్రతిరోధకవాదులు అన్నా హజారే ఉద్యమంలో ఉండడం నాకు అసహ్యం కలిగించింది.

    ReplyDelete
  12. @ praveen..
    so kcr is greater than anna hazare..

    ReplyDelete