"మతకలహాలు కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే చేయిస్తున్నట్లు మా దగ్గర సమాచారం ఉంది. నిందితుల్ని తొందర్లోనే అరెస్టు చేస్తాం- వారిని వదిలేది లేదు-" మతకలహాలు జరిగిన ప్రతిసారీ మన పోలీసు బాసులు వల్లె వేస్తున్న రొటీన్ డైలాగులు ఇవి. కానీ ఇప్పటిదాకా జరిగిన అనేక మతకలహాల్లో ఏ ఒక్కరికైనా శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఆ కుట్రదారులు ఎవరో, దేనికోసం వారు ఈ దారుణాలకి ఒడిగడుతున్నారో ఏ ఒక్కసారైనా ఆధారాలతో నిరూపించలేదు.
మత కలహాల్ని సృష్టించేది ఎవరైనా వారు ఏదో ప్రయోజనాన్ని ఆశించే చేస్తుంటారనేది మాత్రం సుస్ఫష్ఠం. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న మతకలహాల్నే తీసుకుంటే, మొదట ఎవరు ప్రారంభించినా, గొడవలన్నీ ముగిసే సరికి బాధితులు,నిందితులు ఇరువైపులా ఉంటున్నారు. ఈ బాధితుల్ని పరామర్శించటం, పోలీసులు నిందితులుగా అణుమానించి అరెస్టులు చేసిన వారిలో నిజంగానే ఎవరైనా అమాయకులు ఉంటే వారి తరపున న్యాయపోరాటం చేసి, చట్ట ప్రకారం వారిని విడిపించేలా ప్రయత్నించటం ఆ ప్రాంత రాజకీయ నాయకుల బాధ్యత. పరామర్శల విషయమే తీసుకుంటే ఇరు మతాల్లో ఓటు బ్యాంకులు ఉన్నాయనుకునే తెలుగుదేశం, కాంగ్రెస్ లాంటి పార్టీల నాయకులు ఇరు వర్గాల బాధితుల దగ్గరికీ వెల్తారు. ఆల్రేడీ ప్రత్యర్థి వర్గం చేతిలో అప్పుడే గాయపడి/నష్ట పోయి ఉండటం వల్ల వీరు తమ ఆవేదనని కాస్త గట్టి గానే వెల్లగక్కుతారు. ఆ మతం వారే మొదట తమ మీద దాడి చేశారని, తాము మాత్రం పూర్తి అమాయకులమని, అసలు తాము వారి మీద ఒక్కరాయిని కూడా విసరలేదనీ ఇలా తమ వైపు వాదనల్నే వినిపిస్తారు. ఇది సహజం. ఈ విషయం ఆ నాయకులకి కూడా తెలుసు కాబట్టి, ఓ అవునా, అలా చేశారా, సరే.. వారిని చట్ట ప్రకారం విచారించి శిక్షిస్తాం లాంటి రొటీన్ డైలాగులు ఇరువర్గాలకీ చెప్పి పరామర్శల కార్యక్రమం మమా అనిపించేస్తారు. అదే మతతత్వ పార్టీలైన BJP.MIM లైతే ఇరువర్గాలనీ కాకుండా, కేవలం తమ వర్గ బాధితుల్ని మాత్రమే పరామర్శిస్తారు. ఎదుటి వర్గం గురించి వారు చెప్పే విషయాలకు చలించి పోతున్నట్లుగా, రెచ్చిపోతున్నట్లుగా నటిస్తారు. బేసికల్గా ఆ వర్గం వారు అంతేననీ, వారికి ఓ గట్టి గుణపాఠం చెప్తే తప్ప బుద్దిరాదని, ప్రస్తుత ప్రభుత్వం ఓట్ల కోసం వారికి వంత పాడుతుందని అదే తమ ప్రభుత్వం గనక అధికారంలో ఉండి ఉంటే ఇలా జరిగేది కాదనీ.. ఐనా సరే వారి రక్షణకోసం తాము ప్రాణాలకు తెగించైనా పోరాడతామనీ.. ఇలా అప్పటికే వారిలో ఉన్న ఆవేశాన్ని మరింతగా రగిలించడానికి ప్రయత్నిస్తారు. ప్రజలకి అభివృద్ధి,మంచి పాలన,పారదర్శకత - వీటన్నిటికన్నా 'రక్షణ ' అనేది అత్యంత ముఖ్యమైనఅంశం కాబట్టి, ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లలో, ఏ పార్టీ ఐతే తమకు పూర్తి రక్షణని కల్పించగలదో దానికే ఓట్లేస్తారు. అంటే ఇరువైపులా సమ్యమనం పాటించండి అని తటస్థంగా చెప్పే తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్మ్యూనిస్ట్ ల లాంటి లౌకిక వాదపార్టీలకంటే, 'వారి ' నుండి మీకు రక్షణ కల్పిస్తామని కాటగారికల్ గా చెప్పే MIM,BJP లాంటి పార్టీలకే ఆయా వర్గాలు ఓట్లేస్తాయి. ఈ రకంగా మత పరమైన గొడవలు జరిగినప్పుడు, ప్రజలు మతాల వారీగా చీలిపోయి మతతత్వ పార్టీలు బలపడతాయి. ఒకప్పుడు పార్లమెంట్లో కేవలం 2 స్థానాలున్న BJP అనతి కాలంలోనే కేంద్రంలో అధికారంలోకి రావడానికీ(రామ మందిర వివాదం ప్రధాన ఎజెండాగా), అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నా పాతబస్తీ ప్రజలు ప్రతిసారీ MIM నే గెలిపించడానికీ ఈ మతపరమైన విభజనలే కారణం. కాబట్టి ఇలాంటి మతపరమైన విభజనలవల్ల అత్యధికంగా లాభపడేది ఇలాంటి పార్టీల నాయకులు, వారి అనుచరులు మాత్రమే. ఇక నష్టపోయేది మాత్రం ఇరువైపులా ఉన్న సాధారణ జనం.
Related Previous posts -

No comments:
Post a Comment