Showing posts with label communalism. Show all posts
Showing posts with label communalism. Show all posts

Monday, April 16, 2012

ఉస్మానియాలో పెద్ద కూర పండగ - BJPకి పెద్ద గండం

బీఫ్ తినడం- కొంతకాలం క్రితం వరకూ అతివాద హిందూ గ్రూపులకి ఇది చాలా ఇష్టమైన పదం. ఎందుకంటే, వీరిదృష్టిలో హిందువులెవ్వరూ బీఫ్ తినరు. కేవలం ముస్లింలు మాత్రమే తింటారు. అది కూడా హిందూ సంస్కృతిని పరిహాసం చేయడానికే తింటారు. బీఫ్ తినని 80% శాతం మంది హిందువుల(క్రిష్టియన్లు,ముస్లింలూ కానివారందరూ హిందువులేననే వీరి లెక్క ప్రకారం) మనోభావాలు గాయపరచడం కోసమే తింటారు... ఇలాంటి పలు ఆవేశపూరిత విషయాల్ని హిందూ ఓటర్లకి వివరించి వారిని ముస్లింల పైకి ఉసిగొల్పడంలో, తద్వార వారి ఓట్లను కొల్లగొట్టడంలో ఇన్నాల్లూ ఈ విషయం వారికి బాగా ఉపయోగపడింది. కానీ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో దలిత విద్యార్థి సంఘాల నాయకత్వంలో జరుగుతున్న బీఫ్ ఫెస్టివల్ వీరి ఆశలకి భారీగా గండికొడుతుంది.    ఈ ఫెస్టివల్ లో భాగంగా జరిగిన అనేక అవగాహన సదస్సుల్లో పాల్గొన్న వక్తలు, పెద్ద కూరతినడం దలిత సంస్కృతిలో అనాదిగా ఎలా భాగమైందో వివరించడంతో పాటు, ప్రస్తుత పరిస్థితుల్లో హాస్టల్ మెనూల్లో బీఫ్ ని చేర్చాల్సిన అవసరాన్ని కూడా కూలంకషంగా వివరించడం జరిగింది. వీరు చెప్పేదేమిటంటే, బీఫ్ లో పోషక విలువలు అత్యధికంగా ఉంటాయి. ఇతర మాంసాహారాలైన చికెన్,మటన్ లాంటివి ప్రస్తుతం చాలా ఖరీదైపోయాయి. 100 రూపాయలకి వచ్చే చికెన్,మటన్లతో పోల్చితే, అదే రేటుకు వచ్చే బీఫ్ పరిణామం చాలా ఎక్కువగా ఉంటుంది. కావున పేదరికం,పౌష్టికాహార లోపంతో బాధపడే దలిత విధ్యార్థులకి బీఫ్ తినడం అనేది అత్యావశ్యకం.  ఈ విధంగా, ఇన్నాల్లూ అదేదో ముస్లింలు మాత్రమే చేసే (బీఫ్ ముట్టని ముస్లింలు కూడా అనేక మంది ఉన్నారు. వీరిలో కూడా పేద ముస్లింలే ఎక్కువగా బీఫ్ తింటారు. )  ఘోర అపరాధంగా,దేశద్రోహ సమానమైన నేరంగా చాటింపు వేసుకుంటూ బతికేసిన BJP,RSS,ABVPలాంటి సంఘాలకు, తీరా ఇప్పుడు దానికి ప్రతికూలమైన వాదనలు దేశజనాభాలో అత్యధికంగా ఉన్న దలిత,వెనుకబడిన వర్గాల నుండి రావడంతో, గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్టుగా ఐంది. ఇప్పుడు సంస్కృతి,మనోభావాలు లాంటి భారీ డైలాగులతో, భౌతిక దాడులతో  ఈ దలిత సంఘాలతో పెట్టుకుంటే, 'అంటే మేము బీఫ్ తిన్నంత మాత్రాన హిందువులం కాకుండా పోతామా?' అని వీరు అనేయగలరు. దానికి అవునంటే, ఆ నిర్వచనం ప్రకారం  దేశ హిందూ జనాభా ఎంతో మరో సారి లెక్కించ వలసి ఉంటుంది. అంటే BJP ఓటుబ్యాంకుకు పెద్ద గండి అన్నమాట. (హిందూయేతరులు BJPకి ఎట్టిపరిస్తితుల్లో ఓటు వేయరు. అసలు వారి ఓట్లను పొందాలనే ప్రయత్నం కూడా ఆ పార్టీ ఎప్పుడూ చేయదు.). 'సరే తినండి' అంటే, ఇన్నాల్లూ ముస్లింల మీద ఇదే సాకు చూపి విద్వేషం చిమ్ముతూ, తమ పాలన ఉన్నరాష్ట్రాల్లో గోవధకి, మనుషుల వధకన్నా కృరమైన చట్టాలు చేసిపెట్టుకుని,(ఉదాహరణకి, మధ్యప్రదేశ్లో పోలీసులు ఎవరైనా ఓ వ్యక్తిపై ఓ మనిషిని చంపినట్లు నేరం మోపితే అతడు ఆ నేరం చేశాడని నిరూపించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. అదే ఓ వ్యక్తిపై గోవధ చేసినట్లు నేరం మోపితే, అతడు నేరం చేయలేదని నిరూపించుకోవలసిన బాధ్యత ఆ నిందితునిపై మాత్రమే ఉంటుంది. ఒకవేల అతను నిరూపించుకోలేకపోతే అత్యధికంగా యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించవచ్చు. ) వీటి ద్వారా అక్కడి మైనారిటీల్ని హింస్తిస్తున్న తమ కపటత్వం బయటపడుతుంది. 
కావున ఎలా చూసుకున్నా, ఉస్మానియా లో మొదలైన ఈ బీఫ్ ఫెస్టివల్, భవిష్యత్తులో  BJP కి పెనుసవాలుగా మారనున్నటం సుష్పష్టం.

Saturday, April 14, 2012

ఈ పాడు పని కూడా వారిదే!!!

టైంస్ ఆఫ్ ఇండియా లో వచ్చిన ఈ వార్త చూడండి.

http://timesofindia.indiatimes.com/city/hyderabad/Saffron-extremists-desecrated-temple-to-trigger-riots-Cops/articleshow/12657326.cms

 వారికి కావలసింది -ప్రజలు మతాల వారిగా విడిపోవాలి, ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవాలి-ఒకరిపై ఒకరికి ద్వేషం కలగాలి. అప్పుడు హిందూ పరిరక్షకులమని వీరు ఎంటరవుతారు. ప్రభుత్వం, పోలీసులు,కోర్టులు అందరూ ముస్లింల పక్షం వహించి హిందువులకు ద్రోహం చేస్తున్నాయని గొంతు చించుకుంటారు. తాము అధికారంలో ఉంటే ఇలా జరగదని నమ్మబలుకుతారు. క్రమంగా ఓటుబ్యాంకును పెంచుకుంటారు. Fishing in Troubled waters అనేది వీరికి బాగా ఒంటబట్టింది.దీని ద్వారా వీరికి కావలసిన రాయకీయాధికారం విజయవంతంగా పొందుతారు. పాపం.. వీరి వలలో పడే ఆ అమాయక చేపలే బలయ్యేది..
Related Previous posts - 

ఆ పాడు పని చేసింది వాల్లే..(ఇలాంటి వార్తలు తెలుగు పేపర్లలో రావు. )  http://andamainacheekati.blogspot.in/2012/01/blog-post.html 

'ఆత్మస్థుతి-పరనింద ' మాంచి కిక్ ఇచ్చే కాంబినేషన్ http://andamainacheekati.blogspot.in/2010/12/blog-post_24.html

Sunday, April 8, 2012

మతకలహాలు--లాభనష్టాలు

"మతకలహాలు కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే చేయిస్తున్నట్లు మా దగ్గర సమాచారం ఉంది. నిందితుల్ని తొందర్లోనే అరెస్టు చేస్తాం- వారిని వదిలేది లేదు-" మతకలహాలు జరిగిన ప్రతిసారీ మన పోలీసు బాసులు వల్లె వేస్తున్న రొటీన్ డైలాగులు ఇవి. కానీ ఇప్పటిదాకా జరిగిన అనేక మతకలహాల్లో ఏ ఒక్కరికైనా శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఆ కుట్రదారులు ఎవరో, దేనికోసం వారు ఈ దారుణాలకి ఒడిగడుతున్నారో ఏ ఒక్కసారైనా ఆధారాలతో నిరూపించలేదు. 
మత కలహాల్ని సృష్టించేది ఎవరైనా వారు ఏదో ప్రయోజనాన్ని ఆశించే చేస్తుంటారనేది మాత్రం సుస్ఫష్ఠం. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న మతకలహాల్నే తీసుకుంటే, మొదట ఎవరు ప్రారంభించినా, గొడవలన్నీ ముగిసే సరికి బాధితులు,నిందితులు ఇరువైపులా ఉంటున్నారు. ఈ బాధితుల్ని పరామర్శించటం, పోలీసులు నిందితులుగా అణుమానించి అరెస్టులు చేసిన వారిలో నిజంగానే ఎవరైనా అమాయకులు ఉంటే వారి తరపున న్యాయపోరాటం చేసి, చట్ట ప్రకారం వారిని విడిపించేలా ప్రయత్నించటం ఆ ప్రాంత రాజకీయ నాయకుల బాధ్యత. పరామర్శల విషయమే తీసుకుంటే ఇరు మతాల్లో ఓటు బ్యాంకులు ఉన్నాయనుకునే తెలుగుదేశం, కాంగ్రెస్ లాంటి పార్టీల నాయకులు ఇరు వర్గాల బాధితుల దగ్గరికీ వెల్తారు. ఆల్రేడీ ప్రత్యర్థి వర్గం చేతిలో అప్పుడే గాయపడి/నష్ట పోయి ఉండటం వల్ల వీరు తమ ఆవేదనని కాస్త గట్టి గానే వెల్లగక్కుతారు. ఆ మతం వారే మొదట తమ మీద దాడి చేశారని, తాము మాత్రం పూర్తి అమాయకులమని,  అసలు తాము వారి మీద ఒక్కరాయిని కూడా విసరలేదనీ ఇలా తమ వైపు వాదనల్నే వినిపిస్తారు. ఇది సహజం. ఈ విషయం ఆ నాయకులకి కూడా తెలుసు కాబట్టి, ఓ అవునా, అలా చేశారా, సరే.. వారిని చట్ట ప్రకారం విచారించి శిక్షిస్తాం లాంటి రొటీన్ డైలాగులు ఇరువర్గాలకీ  చెప్పి పరామర్శల కార్యక్రమం  మమా అనిపించేస్తారు. అదే మతతత్వ పార్టీలైన BJP.MIM లైతే ఇరువర్గాలనీ కాకుండా, కేవలం తమ వర్గ బాధితుల్ని మాత్రమే  పరామర్శిస్తారు. ఎదుటి వర్గం గురించి వారు చెప్పే విషయాలకు చలించి పోతున్నట్లుగా, రెచ్చిపోతున్నట్లుగా నటిస్తారు. బేసికల్గా ఆ వర్గం వారు అంతేననీ, వారికి ఓ గట్టి గుణపాఠం చెప్తే తప్ప బుద్దిరాదని, ప్రస్తుత ప్రభుత్వం ఓట్ల కోసం వారికి వంత పాడుతుందని అదే తమ ప్రభుత్వం గనక అధికారంలో ఉండి ఉంటే ఇలా జరిగేది కాదనీ.. ఐనా సరే వారి రక్షణకోసం తాము ప్రాణాలకు తెగించైనా పోరాడతామనీ.. ఇలా అప్పటికే వారిలో ఉన్న ఆవేశాన్ని మరింతగా రగిలించడానికి ప్రయత్నిస్తారు.  ప్రజలకి  అభివృద్ధి,మంచి పాలన,పారదర్శకత - వీటన్నిటికన్నా 'రక్షణ ' అనేది అత్యంత ముఖ్యమైనఅంశం కాబట్టి, ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లలో, ఏ పార్టీ ఐతే తమకు పూర్తి రక్షణని కల్పించగలదో దానికే ఓట్లేస్తారు. అంటే ఇరువైపులా సమ్యమనం పాటించండి అని తటస్థంగా చెప్పే తెలుగుదేశం, కాంగ్రెస్, కమ్మ్యూనిస్ట్ ల  లాంటి లౌకిక వాదపార్టీలకంటే, 'వారి ' నుండి మీకు రక్షణ కల్పిస్తామని  కాటగారికల్ గా చెప్పే MIM,BJP లాంటి పార్టీలకే ఆయా వర్గాలు ఓట్లేస్తాయి. ఈ రకంగా మత పరమైన గొడవలు జరిగినప్పుడు, ప్రజలు  మతాల వారీగా చీలిపోయి మతతత్వ పార్టీలు బలపడతాయి. ఒకప్పుడు పార్లమెంట్లో  కేవలం 2 స్థానాలున్న BJP అనతి కాలంలోనే కేంద్రంలో అధికారంలోకి రావడానికీ(రామ మందిర వివాదం ప్రధాన ఎజెండాగా), అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నా పాతబస్తీ ప్రజలు ప్రతిసారీ MIM నే గెలిపించడానికీ ఈ మతపరమైన విభజనలే కారణం. కాబట్టి ఇలాంటి మతపరమైన విభజనలవల్ల అత్యధికంగా లాభపడేది ఇలాంటి పార్టీల నాయకులు, వారి అనుచరులు మాత్రమే. ఇక నష్టపోయేది మాత్రం ఇరువైపులా ఉన్న సాధారణ జనం. 
Related Previous posts - 

ఆ పాడు పని చేసింది వాల్లే..(ఇలాంటి వార్తలు తెలుగు పేపర్లలో రావు. )  http://andamainacheekati.blogspot.in/2012/01/blog-post.html 

'ఆత్మస్థుతి-పరనింద ' మాంచి కిక్ ఇచ్చే కాంబినేషన్ http://andamainacheekati.blogspot.in/2010/12/blog-post_24.html