తిండి మానేసి నేను చెప్పినట్లు చేయకుంటే చస్తానని బెదిరించే ప్రతివాడూ గాంధీగారిలా ఫీలైపోవడం శోచనీయం. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే పని ఎవరు చేసినా వారికి గుడ్డిగా మద్దతు పలికే ప్రతిపక్షాలు, TRP రేటింగ్ల కోసం గోరంతను కొండత చేసి చూపడంలో పోటి పడుతున్న మీడియా, వీరందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు.
మొన్నటికి మొన్న, తెలంగాణా ప్రకటించకపోతే చస్తానంటూ KCR నిరాహారదీక్షకు పూనుకున్నాడు. ఇంకేముంది పోతాండంట..పోబోతున్నాడంట..కోమా అంట.. అంటూ ఒకటే ఫ్లాష్ న్యూసులు. సహజంగానే చావు అనేది బలమైన సెంటిమెంట్ కాబట్టి ప్రజల్లో కూడా ఎక్కడలేని సానుభూతి. ఎద్దుపుండు కాకికి ముద్దన్నట్లుగా, నిరాహార దీక్ష భగ్నం చేయడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాన్ని ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అంటూ, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రతిపక్షాలు ఉండనే ఉన్నాయి.ఇక వేరే గత్యంతరం లేక కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9 ప్రకటన చేయడం, చర్చలు,సంప్రదింపులు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ తర్వాత జరిగిన సంఘటనలు తెలిసిందే.
KCR దీక్ష నుండి స్పూర్తి పొందాడో ఏమో గానీ, అవినీతి గురించి ఇప్పుడే తెలిసినట్లుగా, ఇప్పటికిప్పుడే దానిని అంతమొందిస్తానన్నట్లుగా దీక్షలకు పూనుకుంటున్నాడు అన్నా హజారే. ఇక peepli live మీడియా, ప్రభుత్వానికి మైనస్ ఐతే, మనకు ప్లస్సే అనుకునే ప్రతిపక్షాలు ఉండనే ఉన్నాయి.
సరే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? అన్నా హజారే బృందం చెబుతున్నట్లుగా వారు తయారు చేసిన లోక్పాల్ బిల్లుని పార్లమెంటులో పెట్టి ఆమోదించేయడమా? ఇక ఆ తర్వాత వీరు మల్లీ ఇలాంటి దీక్షలకు పూనుకోకుండా మూటా ముల్లే సర్దుకుని,పౌర సమాజాన్ని మూసేసుకుని హిమాలయాలకు వెల్లిపోతారా..? లేక, దేశ ప్రజలకు ప్రభుత్వం పైన కంటే, ఇలాంటి పౌర సమాజం పైన మాత్రమే నమ్మకముంది కాబట్టి పార్లమెంటుని, అసెంబ్లీలని రద్దు చేసి, అన్నా హజారే గారి అధ్యక్షతన పౌరసమాజాన్నే పాలించమందామా..?
అన్నా హజారే దీక్షకు వస్తున్న స్పందనను చూసి, భవిష్యత్తులో మరికొంత మంది నాయకులు ఇలా దీక్షల బాట పడితే పరిస్తితి ఏంటి..?
ఉదాహరణకి ముంబై లోని మరాఠా ప్రజలకి అన్యాయం జరిగి పోతుందని బాల్ ధాకరే గారు మహారాష్ట్ర లోని ఊరూ వాడా తిరిగి, ఉన్నవి లేనివీ జనాలకి నూరిపోసి, ముంబై నుండి ఇతరుల్ని తరిమి వేయాలని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే..?
తమిళులకి దేశంలో తీరని అన్యాయం జరుగుతుందనీ, తమిలులకి, కాష్మీర్ తరహా ప్రత్యేక మినహాయింపులో,లేక ప్రత్యేక దేశమో కావాలని కరుణానిధి నిరాహార దీక్షకు పూనుకుంటే..?
ఉదాహరణకి ముంబై లోని మరాఠా ప్రజలకి అన్యాయం జరిగి పోతుందని బాల్ ధాకరే గారు మహారాష్ట్ర లోని ఊరూ వాడా తిరిగి, ఉన్నవి లేనివీ జనాలకి నూరిపోసి, ముంబై నుండి ఇతరుల్ని తరిమి వేయాలని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే..?
తమిళులకి దేశంలో తీరని అన్యాయం జరుగుతుందనీ, తమిలులకి, కాష్మీర్ తరహా ప్రత్యేక మినహాయింపులో,లేక ప్రత్యేక దేశమో కావాలని కరుణానిధి నిరాహార దీక్షకు పూనుకుంటే..?
దేశంలో రిజర్వేషన్ల వల్ల అగ్రకులాల యువకులకు తీరని అన్యాయం జరుగుతుందనీ, రిజర్వేషన్లను ఎత్తేయ్యాలనీ ఏ సుబ్రమన్య స్వామి లాంటి వారో ఆమరణ నిరాహార దీక్ష కి సిద్ధపడితే. సహాజంగానే అగ్రకులాల ప్రజలు ఆయన దీక్షకు మద్దతుగా తండోపతండాలుగా తరలి వస్తారు.ఇక peepli live మీడియా ఉండనే ఉంది.
ఇక అప్పుడు రిజర్వేషన్లను తీసేద్దామా..?
ఇప్పటికే ఎలక్షన్ల నిర్వహణకి బోలెడంత ప్రజాధననం ఖర్చవుతుందంట. కాబట్టి భవిష్యత్తులో ఎలక్షన్లను నిషేధించి వాటి స్థానంలో దీక్షల పోటీలను పెట్టాలి. అంటే ఎవరు ఎక్కువ రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆ నాయకునికి దేశంపైన,ప్రజలపైన అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్లు నిర్ధారించి వారికే పాలించే అవకాశం ఇవ్వాలి. జై దీక్షలు..జై జై దీక్షలు.
My previous post on the similar topic:
http://andamainacheekati.blogspot.com/2011/06/blog-post.html
My previous post on the similar topic:
http://andamainacheekati.blogspot.com/2011/06/blog-post.html