M.F హుస్సేన్ అనగానే వివాదాలు గుర్తుకొస్తాయి. హుస్సేన్ గీసిన అనేక రకాల పైంటింగ్స్ లో బూతు బొమ్మల కింద వివాదాస్పద మైనవి కొన్ని మాత్రమే. అతను గీసినవన్నీ దేవతల బూతు బొమ్మలే కావు, కేవలం వాటితోనే అతను పాపులర్ పైంటరూ కాలేదు.
1996లో 'విచార్ మీమాంస ' అనే హిందీ పత్రిక, హుస్సేన్ గీసిన కొన్ని చిత్రాలను ప్రచురించి అతను హిందూ దేవతల్ని అవమానిస్తున్నాడని తీర్మానించడంతో వివాదం మొదలైంది. అప్పటి దాకా దేశంలో గొప్ప పైంటర్లలో ఒకడిగా వెల్గొందుతున్న హుస్సేన్, రాత్రికి రాత్రి హిందూ ద్వేషిగా ముద్ర వేయబడ్డాడు. శివసేన, భజరంగ్ దల్ లాంటి సంస్థలు హుస్సేన్ ఇంటి మీద దాడిచేయడం, అతని ఆర్ట్ గ్యాలరీల్ని ధ్వంసం చేయడం లాంటివి చేయడంలో పోటీలు పడ్డాయి. ఈ బొమ్మలు గీసింది ఏ రమేశో, సురేశో ఐతే పరిస్తితి ఎలా ఉండేదో గానీ, 'హుస్సేన్ ' అనే పేరు కావడంతో ఇక ఎవరికీ అతను హిందూ దేవతల్ని అవమానిస్తూనే గీశాడా లేదా అని అణుమానించాల్సిన అవసరం కనపల్లేదు. హుస్సేన్ మీద దేశంలోని అనేక కోర్టుల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయబడ్డాయి. దేశంలో అతని ప్రదర్శనల్ని ప్రతిసారీ ఆందోళనకారులు అడ్డుకోవడం జరిగింది. ఈ పరిణామాలతో మనస్థాపం చెందిన హుస్సేన్ దేశం వదిలి పారిపోయి ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది.
నిజానికి ఆ పత్రిక ప్రచురించిన హుస్సేన్ చిత్రాలు అతను 1970లో గీసినవి. 1970 నుండి, 1996లో ఓ పత్రిక ప్రచురించే వరకూ, ఈ 26 ఏళ్ళ కాలంలో ఏ హిందువూ వాటిని చూడలేదా..? హుస్సేన్ ఆ చిత్రాల్ని ముస్లింలో, క్రిష్టియన్లో చూసి ఆనందించాలని రహస్యంగా గీశాడా..? వాటిని కేవలం అరబ్ దేశాల్లోనో, క్రిష్టియన్ దేశాల్లోనో ప్రదర్శనకి పెట్టాడా..?
హుస్సేన్ గీసిన ఈ చిత్రాలు ఆ 26 ఏళ్ళలో బారతడేశంలోనే, అనేక ఆర్ట్ గ్యాలరీల్లో ప్రదర్శించబడ్డాయి. అనేక మంది వీటిని చూసి హుస్సేన్ ప్రతిభని కొనియాడారు. ఈ అనేక మందిలో, చిత్రకారులు, చిత్ర లేఖనం పట్ల ఆసక్తి కలవారు ఉంటారు. వీరిలో కూడా అత్యధికులు హిందువులే ఉంటారనేదాంట్లో సందేహం లేదు. పాపం వీరెవరూ ఆ చిత్రాల్లోని బూతుని కనిపెట్టలేక పోయారు, ఓ పత్రిక చెప్పేదాకా..
ఇక మరో వివాదాస్పద బంగ్లాదేశీ రచయిత తస్లీమా నస్రీన్ కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. తన పుస్తకం 'లజ్జ ' లో ఇస్లాంకి వ్యతిరేకంగా రాసిందనే అభియోగం మీద అక్కడి మత సంస్థలు తస్లీమా తలకి వెలకట్టడంతో ఆమె బంగ్లాదేశ్ నుండి పారిపోయి వచ్చి భారత దేశంలో తలదాచుకుంటుంది.
హుస్సేన్, తస్లీమలను చూసే కోణాన్ని బట్టి దేశంలోని వివిధ వర్గాల/సంస్థల రాజకీయాలను అర్థం చేసుకోవచ్చు.
హుస్సేన్ పై దాడులను సమర్థిస్తూ, అతన్ని దేశం నుండి తరిమి వేయడాన్ని తమ విజయంగా భావించే శివసేన, భజరంగ్ దల్, VHP లాంటి సంస్థలు, తస్లీమ నస్రీన్ పై విమర్శల్ని మాత్రం మత మౌఢ్యంగా భావిస్తాయి. అట్లే ఆమెను భారత దేశంలో ఉంచుకోవడం గొప్ప మానవతా విషయంగా అభివర్ణిస్తాయి. అదే సమయంలో హుస్సేన్ ని దేశం నుండి వెల్లగొట్టడాన్ని ఆటవిక చర్యగా భావించే MIM లాంటి సంస్థలు, తస్లీమ నస్రీన్ ను మాత్రం భారత దేశం నుండి గెంటివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ రెండు వివాదాల్లో అసలు కీలకాంశం ' మత విషయాల్లో కళాకారుల స్వేచ్చకు పరిమితులేమిటి, చట్టాలు, కోర్టులు ఇలాంటి విషయాల్లో ఎంత వరకూ జోక్యం చేసుకోవచ్చు' అనేది. నిజానికి ఇదేమంత క్లిష్టమైన విషయం కాదు. కాకపోతే ఇలాంటి వాటికి పరిష్కారాల్ని వెతికేటప్పుడు, మన మతం, అవతలి మతం అంటూ గిరి గీసుకుని ఆలోచించినంత కాలం విభిన్న మతాలు కల మన భారత దేశంలాంటి చోట్ల , వీటికి పరిష్కారాలు దొరకటం కష్టమే. పైగా 'ఎద్దు పుండు కాకికి ముద్దు' అన్నట్లు ఇలాంటి వాటిలో తల దూర్చి తమ రాజకీయ ప్రయోజనాల్ని నేరవేర్చుకోవడానికి ప్రయత్నించే రాబందులు ఉండనే ఉన్నాయి.. అన్ని చోట్లా, అన్ని వైపులా..
ఇలాంటి రాబందులకి లొంగకుండా ప్రజలు ఎంత మెచ్యూర్ గా ఆలోచించగల్గుతున్నారు అనే దాని మీదనే ఆ దేశ/సమాజ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే రవీంద్రుడు చెప్పినట్లు - Where the clear stream of reason has not lost its way Into the dreary desert sand of dead habit...Into that heaven of freedom, my Father, let my country awake.. Aamen!!!

I AGREED 100% WITH YOUR POST ,WE SHOULD COME OUT OF BOX WHEN TREATING SUCH PERSONALITIES...THE Question is as they are artists were they allowed to do, or allowed to write the things which hurt the feelings of any group?
ReplyDelete26 ఏళ్ళ పాటు ఈ బూతు బొమ్మలని హిందువులు వ్యతిరేకించలేదంటే హిందూ మతం ఒక బలమైన విశ్వాసం కాదు అనడానికి ఇదే ఋజువు కదా. నేను బూతుకి వ్యతిరేకమే కానీ MF హుస్సేన్ మీద పడి ఏడ్చే మత చాంధసవాదులని సపోర్ట్ చెయ్యను.
ReplyDelete@raf raafsun:
ReplyDeleteThanks.
ఆర్టిస్టులకే కాదు, ఇతరుల మనోభావలను గాయపరిచే హక్కు ఎవరికీ లేదు. కాకపోతే, మనోభావాలను గాయపర్చాలని అదేపనిగా పూనుకుని చేశారా.. గాయపడితే ఎంత వరకూ గాయపడ్డాయి.. అలాంటప్పుడు ఎలాంటి శిక్షలు విధించాలి. ఇవన్నీ తేల్చటానికి నిష్పాక్షిక విచారణా సంస్థల్ని, చట్టాల్ని మనం ఏర్పాటు చేసుకోగలిగామా లేదా అన్నదే సమస్య. ఏ సారి అలా ఏర్పాటు చేసుకున్నాక, మనకి అవమానం జరిగిందహో అని ఎవరైనా రెచ్చగొట్టగానే వారి వెంట గొర్రెల్లా వెల్లి వ్యక్తుల మీద భౌతిక దాడులు చేయడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం లాంటివి కాకుండా, కాస్త సమ్యమనంతో ఆలోచించి చట్టప్రకారం వారిని శిక్షించే ప్రయత్నం చేయాలి. ఇదే అభివృద్ధి చెందిన సమాజం లక్షణం అనుకుంటాను.
నాకో చిన్న డౌట్ అండి, నిజమే 26 ఏళ్ళు ఈ హిందువు కి కనపడలేదు ఒక పత్రికో లేదా ఒక రాజకీయ పార్టీ నో చెప్పే వరకు . మరి మీరు ఏంటి ఎప్పుడో హుస్సేన్ చనిపోయాక ఇప్పుడు ఈ విషయం మీద రాస్తున్నారు ?
ReplyDelete@Sravya:
ReplyDeleteవిశేఖర్ గారి బ్లాగులో ఈ విషయం మీద చర్చ నడుస్తుంది.
http://teluguvartalu.com/2011/12/26/%E0%B0%AC%E0%B1%82%E0%B0%A4%E0%B1%81-%E0%B0%AC%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AE%E0%B0%A4-%E0%B0%B8%E0%B0%82%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A7%E0%B0%B2%E0%B1%81/
దానికి కామెంట్ రాద్దామని మొదలెట్టి, సైజు పెరగడంతో ఇలా నా బ్లాగులో ప్రచురించాను.
ఐనా, హుస్సేన్ చనిపోయినా అతని ప్రవాసం వెనకున్న రాజకీయాలు ఇప్పటికీ మారలేదని నాకు అనిపిస్తుంది. అందుకే రాశాను. ఒ.కె.నా
పై కామెంటుకి కొనసాగింపు..
ReplyDeleteపైగా తస్లీమా కూడా ఇంకా ప్రవాస జీవితం గడుపుతూనే ఉంది. తన దేశానికి వెల్లాలనుందని, కానీ పరిస్తితుల వల్ల వెల్లలేకపోతున్నాననీ ప్రతి ఇంటర్వ్యూ లోనూ చెప్పుకుంటుంది. అక్కడి(బంగ్లాదేశ్) రాజకీయాలు కూడా ఇలానే ఏడ్చాయి. సొంత ప్రజలకు,దేశానికి దూరమైన వీరి బాధను అర్థం చేసుకోవడం అంత కష్టం కాదనుకుంటా. అందుకే మత రాజకీయాల్ని, మంది న్యాయాన్ని (mob justice) నిరసిస్తూ ఈ పోస్టు రాశాను.
'లజ్జ' పుస్తకం నేను చదవలేదు కానీ MF గారి బొమ్మలు చూశాను.
ReplyDeleteరాముడి కారక్టర్ మీద జరిగినంత చర్చ, ఉన్నన్ని వివిధ అభిప్రాయాల ప్రచురణ వేరేవారి మీదైనా ఉందా? వారందరూ దేశం నుండి తరమబడుతున్నారా?
26 సంవత్సరాలు ఏమీ అనలేదు, అయినంత మాత్రాన, అనకూడదు అని లేదు కదా.. రాముడు/సీత/క్రీస్తు/బుద్ధుడు/ ఎవరైనా సరే, వాళ్ల ఫిలాసఫీ మీద వాళ్లు చేసిన తప్పొప్పుల మీద చర్చ నాకు కళాకారుల/మేధావుల/మామూలు మనుషుల ఫ్రీడం గా అనిపిస్తుంది.
వివస్త్రల్లా చిత్రీకరించటం మా ఫ్రీడం అంటే కష్టమే. ఆయన సమకాలీనులని వారి అనుమతి లేకుండా ఆయన అలా చిత్రీకరించ గలిగే వారా?
అలాగే, ఆయన గాలరీల విధ్వంసం ఖండించాల్సిన విషయమే. అది భారత దేశం లో ఆయన బహిష్కరణ జరగలేదనుకుంటున్నాను. ప్రజలు, కొన్ని సంస్థలు ఆయన మీద వేసిన వేలాది కేసుల వల్ల, ప్రదర్శనల పై అన్ని వైపులా ఉన్న నిరసన తో ఆయన అలిగి దేశ పౌరసత్వం వదులుకుని దేశం విడిచి వెళ్లారనుకుంటున్నాను.
It is quite okay for me , I don't have any objection on your post and view. But yes I am just curious to know onething .
ReplyDeleteఎప్పుడో చనిపోయిన హుస్సేన్ గురించి , ఆ చనిపోక ముందు జరిగిన పరిస్తితుల గురించి ఇప్పుడు చర్చిస్తున్న మీరు 27 సంవత్స్రరాలు హిందువులు ఎందుకు నోరు మూసుకు కూర్చుని ఉన్నారు అని అడగటం భావ్యమేనా అని ?
మనకి అవమానం జరిగిందహో అని ఎవరైనా రెచ్చగొట్టగానే వారి వెంట గొర్రెల్లా వెల్లి వ్యక్తుల మీద భౌతిక దాడులు చేయడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం లాంటివి కాకుండా, కాస్త సమ్యమనంతో ఆలోచించి చట్టప్రకారం వారిని శిక్షించే ప్రయత్నం చేయాలి. ఇదే అభివృద్ధి చెందిన సమాజం లక్షణం అనుకుంటాను.
------------------------------------
I completely agree with your point here.But at the same time especially the people like Hussain who have international fame should give value for the people's emotions, atleast after they came to know people's pulse.
పైగా తస్లీమా కూడా ఇంకా ప్రవాస జీవితం గడుపుతూనే ఉంది. తన దేశానికి వెల్లాలనుందని, కానీ పరిస్తితుల వల్ల వెల్లలేకపోతున్నాననీ ప్రతి ఇంటర్వ్యూ లోనూ చెప్పుకుంటుంది. అక్కడి(బంగ్లాదేశ్) రాజకీయాలు కూడా ఇలానే ఏడ్చాయి. సొంత ప్రజలకు,దేశానికి దూరమైన వీరి బాధను అర్థం చేసుకోవడం అంత కష్టం కాదనుకుంటా. అందుకే మత రాజకీయాల్ని, మంది న్యాయాన్ని (mob justice) నిరసిస్తూ ఈ పోస్టు రాశాను.
ReplyDelete---------------------------------------------
Ofcourse I got it and agree with you .
ప్రవీన్ శర్మ గారూ:
ReplyDeleteఇస్లాం, క్రైస్తవ మతాలు ఆరంభం నుండే పూర్తి వ్యవస్థాగతమైనవి. కానీ హిందూ మతం వ్యవస్థాగతం/సంఘటితమవడం అనేది 19వ శతాబ్దం చివరినుండే మొదలైంది. ఉదాహరణకి రామాయణం, మహాభారతాలు జానపత కథలుగా ఎప్పటి నుండో ఉన్నా, వాటిని మత గ్రంధాలుగా భావించడం బ్రిటీష్ వాల్లు వచ్చాకనే ఆరంభమైంది. ఎలాగంటే, బ్రిటీష్ వారు కోర్టుల్లో బైబిలు మీద ప్రమాణం చేస్తారు. అట్లే భారతదేశంలో బ్రిటీష్ వారు కోర్టుల్ని ఏర్పాటు చేశాక, హిందువుల్ని విచారించేటప్పుడు తమ పవిత్రగ్రంధాల్ని తెచ్చుకోమనే వారు, సో అలా వాటికి ప్రాశస్త్యం మొదలైంది.
తర్వాత వీలుచూసుకుని దీనిగురించి వివరంగా రాస్తాను.
26 సంవత్సరాల గురించి:
ReplyDelete26 సంవత్సరాలు అడగంది, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని నేను రాయలేదు.కానీ రాశానన్నట్లుగా కొందరు అర్థం చేసుకున్నారులా ఉంది...
నాకు చిత్రలేఖనం మీద ఆసక్తి లేదు. పైటింగ్స్ ని చూసి వాటిని విష్లేశించి రచయిత ఎంత నిగూడార్థంతో వాటిని గీశాడో చెప్పగలిగే శక్తి నాకు లేదు. అందుకే నేను వాటిని చూడ్డానికి కూడా ఎప్పుడూ వెల్లను. సామాన్య జనంలో దాదాపు 80% శాతం నాలాంటి వాల్లే అనుకుంటున్నాను. అంటే చిత్రలేఖనం పట్ల ఆసక్తి లేని వాల్లు. హుస్సేన్ గీసిన ఆ వివాదాస్పద చిత్రాలు 26 ఏళ్ళ పాటు వివిధ ఆర్ట్ గ్యాలరీల్లో ప్రదర్షింపబడ్డాయి. వీటికి కేవలం చిత్రకారులు, చిత్రలేఖనం పట్ల ఆసక్తి ఉన్నవారు మాత్రమే వెల్లి ఉంటారు. వీరు రచయిత చెప్పినట్లుగా దానిలో బూతుని కాకుండా ఇంకేదో చూసిఉంటారు కాబట్టి వివాదం అవ్వలేదు. కానీ వీటిని ఓ పత్రిక బూతుకోణంలో విష్లేశించి పత్రికలో ప్రచురించడంతోనే వివాదం మొదలైంది. ఎందుకంటే ఆర్ట్ గ్యాలరీలకి వెల్లే జనాభా కంటే పత్రికలు చదివే జనాభా చాలా ఎక్కువ కదా.. ఇక దీనిలో రాజకీయ పక్షాలు తల దూర్చాక వివాదం భౌతిక దాడుల దాకా వెల్లింది. ఏ ఒక్కరో చేసిన విష్లేశణని నమ్మి వయొలెంట్గా రియాక్ట్ అవ్వడం కాకుండా, మిగతా కళాకారులు దాని గురించి ఏమంటున్నారో( అనేక మంది హిందూ కళాకారులు కూడా, దానిలో బూతు ఏమీ లేదని, హుస్సేన్ కి మద్దతు తెలిపారు) విని అప్పటికీ కూడా నమ్మకం కుదరకపోతే కోర్టులో కేసు వేసి, అహింసాయుత ప్రదర్శనలతో నిరసన తెలపడం లాంటివి చేసి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు. దానికి కారణమైన రాజకీయ వ్యవస్థని నిరసిస్తూనే నేనీ వ్యాసం రాశాననుకుంటున్నా.. Thanks
చీకటి గారు అడిగిన అసలు ప్రశ్నకి సమాధానం చెప్పండి. బూతు బొమ్మలు వేసిన వాడు ఏ అప్పారావో, రామారావో అయితే హిందువులు అభ్యంతరం చెప్పేవాళ్ళా? ఆ బూతు బొమ్మలు వేసినవాని పేరు మక్బూల్ ఫిదా హుస్సేన్ కావడం వల్లే కదా అభ్యంతరం.
ReplyDeleteచీకటి గారు, ఆ విషయం మీరు వివరంగా వ్రాయండి. ఎందుకంటే హిందూ అనేది పెర్సియన్ భాష పదమే కానీ సంస్కృత పదం కాదు. ఇప్పుడు కూడా అరబ్ దేశాలలో ఇండియా పేరు హింద్ అనే వ్రాస్తారు. అలాగే సింధూ నది పేరు కూడా హింద్ అనే వ్రాస్తారు.
ReplyDelete1970 నుండి, 1996లో ఓ పత్రిక ప్రచురించే వరకూ, ఈ 26 ఏళ్ళ కాలంలో ఏ హిందువూ వాటిని చూడలేదా..?
ReplyDelete-------------------------------------
ఇది మీ పోస్టులోనే రాసారు కదా ?
విని అప్పటికీ కూడా నమ్మకం కుదరకపోతే కోర్టులో కేసు వేసి, అహింసాయుత ప్రదర్శనలతో నిరసన తెలపడం లాంటివి చేసి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు.
---------------------------
మంచిమాట చెప్పారు ! మీతో పాటు నేను కూడా అంగీకరిస్తున్నా . ఇలాంటి బౌతిక దాడులు జయప్రకాశ్ నారాయణ మీద , లగడపాటి మీద కూడా జరిగాయి అని మీకు తెలుసు కదా , వాటిని కూడా మీరు ఇదే రకం గా ఖండిస్తారు అని నేను అనుకుంటున్నాను . కానీ మీరు ఈ పోస్టు ఎవరి అభిప్రాయాన్ని బలపరుస్తూ రాసారో వారి అభిప్రాయం అడిగి చూడండి , వారు కుడా అది తప్పే అని అభిప్రాయపడితే మనం హుస్సేన్ గారి మీద దాడులు మీద మళ్ళీ చర్చిద్దాం . ఈ రెంటికి ఉన్న సంభందం ఏంటి అని మీరు అడగుతారేమో , నాకు రెండు ఒకే రకం గా తోస్తున్నాయి తమ అభిప్రాయం చెప్పిన వారి మీద భౌతికదాడులు ఎక్కడ చేసినా అని తప్పే అని నా అభిప్రాయం .
@Sravya:
ReplyDeleteThe following is the link of my post condemning attack on JP.
http://andamainacheekati.blogspot.com/2011/02/blog-post_17.html
@Praveen:
sure.. 'll reply to your comments later.. busy with some other work now. Thanks.
ఒక వెబ్‌సైట్‌లో ఎం.ఎఫ్.హుస్సేన్ బూతు బొమ్మల గురించి చర్చలు చదివాను. అతని బూతు బొమ్మలని సమర్థించినవాళ్ళలో ఎక్కువ మంది హిందువులే. ఏ అప్పారావో, రామారావో వేసినట్టే ఎం.ఎఫ్.హుస్సేన్ కూడా బూతు బొమ్మలు వేశాడనుకున్నారు. మనవాళ్ళకి మతం మీద భక్తి లేదు కానీ వేరే మతంవాళ్ళ మీద పడి ఏడుస్తాం.
ReplyDeleteచీకటి గారూ,
ReplyDeleteనాకు టూకీగా సారాంశం అర్థం కాలేదు. మీరు ఎం.ఎఫ్ హుస్సైన్, తస్లీమా నస్రీన్ మీద దాడులకి వ్యతిరేకమా లేక వారి కళాత్మక దృష్టి మీద కూడానా?
"నిజానికి ఆ పత్రిక ప్రచురించిన హుస్సేన్ చిత్రాలు అతను 1970లో గీసినవి. 1970 నుండి, 1996లో ఓ పత్రిక ప్రచురించే వరకూ, ఈ 26 ఏళ్ళ కాలంలో ఏ హిందువూ వాటిని చూడలేదా..? హుస్సేన్ ఆ చిత్రాల్ని ముస్లింలో, క్రిష్టియన్లో చూసి ఆనందించాలని రహస్యంగా గీశాడా..? వాటిని కేవలం అరబ్ దేశాల్లోనో, క్రిష్టియన్ దేశాల్లోనో ప్రదర్శనకి పెట్టాడా..? "
పై వాక్యాలు మీరు హుస్సైన్ కళాత్మక దృష్టికి అనుకూలంగా ఉన్నారని తోస్తున్నాయి. నాకు కలిగిన మరిన్ని సందేహాలని మీ ముందు ఉంచే ముందు మీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందామని పై ప్రశ్న అడుగుతున్నాను.
ఆ బొమ్మలపై నా అభిప్రాయాన్ని ఆల్రెడీ ఒక కామెంటుకి సమాధానంగా రాసి ఉన్నాను. ఈ పోస్టు ఉద్దేశ్యం ఆ బొమ్మలపై రివ్యూ చేయడం కాదు. ఒకే రకమైన నేరం చేసిన ఇద్దరు కళాకారుల్ని ఎవరి రాజకీయాలు, విశ్వాసాలకు అనుగునంగా ఎలా సమర్థిచడం/వ్యతిరేకించడం చేస్తున్నారు అనే డబుల్ స్టాండర్డ్స్ ని ఎత్తి చూపడమే.
ReplyDelete