ఇటీవల ఓ నిజజీవిత సంఘటన ఆధారంగా 'No one killed Jessica' అనే సినిమా వచ్చింది. 1999 లో, అర్థరాత్రి టైం దాటి పోవటం వల్ల లిక్కర్ అమ్మడానికి నిరాకరించిన పాపానికి, ఓ హర్యానా మంత్రి కొడుకు చేతిలో హత్యకావించ బడిన 'జెస్సికా లాల్ ' ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. సుమారు 300 మంది ఉన్న ఆ పార్టీలో, అంత మంది ప్రత్యక్ష సాక్షుల కల్ల ముందే ఈ హత్య జరిగినప్పటికీ, మంత్రి గారి డబ్బు,అధికారానికి భయపడి ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాకపోవటంతో, క్రింది కోర్టు మంత్రి గారి కొడుకును, అతనికి సహకరించిన అతని మిత్రుల్ని నిర్దోషులుగా విడుదల చేసింది. ఆ తర్వాత NDTV మరియు ఇతర జాతీయ మీడియా 'ఓ అమ్మాయి ప్రాణం ఖరీదు, ఓ లిక్కర్ బాటిల్ తో సమానమా..? అంటూ దీనికి విషేశ ప్రాధాన్యం కలిగించడంతో, ప్రజాభి ప్రాయానికి తలవంచిన హైకోర్టు కేసును పునర్విచారన చేసి, మంత్రి కొడుకుకి యావజ్జీవ శిక్ష విధించటం జరిగింది.ఇలా ఏ తప్పూ చేయకపోయినా, అర్ధాంతరంగా తనువు చాలించిన జెస్సికా మీద మొదట్లో చాలా సానుభూతి కలిగినప్పటికీ, నేరం చేసిన వాడు మంత్రి కుమారుడైనా చట్టం అతడిని శిక్షించగలిగిందనే తృప్తి కలిగేలా ఈ సినిమా రూపొందించబడింది. మీడియా చివరివరకూ పోరాడటం వల్ల జెస్సికా మృతికి బాధ్యులైన వారిని చట్టం శిక్షించగలిగింది. కానీ ఈ మాత్రం అవకాశం కూడా లేని దురదృష్ట జెస్సికాలు ఇంకెంత మంది ఉన్నారో..?
#కొన్నేల్ల క్రితం సినీ హీరో బాలక్రిష్ణ ఇంట్లో కాల్పుల ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత, బాలక్రిష్ణ ఇంటి వాచ్ మేన్ హత్య చేయబడ్డాడు. కొన్ని రోజులు హడావుడి చేసిన తెలుగు మీడియా తర్వాత ఈ విషయాన్ని అటకెక్కించేయటం తో, ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలీదు.ఇక్కడ ఒక పేద వాచ్ మేన్ ప్రాణం ఖరీదు ఎంతో ఎలా చెప్పడం..?
#మొన్న ముంబై మీద 11 మంది తీవ్రవాదులు చేసిన దాడిలో సుమారు 200 మంది అమాయకులు మరణించారు. ఆ తర్వాత భద్రతా దలాల చేతిలో 10 మంది తీవ్రవాదులు హతమయ్యారు. అంటే ఒక్కో తీవ్రవాది ప్రాణం ఖరీదు 20 మంది ప్రాణంతో సమానమా..? ఇక్కడ బాధితులకి పూర్తి న్యాయం జరిగిందనుకోవాలా..? మరి అన్యాయానికి బాధ్యులు ఎవరు..?
#అట్లే ప్రతినిత్యం ఎంతో మంది అమాయకులు బూటకపు ఎన్కౌంటర్లలోనూ,ఇంఫార్మర్లు,కోవర్టులనే నెపంతోనూ, కాష్మీర్ లాంటి చోట్ల భద్రతాదళాలు,టెర్రరిస్ట్ ల చేతుల్లో అసువులుబాస్తున్నారు. మరి వీరందరి చావులకూ అకౌంటబిలిటీ ఉంటుందా..? వీరి ప్రాణాలకు విలువ లేదా..?
#మొన్నటికి మొన్న, సామూహిక జనహనన ఆయుధాలున్నాయనే నెపంతో, అగ్రరాజ్యాలు ఇరాక్ మీద చేసిన అక్రమ యుద్ధంలో మరణించిన వేలకొద్దీ అమాయక ప్రజలకు, అవిటివాల్లైన పసిపిల్లలకు న్యాయం చేసేదెవరు..? మేమనుకున్నట్లు అక్కడ మరు భూములు తప్ప, మారణాయుధాలు లేవు, చిన్న పొరబాటు జరిగింది అని అమెరికా అధ్యక్షులవారు ఇచ్చిన వివరణ, పోయిన ప్రాణాలకు ఖరీదు కట్టగలదా..?