The Hindu : News / National : Pakistani flag hoisting was a Hindutva plot to foment strife, police say
హిందూ పత్రికలో ఈ రోజు వచ్చిన పై వార్తను చదవండి.
వారికి బాగా అలవాటైన, 'విభజించు పాలించు ' అనే సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఈ సారి కాలం కలిసివచ్చినట్లు లేదు. తీరా వీరి కుటిల బుద్ధి బహిర్గతమయ్యాక నేరం మాది కాదంటే మాది కాదని ఒకరిపై ఒకరు వేలెత్తి చూపించుకుంటున్నారు. శ్రీ రాంసేన, భజరంగ్ దల్, RSS.... పేర్లు వేరైనా అందరి వ్యూహం ఒకటే. మైనారిటీలను మెజారిటీ మతస్తుల నుండి వేరు చేయడం, మైనారిటీలను వారికి బూచిగా చూపి, హిందువులను ఉద్ధరించేది తామేనని నమ్మబలికి వారి ఓట్లను కొల్లగొట్టడం. ఇదే వీరి అజెండా.. బ్రిటీష్ వాడినుంచి నేర్చుకున్న ఈ సూత్రాన్ని ఇప్పటిదాకా అనేకసార్లు విజయవంతంగా అమలుపరిచారు. కాకపోతే ఈసారి కాలం కలిసి వచ్చినట్లు లేదు పాపం..
సానియా మీర్జా పొట్టి గౌను పై, ఊరూ పేరూ లేని ఓ మారుమూల గ్రామం లోని ముసలి ముల్లా ఎవరైనా ఫత్వా జారీ చేస్తే.. అలాంటి వార్తల్ని ప్రముఖంగా ప్రచురించే మన తెలుగు మీడియా.. మన రాష్ట్రం పక్కనే జరిగిన పై సంఘటన గురించి మాత్రం రాయలేదు. బహుశా మన పాఠకులకు ఇలాంటివి నచ్చవనుకున్నారు కాబోలు. మన తెలుగు మీడియా ఇలాంటి ధోరనిని చూపడం ఇది మొదటిసారి కాదు.
సుమారు రెండేల్ల క్రితం, కర్నాటకలో ఓ హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయితో లేచిపోయిన సంఘటన ఇలాగే మతం రంగు పులుముకొని వివాదాస్పదం అయింది. 'లవ్ జీహాద్ ' పేరుతో ముస్లిం లందరూ కూడబలుక్కొని హిందూ అమ్మాయిల్ని లేవదీసుకు పోయే కార్యక్రమం పెద్ద యెత్తున చేస్తున్నారని, కాబట్టి ముస్లింలను దూరంగా ఉంచాలని శ్రీ రాం సేన, RSS లాంటి సంస్థలు నానా రాద్ధాంతం చేశాయి. పైదా దానికి ఆధారాలంటూ వివిధ 'లేచిపోయిన' లెక్కల్ని కూడా చూపించేవి. దీనిని అప్పట్లో 'ఈనాడు' పత్రిక ప్రముఖంగా ప్రచురించింది.. వారి కాకి లెక్కల్తో సహా. ఈ వివాదంపై స్పందించిన కర్నాటక ప్రభుత్వం(BJP), హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణా సంఘాన్ని వేసింది. సుమారు 2 నెలల విచారన అనంతరం 'లవ్ జీహాద్ ' అనేది ఒట్టి పుకారేననీ, ఆ లెక్కలన్నీ కాకి లెక్కలేననీ తేలింది. కానీ విచారణా సంఘం ఫలితాన్ని మాత్రం మన 'ఈనాడు' ప్రచురించలేదు. ఐనా నిరంతరం ఏదో ఒక పార్టీ కొమ్ముకాస్తూ వార్తల్ని రాసే మన పత్రికల నుండి ఇలాంటి విలువల్ని ఆశించడం అత్యాశేనేమో. కాకపోతే.. ఇలాంటి అసత్యాల్ని, అర్థ సత్యాల్ని మాత్రమే చదివి, తమకు మొత్తం తెలుసనుకొని ఫీలైపోయి, మనసు నిండా విద్వేషం నింపుకొని, పైన పేర్కొన్న సంస్థల్ని నికార్సైన దేశభక్త సంస్థలుగా భావిస్తూ, తమను మించిన దేశభక్తులు లేరనే భ్రమల్లో బతుకుతూ.. తమకు నచ్చని విషయాల్ని రాసే వారందరినీ ద్వేశించడమే పనిగా పెట్టుకున్న కొందరు దారి తప్పిన యువకులు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది..
ఇక అసలు ట్విస్టు ఏంటంటే.. 'మత పరమైన విభజన'కు ఆదినుండి ఆజ్యం పోసిందీ, దాని నుండి అత్యధిక లబ్ధి పొందిందీ BJP మరియా దాని అనుబంధ సంస్థలే.. కానీ మైనారిటీలకు మేలు చేసే రిజర్వేషన్లు, మత హింసా బిల్లు లాంటి అంశాలు చర్చకు వచ్చినప్పుడల్లా.. వీరు చేసే మొదటి ఆరోపణ- ఇవి 'మత పరమైన విభజనకు దారితీస్తాయట, కాబట్టి వీరు వాటిని సమర్థించరట.. మంచి జోక్ కదూ..